జాన్వీ కపూర్ సౌత్ ఎంట్రీకి కారణం అదేనట, సీక్రేట్ చెప్పిన బాలీవుడ్ బ్యూటీ..

Published : Jul 28, 2023, 09:37 PM IST

సౌత్ ఎంట్రీకి రెడీగా ఉంది బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్. శ్రీదేవి వారసురాలిగా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన జాన్వీ.. సౌత్ ఎంట్రీ ఇవ్వడానికి గల కారణాన్ని వెల్లడించింది. సౌత్ ఆడియన్స్ గురించి జాన్వీ చెసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. 

PREV
18
జాన్వీ కపూర్ సౌత్ ఎంట్రీకి కారణం అదేనట, సీక్రేట్ చెప్పిన బాలీవుడ్ బ్యూటీ..

దివంగత స్టార్ హీరోయిన్ .. అతిలోక సుందరి శ్రీదేవి వారసురాలిగా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది జాన్వ కపూర్. కమర్షియల్ హీరోయిన్ గా కాకుండా.. ఎక్స్ పెర్మెంటల్ మూవీస్ చేస్తూ.. తనకంటూ ఓ ప్రత్యేకత ఏర్పరచుకుంది బ్యూటీ. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ప్రత్యేక గుర్తింపును సాధించింది. 

28
Janhvi Kapoor

ఇక త్వరలోనే తెలుగు సినిమా ద్వారా.. సౌత్ ఎంట్రీకి రెడీ అవుతోంది జాన్వీ కపూర్. ఈసినిమా తరువాత తమిళ్ లో కూడా ఓ సినిమాను చేయాలని అనుకుంటుందట. ప్రస్తుతం  బాలీవుడ్ మూవీ బవాల్' సక్సెస్  కిక్ ను  ఎంజాయ్ చేస్తున్న  కుర్ర భామ.. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సౌత్ ఆడియన్స్ తమపై కురిపిస్తున్న ప్రేమాభిమానాల గురించి మాట్లాడింది.

38

నితీష్ తివారీ దర్శకత్వంలో వరుణ్ ధావన్, జాన్వీ కపూర్ జంటగా నటించిన లేటెస్ట్ మూవీ 'బవాల్'. అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ వేదికగా విడుదలైన ఈ సినిమాకి మంచి స్పందన లభిస్తోంది. ఈ నేపథ్యంలో జాన్వీ బాలీవుడ్ మీడియాకి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సౌత్ లో తన కెరీర్ గురించి ఎదురైన ప్రశ్నలకు తెలివిగాసమాధానం చెప్పింది. 

 

48
Janhvi kapoor

తల్లి శ్రీదేవి వారసత్వం కారణంగా.. సౌత్ ఎంట్రీ ఇచ్చేప్పుడు ఏమైనా టెన్షన్ ఫీల్ అయ్యారా అని ఆమెను ప్రశ్నించగా.. సౌత్ లో తనకు లభిస్తున్న ప్రేమాభిమానాల గురించి  జాన్వీ స్పందించింది. సౌత్ ఇండస్ట్రీ తనకు  సొంత ఇంటిలా అనిపిస్తుంది అన్నారు జాన్వీ. సొంత ఇంటికి వచ్చిన ఫీల్ కలుగుతుంది అన్నారు. అంతే కాదు దక్షిణాది ప్రేక్షకుల నుంచి  తనకు అపారమైన ప్రేమ లభించిందని చెప్పింది.
 

58

మొదటి సినిమా ధడక్ టైమ్ లో మాత్రమే తాను కాస్త కంగారు పడ్డాను.. ఆ తర్వాత  ఏ సినిమా టైమ్ లో అయినా.. ఆందోళన చెందడం, భయపడటం మానేశాను. కానీ సౌత్ నుంచి నాకు లభించే ప్రేమ, అక్కడి వారు నన్ను స్వాగతించిన విధానం చూస్తుంటే, నిజంగా ఇంటికి తిరిగి వచ్చినట్లు అనిపిస్తుంది. నేను సెట్‌ కి వెళ్లినప్పుడు నా ఇంటికి వస్తున్నట్లు అనిపించింది'' అని జాన్వీ కపూర్ తెలిపింది. 

68

అయితే తన తల్లి శ్రీదేవి సౌత్ ఇండస్ట్రీకి చెందిన నటి. తమిళంలో పుట్టి.. తమిళ,తెలుగు భాషల్లో స్టార్ గా ఎదిగిన తరువాత బాలీవుడ్ కు వెళ్ళింది. అయితే తనకు ఇంత  ప్రేమ దక్కడానికి తన తల్లి శ్రీదేవి వారసత్వమే ప్రధాన కారణమని, అందుకే వారు తన సొంతవారు అనే భావం కలుగుతోందని జాన్వీ పేర్కొంది. 

78

అంతే కాదు ఆ ప్రేమను తాను నిలబెట్టుకుంటాను అంటోంది జాన్వీ. తాను కష్టపడి పనిచేసి, ఆ ప్రేమను తిరిగి ప్రేక్షకులకు అందించడానికి ప్రయత్నిస్తానని చెప్పింది. ప్రస్తుతం జాన్వీ కపూర్ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఎన్టీఆర్ జోడీగా దేవర సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది 

88

కాగా, 'దఢక్' సినిమాతో హీరోయిన్ గా బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్.. తొలి చిత్రంతోనే యువ హృదయాలను కొల్లగొట్టింది. 'గుంజన్ సక్సేనా: ది కార్గిల్ గర్ల్', 'రూహి', 'ఘోస్ట్ స్టోరీస్', 'గుడ్ లక్ జెర్రీ', 'మిలి' వంటి చిత్రాలతో ఆకట్టుకుంది. ఇటీవల విడుదలైన 'బవాల్' మూవీతో మంచి విజయం అందుకుంది. 
 

Read more Photos on
click me!

Recommended Stories