ఎపిసోడ్ ప్రారంభంలో డెలివరీ టైం దగ్గర పడింది మీరందరూ ఇక్కడ ఉండకూడదు వెళ్లిపోండి అని చెప్తుంది డాక్టర్. సర్ మీరు మాత్రం ఇక్కడే ఉండండి అంటూ ఆర్యని రిక్వెస్ట్ చేస్తుంది అను. తప్పకుండా ఉంటాను భయపడకు అంటాడు ఆర్య. సార్ మీరు ఆ పెయిన్స్ చూసి తట్టుకోలేరు పానిక్ అయిపోతారు అంటూ ఆర్యని కూడా వెళ్ళిపోమంటుంది డాక్టర్.