అనంతరం వసు వేసిన పులా దండను చూసి రిషి ఆలోచిస్తూ పడెయ్యాలి అనుకుంటాడు. అయితే అప్పుడే వసుపై కోపాన్ని పూలపై చూపించడం ఏంటి అని అనుకోని ఆగిపోతాడు. ఆ పులా దండను ఇంటికి తీసుకెళ్ళిపోతాడు. ఇక మరో సీన్ లో మహేంద్ర, జగతి ఇంటికి వస్తారు.. వాళ్ళని చుసిన దేవయాని అయ్యాయా మీ అభినందనలు, సత్కారాలు అని వెటకారంగా అడుగుతుంది.