శిరీష్, వసుల జంటని చూసి రగిలిపోతున్న రిషి.. కోపంతో ఆర్టికల్ పేపర్‌ను నలిపేసి?

Sreeharsha Gopagani   | Asianet News
Published : Nov 05, 2021, 12:23 PM IST

బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. మంచి కుటుంబ కథా నేపథ్యంలో ప్రసారమవుతున్న ఈ సీరియల్ కు మంచి అభిమానం ఉంది. ఇక ఈ రోజు ఈ సీరియల్ ఎపిసోడ్ హైలెట్ ఏంటో చూద్దాం.  

PREV
111
శిరీష్, వసుల జంటని చూసి రగిలిపోతున్న రిషి.. కోపంతో ఆర్టికల్ పేపర్‌ను నలిపేసి?

రిషి (Rishi) దగ్గరికి దేవయాని వచ్చి మాటల్లో మాటలు మాట్లాడుతూ తన మనసులో ఉన్న విషయాన్ని బయటికి రప్పించాలని అనుకుంటుంది. అందులోనే జగతి (Jagathi), వసు (Vasu) ల గురించి టాపిక్ తీసి రిషిని మరింత రెచ్చగొడుతుంది.
 

211

వారిద్దరి పేరు తీసేసరికి రిషి (Rishi) బాగా కోపంతో రగిలిపోయాడు. వారిద్దరి గురించి ఇక్కడ మాట్లాడకు అని అంటాడు. మొత్తానికి దేవయాని (Devayani) రిషి మనసులో ఏదో ఉంది అని ఎవరి కోసమో బాగా కోపం పడుతుండని అనుకుంటుంది.
 

311

మరోవైపు జగతి (Jagathi) , మహేంద్ర వర్మ (Mahendra varma) కూర్చుని మాట్లాడుకుంటారు. ఇక జగతి మహేంద్ర వర్మతో మిషన్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుతూ ట్రైనింగ్ గురించి వివరిస్తుంది. అంతలోనే వసు దీర్ఘంగా ఆలోచిస్తూ వస్తుంది.
 

411

ఏమైందని జగతి, మహేంద్ర వర్మ ప్రశ్నించడంతో తనకు పుష్ప (Pushpa) మిషన్ ఎడ్యుకేషన్ గురించి ఆర్టికల్ రాయమని అన్నదని కానీ రిషి (Rishi)  సార్ కోపం అవుతాడేమో అని భయపడుతుంది.
 

511

ఇక జగతి (Jagathi) కాలేజ్ ఫ్యాకల్టీ గా నేను చెబుతున్నాను నువ్వు ఆర్టికల్ రాసివ్వు అని ధైర్యం ఇస్తుంది. వసు (Vasu) ఆర్టికల్ రాయడానికి సిద్ధమవ్వగా తనకు రిషి మాట్లాడిన మాటలు గుర్తుకు రావడంతో టెన్షన్ పడుతుంది.
 

611

రిషి (Rishi) సార్ ను అడగాలి అని అనుకోని మెసేజ్ చేస్తుంది. ఇక రిషి వసు (Vasu) గురించి ఆలోచిస్తూ ఉంటాడు. మెసేజ్ చూసి ఇష్టం లేకుండా రిప్లై ఇస్తాడు. రిషి సార్ ఎటువంటి రెస్పాండ్ ఇవ్వటం లేదు అని బాధపడుతుంది.
 

711

అప్పుడే జగతి (Jagathi) మేడమ్  రావటంతో తన సలహా అడుగుతుంది. రిషి (Rishi) సార్ గురించి భయమేస్తుంది అని అంటుంది. మళ్లీ జగతి తనకు ధైర్యం ఇవ్వటంతో ఆర్టికల్ రాయడానికి సిద్ధమవుతుంది.
 

811

మరుసటి రోజు రిషి (Rishi) వాళ్ల ఇంటికి వసు, శిరీష్ వచ్చి మహేంద్ర వర్మ తో మాట్లాడుతుంటారు. మహేంద్ర వర్మ తన మనసులో మంచి సమయానికే వచ్చారు అని ఇప్పుడైనా రిషి వసు (Vasu) గురించి మనసులో మాట బయటికి చెబుతాడేమోనని అనుకుంటాడు.
 

911

అయితే వసు, శిరీష్ లను చూసి రిషి ( Rishi) కోపంతో రగిలిపోతాడు. వసు, శిరీష్ గుస గుస లాడుతుండగా మహేంద్ర వర్మ ఏం జరిగింది అని ప్రశ్నిస్తాడు. శిరీష్ (Sireesh) రిషి సార్ తో మాట్లాడాలని అనుకుంటున్నాడని వసు చెబుతుంది.
 

1011

వెంటనే మహేంద్రవర్మ (Mahendra) శిరీష్ వెళ్తే అసలు నిజం బయట పడుతుంది అని భయపడి వసు ను రిషి సార్ ను పిలవమని పంపిస్తాడు. అలాగే రాసిన ఆర్టికల్ కూడా ఇస్తాను అని రిషి (Rishi) సార్ దగ్గరికి వెళుతుంది.
 

1111

ఇక వసు రిషి (Rishi) దగ్గరికి వెళ్లగా రిషి కోపంతో బాక్సింగ్ చేస్తూ కనిపిస్తాడు. శిరీష్ పెళ్లి గురించి అనేసరికి రిషి ఓరేంజ్ లో కోపంగా రగిలిపోతాడు. తరువాయి భాగం లో వసు (Vasu) తెచ్చిన ఆర్టికల్ పేపర్ ను నలిచి పడేస్తాడు.

click me!

Recommended Stories