నెట్టింట ‘జైలర్’ కోడలు అందాల విందు.. ట్రెడిషనల్ లుక్ లో మిర్నా మీనన్ బ్యూటీఫుల్ స్టిల్స్..

First Published | Aug 20, 2023, 3:02 PM IST

‘జైలర్’ కోడలు మిర్నా మీనన్ వెండితెరపైనే కాకుండా సోషల్ మీడియాలోనూ ఆకట్టుకుంటంది. నెట్టింట కాస్తా గ్లామర్ మెరుపులతో మైమరిపిస్తోంది. తాజాగా ట్రెడిషనల్ లుక్ లో మెరిసినా స్టన్నింగ్ లుక్ తో అట్రాక్ట్ చేస్తోంది. 
 

సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) లేటెస్ట్ ఫిల్మ్ ‘జైలర్’. ఇప్పుడు ఈమూవీ హవానే సాగుతోంది. ప్రేక్షకులను అలరించడంతో పాటు బాక్సాఫీస్ వద్ద కూడా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. అయితే, ఈ మూవీలో నటించిన మిర్నా మీనన్ కు కూడా మంచి గుర్తింపు దక్కింది. 
 

మలయాళీ ముద్దుగుమ్మ  మిర్నా మీనన్ (Mirna Menon) ఈ చిత్రంలో ‘జైలర్’ కోడలిగా నటించింది. వెండితెరపై పద్ధతిగా కనిపించడంతో పాటు అద్భుతమైన నటనను ప్రదర్శించింది. ఈ బ్యూటీ పెర్ఫామెన్స్ కు ఆడియెన్స్ ఫిదా అవుతున్నారు.


అయితే, మిర్నా మీనన్ సోషల్ మీడియాలోనూ సందడి చేస్తోంది. బిగ్ స్క్రీన్ పై కాస్తా పద్ధతిగా మెరిసిన ఈ ముద్దుగుమ్మ నెట్టింట మాత్రం గ్లామర్ మెరుపులు మెరిపిస్తోంది. అదిరిపోయే అవుట్ ఫిట్లలో ఫొటోషూట్లు చేస్తూ మంత్రముగ్ధులను చేస్తోంది. 
 

తాజాగా మిర్నా మీనన్ ట్రెడిషనల్ లుక్ లో మెరిసింది. సంప్రదాయ దుస్తుల్లో ఈ ముద్దుగుమ్మ బ్యూటీఫుల్ లుక్ ను సొంతం చేసుకుంది. అయితే పద్ధతిగా మెరిసినా గ్లామర్ షోతో మైమరిపించింది. గుచ్చే చూపులు, షోల్డర్ గ్లామర్, నడుము అందంతో చూపుతిప్పుకోకుండా చేసింది.
 

ఇక ఈ ముద్దుగుమ్మ ఇప్పుడిప్పుడే నెట్టింట ఫేమ్ దక్కించుకుంటోంది. ఈక్రమంలో గ్లామర్ మెరుపులు మెరిపిస్తూ బ్యూటీఫుల్ లుక్స్ తో  ఆకట్టుకుంటోంది. నెటిజన్లను తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తోంది. మరింతగా ఫాలోయింగ్ పెంచుకుంటోంది.
 

ప్రస్తుతం మిర్నా మీనన్ కు ఇన్ స్టాలో 83 లక్షలకు పైగా ఫాలోవర్స్ ను కలిగి ఉంది. త్వరలో వన్ మిలియన్ ఫ్యామిలీ క్లబ్ లో జాయిన్ కానుంది. ఈ సందర్భంగా బ్యాక్ టు బ్యాక్ నెట్టింట బ్యూటీఫుల్ లుక్స్ లో దర్శనమిస్తూ అట్రాక్ట్ చేస్తోంది.  
 

ఇదిలా ఉంటే.. ఈ ముద్దుగుమ్మ ఇప్పటికే తెలుగు రెండు సినిమాలు చేసింది. ఆది సాయి కుమార్ సరసన ‘క్రేజీ ఫెలోస్’,  అల్లరి నరేశ్ సరసన ’ఉగ్రం’లో  ఫీమేల్ లీడ్ రోల్స్ లో  నటించింది. కానీ ఆ చిత్రాలతో మలయాళీ ముద్దుగుమ్మకు పెద్దగా గుర్తింపు రాలేదు.  

ఎట్టకేళలకు ‘జైలర్’తో మిర్నా మీనన్ కు కావాల్సినంత క్రేజ్ దక్కింది. తన నటనకు వందశాతం మార్కులు అందాయి. దీంతో తెలుగులో ఇప్పటి నుంచి వరుస చిత్రాలతో అలరిస్తుందని ఆమె అభిమానులు ఆశిస్తున్నారు.
 

Latest Videos

click me!