ఆ తర్వాత వసుధర వెళుతూ ఉండగా ఇంతలో లవ్ సింబల్ కింద పడిపోతుండగా వసు, రిషి ఇద్దరు పట్టుకుంటారు. ఎందుకు పట్టుకున్నావ్ వసుధార అనడంతో హార్ట్ కదా సార్ అనగా హార్ట్ లేని వాళ్ళు హార్ట్ గురించి మాట్లాడుతున్నావా అని ఉంటాడు రిషి. ఆ మాటలకు వసుధార షాక్ అవుతుంది. అప్పుడు వసు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరొకవైపు చక్రపానికి సుమిత్ర ఫోన్ చేసి ఏవండీ అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అనడంతో ఏమని చెప్పాలి. అమ్మాయి జీవితం బాగుంటుంది ఉంటుంది అని సంతోషించే లోపే వాళ్ళ మధ్య చిక్కుముడి వచ్చి పడింది అంటూ సుమిత్రతా మాట్లాడుతూ ఉండగా ఇంతలో జగతి, మహేంద్ర అక్కడికి రావడంతో సుమిత్ర మళ్ళీ ఫోన్ చేస్తాను అని ఫోన్ కట్ చేస్తాడు చక్రపాణి.