కార్లల్లో తిరిగే మీకేం తెలుసు వీధికుక్కలతో బాధలు.. నెటిజన్ కి రష్మి గౌతమ్‌ షాకింగ్‌ ఆన్సర్‌..

Published : May 19, 2023, 07:50 PM IST

యాంకర్‌ రష్మి గౌతమ్‌ యానిమల్‌ లవర్‌ అనే విషయం తెలిసిందే. అయితే అది కొన్ని సార్లు ఈ హాట్‌ జబర్దస్త్ యాంకర్‌ని ఇబ్బందుల్లో పడేస్తుంది. తాజాగా వీధి కుక్కల దాడిలో మరో చిన్నారి చనిపోవడంతో దాని ఎఫెక్ట్ రష్మిపై పడింది. 

PREV
16
కార్లల్లో తిరిగే మీకేం తెలుసు వీధికుక్కలతో బాధలు.. నెటిజన్ కి రష్మి గౌతమ్‌ షాకింగ్‌ ఆన్సర్‌..

ఆ మధ్య వీధికుక్కల దాడిలో ఓ చిన్నారి బలయ్యాడు. ఆ తర్వాత అడపాదడపా కుక్కల దాడుల ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా మరో ఘటన చోటు చేసుకుంది. వీధికుక్కల దాడిలో మరో చిన్నారి కన్నుమూసిన ఘటన రాష్ట్రాన్ని షాక్ కి గురి చేస్తుంది. ఇది హన్మకొండ జిల్లా కాజీపేట రైల్వే క్వార్టర్స్ సమీపంలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. అయితే దీని ప్రభావం ఇప్పుడు యాంకర్‌ రష్మిపై పడింది. 

26

జబర్దస్త్ యాంకర్‌ రష్మి.. యానిమల్‌ లవర్‌(జంతు ప్రేమికురాలు). ముఖ్యంగా కుక్కల విషయంలో ఆమె ఎక్కువగా కేర్‌గా ఉంటారు. నిత్యం ఏదో ఒక సంఘటనని సోషల్‌ మీడియాలో పంచుకుంటూ కుక్కలను, లేదంటే ఏదైనా జంతువులను కాపాడాలని పోస్ట్ చేస్తుంటుంది. అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తుంటుంది. ఎవరైనా ఏ యానిమల్‌ని హింసించినా తట్టుకోదు, తనదైన స్టయిల్‌లో రియాక్ట్ అవుతుంటుంది. తాజాగా కాజీపేట రైల్వే స్టేషన్‌లో చిన్నారిని కుక్కలు కరిచి చంపిన నేపథ్యంలో దాన్ని ట్యాగ్‌ చేస్తూ దీనికి ఏం సమాధానం చెబుతారని రష్మిని నిలదీస్తున్నారు నెటిజన్లు. 
 

36

తెలంగాణలో వీధికుక్కల దాడిలో మరో బాలుడు మృతి, ఈ న్యూస్‌ చూశారా మేడం. మీరుజంతు ప్రేమకులు కాదనడం లేదు, నిత్యం కార్లలో బంగ్లాలో ఉండే మీకు ఏం తెలుస్తుంది. వీధి కుక్కల కోసం మీకు డబ్బు ఉంది. బాబు వాళ్ల నాన్న రోడ్ పైన చెవి రింగులు అమ్ముకుంటాడు` అని ఓ నెటిజన్ పోస్ట్ పెడితే, `ఒక సినిమా పోతేనే తట్టుకోలేని మీరు అక్కడ ఒక బాబు ప్రాణం పోతే వాళ్ల అమ్మనాన్నలు ఎలా తట్టుకుంటారు. దయజేసి వాళ్లకి ఏదో ఒక రూపంలో హెల్ప్ చేయండి. మీరు పెంపుడు కుక్కలు మధ్య పెరుగుతారు. సాధారణ జనం వీధికుక్కల మధ్య పెరుగుతారు` అంటూ మరో నెటిజన్లు పోస్ట్ చేశారు. 
 

46

దీనికి రష్మి గౌతమ్‌ రియాక్ట్ అయ్యింది. షాకింగ్‌ ఆన్సర్‌ ఇచ్చింది. నన్ను ట్యాగ్‌ చేయడం, ఈ విషయాలను నన్ను అడగడం వల్ల ఎలాంటి సహాయం రాదు, నేను ప్రభుత్వం కాదు, నిధులుజారీ చేయను, ఆ నిధులను తినను. నిజానికి నేను చేయగలిగినంత కుక్కలకు క్రిమిరహితం చేయడానికి వ్యక్తిగత డబ్బుని ఉపయోగిస్తున్నా అని తెలిపింది.

56
Rashmi Gautam

మరో ప్రశ్నికి చెబుతూ, మీరు తప్పుగా ట్యాగ్‌ చేశారని, దీనికి ప్రభుత్వానికి ట్యాగ్‌ చేయాలని, చట్టవిరుద్ధమైన పెంపకంపై కఠినమైన చర్యలు తీసుకోండి. ప్రత్యక్ష పెంపుడు జంతువుల అమ్మకం, కొనుగోలుని నిషేధించండి. మన కుక్కలను దత్తత తీసుకోవచ్చు, వాటిని రోడ్లపై లేకుండా చేయవచ్చు` అని తెలిపింది రష్మి. దీంతో ప్రస్తుతం రష్మి కామెంట్లు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

66

ఇక యాంకర్‌ రష్మి ప్రస్తుతం `ఎక్స్ ట్రా జబర్దస్త్` షోకి యాంకర్‌గా వ్యవహరిస్తుంది. దీంతోపాటు `శ్రీదేవి డ్రామా కంపెనీ`కి ఆమె యాంకర్‌గా చేస్తుంది. అడపాదడపా గ్లామర్‌ షోతో నెటిజన్లని ఆకట్టుకుంటుంది. మధ్యలో ఇలా పెట్‌ లవర్‌గా తన ఆవేదన వ్యక్తం చేస్తుంటుంది. అదే సమయంలో ఇలాంటి ఘటనల కారణంగా ట్రోల్స్ కి కూడా గురవుతుందీ హాట్‌ యాంకర్‌. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories