ఎపిసోడ్ ప్రారంభంలోనే... జగతి,మనం రిషి విషయంలో తప్పు చేశామేమో అంతేకానీ మనం స్వార్ధపరులమని నువ్వు ఫిక్స్ అవ్వద్దు. రిషి మన బంధాన్ని యాక్సెప్ట్ చేయలేదేమో ఇంకా అని అంటుంది. అప్పుడు మహేంద్ర, ఈ విషయం కాదు ముందు పెళ్లి గురించి ఆలోచించు అని అంటే, రిషి తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటాడు కాని తప్పుడు నిర్ణయాలు తీసుకోడు ఈ పెళ్లి జరగదని నాకు గట్టిగా అనిపిస్తుంది అని అంటుంది.తల్లి ప్రేమ వలన నీకు అలా అనిపిస్తుంది కానీ లగ్నపత్రిక వరకు వచ్చినది ఎలా ఆపగలం అని మహేంద్ర బాధపడతాడు.