బాలీవుడ్‌లో అందమైన కపుల్‌లో షాహిద్ కపూర్, మీరా రాజ్‌పుత్ జంట ఒకరు. సాధ్యమైనంత వరకు ప్రైవేట్ లైఫ్‌ని గడుపుతూనే తమకి సంబంధించిన అనేక రహస్యాలను వెల్లడించి వార్తల్లో నిలుస్తుందీ క్రేజీ జంట. అందులో భాగంగా తాజాగా పలు కొత్త విషయాలను పంచుకున్నారు.
బెడ్‌పై ఏ విషయాల్లో స్కేరీగా ఉంటారని ప్రశ్నించగా, అందుకు షాహిద్ కపూర్ సమాధానం చెప్పేందుకు ఆలోచించారు. కానీ మీరా మాత్రం నిర్మొహమాటంగా చెప్పేసింది. బెడ్‌పైకి వచ్చాక షాహిద్ తాను ఏం చేయాలనుకుంటున్నాడో తనకు చెప్పేస్తాడని తెలిపింది. అతను కంట్రోల్ ప్రీక్ అని చెప్పింది.
అందుకు షాహిద్ స్పందించారు. మరో కొత్త విషయాన్ని రివీల్ చేశారు. మీరా రాత్రి సమయాల్లో తన దుస్తులు వేసుకుని నిద్రిస్తుందని, ఇది అందమైన విషయమని, ఆ దుస్తుల్లో మీరా ఎంతో అందంగా కనిపిస్తుందని తెలిపారు.
పడుకున్నప్పుడు మధ్యలో మీరా తాను కప్పుకునే దుప్పటి తీసేస్తుంది. చల్లగా, తనపై దుస్తులు లేకుండా పడుకునేలా చేస్తుందని తెలిపారు. వీరిద్దరిలో ఇబ్బంది కలిగించే అంశాలేంటని కరణ్ అడిగినప్పుడు అందుకు సమాధానం చెప్పేందుకు షాహిద్ నిరాకరించారు. అయితే ఆయనకు కోపం ఎక్కువని మీరా చెప్పింది.
బాలీవుడ్‌లో స్టార్ హీరోగా రాణిస్తున్న షాహిద్ కపూర్ 2015లో ఢిల్లీకి చెందిన మీరా రాజ్‌పుత్‌ని ఇష్టపడి పెళ్ళి చేసుకున్నారు. పూర్తి ప్రైవేట్ ఈవెంట్‌గా వీరి వివాహ వేడుక జరిగింది. వీరికి కుమార్తె మిషా, కుమారుడు జైన్ ఉన్నారు.
షాహిద్ కపూర్ 1997లో `దిల్ టూ పాగల్ హై` చిత్రంతో 2003లో `ఇష్క్ విష్క్` చిత్రంతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు.
`ఫిదా`, `దిల్ మాంగే మోర్`, `షిఖర్`, `జబ్ వి మెట్`, `కమినే`, `ఛాన్స్ పే డాన్స్`, `హైదర్`, `షాందార్`, `ఉడ్తా పంజాబ్`, `పద్మావత్`, `కబీర్ సింగ్` చిత్రాలతో స్టార్ హీరోగా ఎదిగారు.
ప్రస్తుతం టాప్ స్టార్స్ లో ఒకరిగా రాణిస్తున్న షాహిద్ కపూర్ `జెర్సీ` రీమేక్‌లో నటిస్తున్నారు. మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తుంది. ఇది తెలుగులో నాని హీరోగా వచ్చిన `జెర్సీ`కి రీమేక్. మాతృక దర్శకుడు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు.