ఈరోజు ఎపిసోడ్ లో సౌందర్య దేవుడు నా మాట విన్నాడు నా కొడుకు, కోడలిని అని తిరిగి పంపించాడు అనుకుంటూ ఉండగా అప్పుడు కార్తీక్ ఏడవకు మమ్మీ మేము వచ్చేసాము కదా అని అంటాడు. అప్పుడు ఆనందరావు ఏడవని నాన్న ఇన్నాళ్లు ఇదే ఏడుపు కానీ అప్పుడు అప్పుడు కన్నీళ్లలో బాధ ఇప్పుడు ఈ కన్నీళ్లలో ఆనందం అని అంటాడు. అప్పుడు సౌందర్య మాములు రెట్టింపు కాదు నాన్న నువ్వు పుట్టినప్పుడు కన్నా రెట్టింపు సంతోషం అని అనడంతో అందరూ సంతోష పడుతూ ఉంటారు. అప్పుడు సౌందర్య ఏం జరిగింది కార్తీక్ ఎందుకు మీరు ఇన్ని రోజులు దూరంగా ఉన్నారు.