Ranbir Kapoor net worth : రన్బీర్ కపూర్ కు ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా? బంగ్లాలు, కాస్ట్లీ కార్లు, ఇలా..

First Published | Nov 28, 2023, 11:04 AM IST

బాలీవుడ్ స్టార్ హీరో రన్బీర్ కపూర్ ప్రస్తుతం అన్నీ భాషల్లో క్రేజ్ దక్కించుకుంటున్నారు. ప్రస్తుతం ‘యానిమల్’ చిత్రంతో రాబోతున్నారు. ఈ సందర్భంగా రన్బీర్ ఆస్తుల విలువ షాకింగ్ గా మారింది. 

బాలీవుడ్ స్టార్ హీరో రన్బీర్ కపూర్ (Ranbir kapoor)   తన కెరీర్ లో చాలానే కూడబెట్టాడు. వరుసగా బిగ్ ప్రాజెక్ట్ తో అలరిస్తున్నారు. ఈ సమయంలో భారీగానే ఛార్జ్ చేస్తున్నారు. అలాగే పలు బ్రాండ్స్ ను ప్రమోట్ చేస్తున్నారు. ఈ క్రమంలో రన్బీర్ ఇప్పటి వరకు కూడబెట్టిన ఆస్తివిలువ ఎంతనేది ఆసక్తికరంగా మారింది. 

మహారాష్ట్రలోని బొంబాయిలో రిషి కపూర్, నీతూ సింగ్ దంపతులకు రన్బీర్ కపూర్ 28 సెప్టెంబర్ 1982న జన్మించాడు. ఆయనకు అక్క రిద్ధిమా ఉంది. ఆమె ఫ్యాషన్ డిజైనర్. కరిష్మా, కరీనా అతని కజిన్స్ ఉన్నారు. మొదటి నుంచే రిచ్ ఫ్యామిలీలో ఉన్నారు. 


రన్బీర్ కపూర్ కు మూడు ఖరీదైన ఇల్లు ఉన్నట్టు తెలుస్తోంది. బాంద్రాలోని వాస్తు పాలి హిల్ బిల్డింగ్‌లో 5, 7వ అంతస్తులో 2460 చదరపు అడుగుల విస్తీర్ణంలో రెండు ఇల్లు ఉన్నాయి. వాటి ఖరీదు ఒక్కొక్కటి రూ.35 కోట్లు ఉంటుందని సమాచారం. ఏడో అంతస్తులు తను నివాసం ఉంటున్నాడు. ఐదో అంతస్తును రూ.8 లక్షలకు అద్దెకు ఇచ్చాడు.  

అప్పటికే 500 కోట్ల విలువ గల కృష్ణ రాజ్ బంగ్లాకు వారసుడు. ఇది 15 అంతస్తుల అపార్ట్‌మెంట్‌. అతని తల్లి నీతూ కపూర్‌కు కూడా బాంద్రాలోని విల్సన్ అపార్ట్‌మెంట్‌లో అపార్ట్‌మెంట్ ఉండటం విశేషం. రన్బీర్ సొంత ప్రాపర్టీస్ విషయానికొస్తే.. రూ.100కోట్ల వరకు ఉంటుందని తెలుస్తోంది. 

కార్ల విషయాానికొస్తే..  ఆడి R 8, రూ. 1.6 కోట్ల విలువైన వైట్ రోవర్ రేంజ్ రోవర్ వోగ్, రూ.87 లక్షల విలువైన రేంజ్ రోవర్ స్పోర్ట్స్, రూ.1.56 కోట్ల విలువైన ఆడి A8l,  రూ. 2.14 కోట్ల విలువ గల Mercedes Benz G63 AMG వంటి లగ్జరీ కార్లు ఉన్నాయి. మొత్తం కార్ల విలువ రూ.7 కోట్లకు పైనే ఉంటుంది. 

అలాగే ఇండియన్ సూపర్ లీగ్ ఫుట్‌బాల్‌లో ముంబై సిటీ FC అనే స్పోర్ట్స్ టీమ్‌ని కూడ రన్బీర్ సొంతం చేసుకున్నాడు. ఇక రన్బీర్ ఒక్కో సినిమాకు రూ. 70 కోట్ల వరకు ఛార్జ్ చేస్తున్నారు. ‘యానిమల్’ సినిమాకే అత్యధికంగా అందుకున్నారు. అన్ని కలుపుకొని నెలవారీ ఆదాయమే రూ. 4 కోట్లు ఉంటుంది. 

రన్బీర్ కపూర్ పలు బ్రాండ్ ఎండార్స్‌మెంట్ల కోసం ఒకరోజు షూట్ కే రూ.6 కోట్లు వసూలు చేస్తాడు. ఇలా పది బ్రాండ్లకు అతను పనిచేస్తున్నారు. ఇలా మొత్తం కలుపుకొని 2023 నాటికి రన్బీర్ కపూర్ నికర ఆదాయం 598 కోట్లకు చేరింది. గత నాలుగేళ్లలోనే మరింతగా సంపాదించాడు. 

ఇక రన్బీర్ చివరిగా ‘బ్రహ్మస్త్రం’, ‘షంషేరా’ వంటి చిత్రాలతో అలరించారు. ప్రస్తుతం ‘యానిమల్’తో రాబోతున్నారు.  సందీప్ రెడ్డి వంగ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం డిసెంబర్ 1న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. నిన్నటి ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మహేశ్ బాబు, ఎస్ఎస్ రాజమౌళి కూడా హాజరై ఆల్ ది బెస్ట్ చెప్పారు. 

Latest Videos

click me!