బయటికి వచ్చిన తర్వాత ఆస్తులు కోసం యుద్దాలు జరిగాయని పురాణాలలో విన్నాను కానీ ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాను. మా ఆయన, మా అత్తగారు రిషికి అన్యాయం చేశారని తెలుసు కానీ నేను మాట్లాడితే ఎక్కడ మావయ్య గారికి తెలిసిపోతుంది అని మాట్లాడకుండా ఊరుకున్నాను అయినా మా ఆయన తగ్గుతారని నేను అనుకోవటం లేదు అంటుంది ధరణి. దానికి నువ్వేం చేస్తావు రిషి ఇక్కడికి వస్తే చాలు తర్వాత మిగిలినదంతా వాడే చూసుకుంటాడు అంటుంది జగతి.