సీన్ కానరీ బ్రిటీష్ సూపర్ హిట్ `జేమ్స్ బాండ్` సిరీస్‌ని ప్రారంభించిన నటుడు కావడం విశేషం. 1962లో జేమ్స్ బాండ్ సిరీస్ `డాక్టర్ నెంబర్`తో ప్రారంభమైంది. టెరెన్స్యంగ్ దర్శకత్వం వహించగా, జేమ్స్ బాండ్ 007గా తొలిసారి సీన్ కానరీ నటించి మెప్పించాడు. సినిమాకి స్టయిలీష్ లుక్‌ని తీసుకొచ్చారు. ఆ తర్వాత `జేమ్స్ బాండ్` సిరీస్‌ప్రపంచ వ్యాప్తంగా ఎంతగా పాపులర్ అయ్యిందో తెలిసిందే. టాప్ గ్రాసర్ సిరీస్‌లో అదొకటిగా నిలిచింది.
అయితే సీన్ కానరీ ఈ సిరీస్‌లోని ఇప్పటి వరకు 25 సినిమాలు తెరకెక్కగా అందులో ఏడు సినిమాల్లో బాండ్‌గా సీన్ కానరీ నటించడం విశేషం. ప్రస్తుతం 25వ సినిమావిడుదలకు సిద్ధంగా ఉంది. ఇందులో డానియల్ క్రేగ్ నటిస్తున్నారు.
ఇక సీన్ కానరీ స్టయిలీష్, యాక్షన్ హీరోగా వరల్డ్ సినిమాలో పాపులర్ అయ్యారు. ఆయన `అన్‌టచబుల్` చిత్రానికిగానూ సహాయ నటుడిగా ఆస్కార్ అవార్డుని కూడా సొంతంచేసుకున్నారు.
వీటితోపాటు `మర్నీ`, `మర్డర్ ఆన్ ది ఓరియెంట్ ఎక్స్‌ప్రెస్`, ది మ్యాన్ హు వుడ్ బి కింగ్`, `ది నేమ్ ఆఫ్ ది రోజ్`, `హైలాండర్`, `ఇండియానా జోన్స్ అండ్ దిలాస్ క్రసేడ్`, `ది హంట్ ఫర్ రెడ్ అక్టోబర్`, `డ్రాగాన్‌హార్ట్`, `ది రాక్`, `ఫైండింగ్ ఫారెస్టర్` వంటి వరల్డ్ బాక్సాఫీసు చిత్రాల్లో మెప్పించారు.
స్కాట్‌లాండ్‌కి చెందిన అత్యంత గొప్ప నటుడిగా, వ్యక్తిగా నిలిచారు. ఒకానొక దశలో అత్యధిక పారితోషికం అందుకున్న స్టార్‌గా నిలిచారు.
`పీపుల్` మేగజీన్‌లో అత్యంతసెక్సీయెస్స్ మ్యాన్ ర్యాంక్ సంపాదించారు. నటుడిగా, నిర్మాతగా రాణించిన సీన్ కానరీ మరణం అంతర్జాతీయ సినిమాకు తీరని లోటు అని చెప్పొచ్చు.
సీన్ కానరీ 1962లో `డియానె కిలాంటోని అనే ఆస్ట్రేలియన్ నటి పెళ్ళి చేసుకున్నారు. 73లో ఆమెకి విడాకులు ఇచ్చారు.
ఆ తర్వాత 1975లో మైఖేలిన్ రోక్వెబ్రునేనివివాహం చేసుకున్నారు. వీరికి ఓ కుమారుడు జాసన్ కానరీ ఉన్నారు. ఆయన బ్రిటీష్ నటుడిగా, రచయితగా, దర్శకుడిగా రాణిస్తున్నారు.
సీన్ కానరీ ప్రపంచ సినిమాని ప్రభావితం చేసిన నటుల్లో ఒకరిగా నిలిచారు. ఆయన సినిమాలు బాక్సాఫీసు వద్ద కలెక్షన్లు సునామీ సృష్టించాయి. విలక్షణ నటనతో వరల్డ్ ఆడియెన్స్ ని ఆరు దశాబ్దాలకు పైగా మెప్పించిన ఘనత ఆయన సొంతం. ఆయన మృతి పట్ల ప్రపంచ సినీ వర్గాలు తీవ్ర సంతాపం తెలియజేస్తున్నాయి.