చెల్లి ఖుషి కపూర్ ఫొటోలపై అక్క జాన్వీ కపూర్ రియాక్షన్.. మరీ ఇంతలానా.!

First Published | Oct 4, 2023, 11:23 AM IST

అతిలోక సుందరి, దివంగత శ్రీదేవి కూతుళ్లు జాన్వీ కపూర్, ఖుషీ కపూర్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో తెలిసిందే. తాజాగా చెల్లెలు లెటెస్ట్ ఫొటోలపై అక్క జాన్వీ ఆసక్తికరంగా స్పందించింది. 
 

అతిలోక సుందరి, దివంగత శ్రీదేవి కూతుర్లు జాన్వీ కపూర్ (Janhvi Kapoor), ఖుషీ కపూర్ (Kushi Kapoor) సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గానే కనిపిస్తుంటారు. తమ గురించిన అప్డేట్స్ అందిస్తూ ఉంటారు. తాజాగా ఖుషీ కపూర్ తన వెకేషన్ నుంచి కొన్ని ఫొటోలను షేర్ చేసింది. వాటిపై అక్క జాన్వీ ఇంట్రెస్టింగ్ గా స్పందించింది.
 

ప్రస్తుతం ఖుషీ కపూర్ పారిస్ లో సందడి చేస్తోంది. పారిసియన్ లుక్‌లో ఆకట్టుకుంది. మినీ స్కర్ట్, వైట్ స్వెటర్, మోకాళ్లపైకి ఉన్న షూస్ ధరించి స్టైలిష్ గా మెరిసింది. పారిస్ వీధుల్లో చక్కర్లు కోడుతూ ఆకట్టుకుంటోంది. జాన్వీ కపూర్ లేటెస్ట్ లుక్ కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. 


లేటెస్ట్ పిక్స్ లో తన ఫ్యాషన్ సెన్స్ తో ఆకట్టుకుంది. అలాగే ఈఫిల్ టవర్ అందాలను, సిటీ వ్యూను చూపించే ఫొటోలతోనూ ఫ్యాన్స్ ను ఖుషీ చేసింది. పారిస్ లో షికార్లు చేస్తూ ఫొటోలకు ఇలా క్రేజీగా ఫోజులిచ్చింది. ప్రస్తుతం ఈ పిక్స్  వైరల్ గా మారాయి. 
 

అయితే ఖుషీ కపూర్ ఫొటోలపై అభిమానులు, నెటిజన్లు స్పందిస్తున్నారు. ఆమె లుక్ కు ఫిదా అవుతూ కామెంట్లు పెడుతున్నారు. లైక్స్ తో పిక్స్ ను వైరల్ చేస్తున్నారు. ఈ క్రమంలో అక్క జాన్వీ కపూర్ కూడా చెల్లెలి ఫొటోలపై స్పందించింది. 
 

కామెంట్ సెక్షన్లో ఇలా స్పందించింది. ‘అద్భుతమైన యువరాణి, నా లడ్డూ, నా జాంగ్రీ, నా మైసూర్ పాక్, నా బంగారం’ అంటూ చెల్లెలిపై ప్రేమవర్షం కురిపించింది. జాన్వీ కామెంట్ చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. చెల్లెలిపై జాన్వీకి ఇంత ప్రేమ ఉందా.. ఇంతలా ఆకాశానికి ఎత్తాలా అంటూ స్పందిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఖుషీ కపూర్ తన బాత్ రోబ్ ఫొటోలనూ షేర్ చేసింది. మిర్రర్ సెల్ఫీలతో ఆకట్టుకుంది. 

శ్రీదేవి మరణం తర్వాత జాన్వీ కపూర్ తన చెల్లెల్లితో కలిసి దిగిన ఫొటోలను తరుచూగా పంచుకుంటూ వస్తోంది. అలాగే ఖుషీ కపూర్ పోస్టులకు ఎప్పటికప్పుడు మద్దతిస్తుంటుంది. దీంతో  చెల్లిలి విషయంలో జాన్వీ చాలా కేరింగ్ గానూ ఉంటుందని అర్థం అవుతుంది. ఇక ఖుషీ కపూర్ ‘ది ఆర్చీస్’ అనే చిత్రంతో బాలీవుడ్ లో తెరంగేట్రం చేయనుంది. డిసెంబర్ లో విడుదల కాబోతోంది. జాన్వీ కపూర్ ఎన్టీఆర్ సరసన ‘దేవర’లో నటిస్తున్న విషయం తెలిసిందే.

Latest Videos

click me!