Jailer 2 Movie 4 Days Collections: బాక్సాఫీసు వద్ద జైలర్‌ 2 సునామీ.. 400కోట్లు దాటేసిన రజనీకాంత్‌ సినిమా

Published : Oct 19, 2026, 07:47 AM IST

రజనీకాంత్‌ హీరోగా నటించిన `జైలర్‌ 2` మూవీ బాక్సాఫీసు వద్ద సంచలనాలు సృష్టిస్తోంది. ఈచిత్రం నాలుగు రోజుల్లోనే నాలుగు వందల కోట్లు దాటింది. సౌత్‌ సినిమాలోనే వీకెండ్‌లో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది.

PREV
13
బాక్సాఫీసుని షేక్‌ చేస్తోన్న జైలర్‌ 2

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ ఇటీవల `జైలర్‌ 2` చిత్రంలో ఆడియెన్స్ ముందుకు వచ్చారు.. దీనికి నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ దర్శకత్వం వహించగా ఇందులో రమ్యకృష్ణ ఆయనకు జోడీగా నటించింది. అలాగే ఎస్‌ జే సూర్య, విద్యాబాలన్‌, మిథున్‌ చక్రవర్తి, మిర్నా వంటి వారు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇందులో మోహన్‌ లాల్‌, శివరాజ్‌ కుమార్‌, హృతిక్‌ రోషన్‌, విజయ్‌ సేతుపతి గెస్ట్ రోల్స్ చేశారు. నిర్మాత కళానిధి మారన్‌ తన సన్‌ పిక్చర్స్ పతాకంపై నిర్మించిన ఈ మూవీ దసరా కానుకగా గురువారం విడుదలయ్యింది. మూడేళ్ల క్రితం వచ్చిన `జైలర్‌` మూవీ పెద్ద హిట్‌ కావడంతో దానికి సీక్వెల్‌గా ఈ `జైలర్‌ 2`ని రూపొందించారు. భారీ అంచనాలతో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీసుని షేక్‌ చేస్తోంది.

23
రజనీకాంత్‌ జైలర్‌ 2 కలెక్షన్లు

రజనీకాంత్‌ `జైలర్‌ 2` బాక్సాఫీసు వద్ద ర్యాంపేజ్‌ ఆడుతున్నారు. సరైన సినిమా పడితే తన రేంజ్‌ ఏంటో చూపిస్తున్నారు. ఇది కేవలం నాలుగు రోజుల్లోనే నాలుగు వందల కోట్లు దాటడం విశేషం. నాల్గో రోజు ఈ సినిమాకి రూ.55.85కోట్లు (ఇండియా నెట్‌) వచ్చాయి. తమిళంలో దాదాపు నలభై కోట్లు వస్తే, తెలుగులో రూ.9.50కోట్లు వచ్చాయి. ఓవర్సీస్‌లో దీనికి నలభై కోట్లు వచ్చాయి. తమిళంలో కంటే ఓవర్సీస్‌లోనే ఎక్కువగా వస్తున్నాయి. మొత్తంగా నాలుగు రోజుల్లో రూ.424.25కోట్ల గ్రాస్‌ వచ్చింది. ఓవర్సీస్‌లో మొత్తంగా రూ.190కోట్లు రాగా, ఇండియాలో దీనికి రూ.234.25కోట్ల గ్రాస్‌ రావడం విశేషం. ఈ సినిమా ఇండియా కలెక్షన్లతో, ఓవర్సీస్‌ వసూళ్లు పోటీ పడుతుండటం విశేషం. ఓవర్సీస్‌లో రజనీ మానియా ఏ రేంజ్‌లో ఉంటుందనేదానికిది నిదర్శనంగా చెప్పొచ్చు.

33
వెయ్యి కోట్ల దిశగా జైలర్ 2

`జైలర్‌ 2` మూవీకి దాదాపు రూ.300కోట్ల బడ్జెట్‌ అయ్యిందని సమాచారం. దీనికి రూ.300 కోట్ల థియేట్రికల్‌ బిజినెస్‌గా లెక్క కట్టారు. సినిమా హిట్‌ కావాలంటే దాదాపు ఆరువందల కోట్ల గ్రాస్‌ రావాలి. మొదటి వీకెండ్‌లోనే నాలుగు వందలు దాటింది. ఈ వారంలోనే సేఫ్‌లోకి వెళ్తుంది. ఆ తర్వాత వచ్చేవన్నీ లాభాలే అని చెప్పొచ్చు. ఈ మూవీ జోరు చూస్తుంటే వెయ్యి కోట్లని టచ్‌ చేసే అవకాశాలున్నాయి. ఇప్పటి వరకు తమిళ చిత్రాల్లో ఏదీ వెయ్యి కోట్లు టచ్‌ చేయలేదు. ఇప్పుడు `జైలర్‌ 2` ఆ రికార్డ్ ని బ్రేక్‌ చేయబోతుందని ట్రేడ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరి ఏ రేంజ్‌కి వెళ్తుందో చూడాలి.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories