ఒకప్పుడు ఫ్యామిలీ స్టార్ గా అభిమానులని సొంతం చేసుకున్న జగపతి బాబు ఇప్పుడు వైవిధ్యమైన పాత్రలతో దూసుకుపోతున్నారు. ఫ్యాన్స్ జగపతి బాబుని జగ్గూ భాయ్ అంటూ ముద్దుగా పిలుస్తున్నారు. అయితే జగపతి బాబు కెరీర్, పర్సనల్ లైఫ్ ఒడిదుడుకులతో సాగింది. కుటుంబ విషయంలో జగపతి బాబుకి ఎలాంటి సమస్య లేదు కానీ.. ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.