మరోవైపు మహేశ్ బాబు ‘ఎస్ఎస్ఎంబీ28’ కోసం కాస్తా డిఫరెంట్ లుక్ ను ట్రై చేస్తున్న విషయం తెలిసిందే. కొంచెం గడ్డం, మీసాలు, లాంగ్ హెయిర్ తో రగ్డ్ లుక్ లో దర్శనమివ్వనున్నారు. రీసెంట్ గా వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్ కే ఫ్యాన్స్ రచ్చరచ్చ చేస్తుండటంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. వచ్చే ఏడాది జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.