'గుంటూరు కారం' మొత్తం వేస్ట్, త్రివిక్రమ్ కి చురకలు.. కుండ బద్దలు కొట్టేసిన జగపతి బాబు

Published : Apr 08, 2024, 07:08 PM ISTUpdated : Apr 08, 2024, 08:08 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం చిత్రం సంక్రాంతికి విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం అభిమానులకు, ప్రేక్షకులకు అంతగా కిక్ ఇవ్వలేదు. సోసోగా ఉందనే రిపోర్ట్స్ వచ్చాయి. 

PREV
16
'గుంటూరు కారం' మొత్తం వేస్ట్, త్రివిక్రమ్ కి చురకలు.. కుండ బద్దలు కొట్టేసిన జగపతి బాబు

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం చిత్రం సంక్రాంతికి విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం అభిమానులకు, ప్రేక్షకులకు అంతగా కిక్ ఇవ్వలేదు. సోసోగా ఉందనే రిపోర్ట్స్ వచ్చాయి. సినిమా మొత్తం సంతకం అనే చిన్న పాయింట్ పై నడిపించారనే విమర్శలు త్రివిక్రమ్ కి తప్పలేదు. 

 

26

మనవడు, కొడుకు, తల్లి ఈ సెంటిమెంట్స్ తో త్రివిక్రమ్ చాలా చిత్రాలే చేశారు. గుంటూరు కారం కూడా ఆ కోవకి చెందిన చిత్రమే. అయితే ఈ చిత్రంలో జగపతి బాబు కీలక పాత్రలో నటించారు. కానీ జగపతి బాబు గుంటూరు కారం చిత్రంతో ఏమాత్రం సంతృప్తి కరంగా లేరట. 

 

36

తాజాగా ఓ ఇంటర్వ్యూలో జగపతి బాబు కుండ బద్దలు కొట్టే వ్యాఖ్యలు చేశారు. మహేష్ బాబుతో వర్క్ చేయడం నాకు చాలా ఇష్టం. కానీ నిజాయతీగా చెబుతున్నా.. గుంటూరు కారం చిత్రాన్ని నేను ఎంజాయ్ చేయలేదు. మహేష్ బాబుతో నా కాంబినేషన్ గొప్పగా ఉండాలనేది కోరిక. కానీ గుంటూరు కారం చిత్రంలో అదంతా వేస్ట్ అయింది. 

 

 

46
Trivikram

నేను చేయాల్సింది చేశాను. కానీ క్యారెక్టర్లు ఇంకా బాగా రాసుకుని ఉండాల్సింది. కొన్ని రోజులకే అంతా గందరగోళంగా మారింది అంటూ జగపతి బాబు పరోక్షంగా త్రివిక్రమ్ కి చురకలంటించారు. 

 

 

56

ఓ దశలో ఈ చిత్రం పూర్తి కావడమే కష్టం అనిపించింది అని జగపతి బాబు హాట్ కామెంట్స్ చేశాడు. జగపతి బాబు వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. గతంలో జగపతి బాబు.. శ్రీమంతుడు, మహర్షి లాంటి హిట్ చిత్రాల్లో మహేష్ బాబుతో నటించారు. 

 

 

66

గుంటూరు కారం చిత్రంలో జగపతి బాబు విలన్ గా నటించిన సంగతి తెలిసిందే. అయితే జగపతి బాబు పాత్ర అంతగా పేలలేదు. ఏదో చుట్టేసినట్లు అనిపించింది. అయినప్పటికీ జగపతి బాబు లాంటి నటుడు ఇలా ఓపెన్ గా కామెంట్స్ చేయడం సంచలనమే. 

 

click me!

Recommended Stories