ప్రముఖ ఫిలిం క్రిటిక్ ఈ వివాదంలో రజనీని సమర్థించారు. యోగి ఆదిత్యనాథ్ కేవలాం ముఖ్యమంత్రి మాత్రమే కాదు.. ఆయన హిందూ స్వామీజీ కూడా. గోరఖ్ నాథ్ క్షేత్రానికి ఆయన పీఠాధిపతి. పీఠాధిపతులని, స్వామీజీలని కలసినప్పుడు వాళ్లకి పాదాభివందనం చేసి ఆశీర్వాదం తీసుకోవడం మన ఆచారం. ఆ కోణంలో రజనీకాంత్.. యోగి ఆదిత్యనాథ్ కాళ్ళకి నమస్కరించారు. యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి కాబట్టి రజనీకాంత్ అలా చేయలేదు. అది పూర్తిగా రజనీకాంత్ వ్యక్తిగత విషయం అని ఫిలిం క్రిటిక్ అన్నారు.