Jabardhast Venky: జబర్దస్త్ కోసం గవర్నమెంట్ జాబ్ వదులుకున్న కమెడియన్

Published : Jun 23, 2022, 12:12 PM IST

జబర్దస్త్ ఎంతో కొత్త ఆర్టిస్ట్ లకు లైఫ్ ఇచ్చింది. ఇంకా ఇస్తూనే ఉంది. జబర్థస్త్  లైఫ్ ఇచ్చిన కమెడియన్స్ లో  వెంకీ  కూడా ఒకడు. మిమిక్రీ, వెంటలోగిజం ఆర్టిస్ట్ గా తన కెరీర్ ని ప్రారంభించాడు వెంకీ. ఎన్నో ఈవెంట్లలో తన కామెడీ టైమింగ్ తో అందర్నీ ఆకర్షించాడు.  

PREV
110
Jabardhast Venky: జబర్దస్త్  కోసం గవర్నమెంట్ జాబ్ వదులుకున్న కమెడియన్

ఒక సాధారణ ఆర్టిస్టుగా జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చిన వెంకీ.. తన కామెడీ టైమింగ్ తో.. పంచులతో  చాలా తక్కువ టైమ్ లోనే ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. కంటెస్టెంట్ గా స్టార్ట్ అయ్యి.. టీమ్ లీడర్ వరకూ ఎదిగాడు వెంకీ. వెంకీ మంకీ పేరుతో జబర్థస్త్ టీమ్ కు మంచి పేరు ఉంది. 

210

ఇక  జబర్థస్త్ లో తన ప్రయాణం ఎలా స్టార్ట్ అయ్యింది.. ఎలా సాగింది. ఎన్ని కష్టాలు అనుభవించాల్సి వచ్చింది,  ఒక ఇంటర్వ్యూ లో వివరంగా చెప్పాడు. అంతే కాదు  లేడీ గెటప్పు వేసుకునేటప్పుడు ఎదురయ్యే కష్టాల గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

310

ఇక ఇంటర్వ్యూలో వెంకీ మాట్లాడుతూ.. నాకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఉండాలని కోరుకునే వ్యక్తిని నేను. అందుకోసం మంచి ప్రభుత్వ ఉద్యోగం వచ్చిన వదులుకున్నాను. జబర్దస్త్ షోతో నా కల నెరవేరింది. ఈటీవీ దయవల్ల నేను ప్రజల ముందుకు వెళ్ళగలిగాను అన్నారు. 
 

410

నేను కాకతీయ యూనివర్సిటీ నుంచి డిప్లమా ఇన్ మిమిక్రీ లో గోల్డ్ మెడల్ అందుకున్నాను. తర్వాత వీడియో జాకీ, సింగరేణి పాటు కొన్ని ఉద్యోగ అవకాశాలు కూడా వచ్చాయి. ప్రభుత్వ ఉద్యోగం సంపాదించడం అంటే అంత సులువైన విషయమేమీ కాదు. కానీ నేను వాటన్నింటిని వదులుకున్నానను అన్నారు వెంకీ. 
 

510

నాకు ప్రత్యేక గుర్తింపు ఉండాలని కోరుకునే నేను, నాకు వచ్చిన ప్రభుత్వ ఉద్యోగం కూడా వదులుకున్నాను. ఎందుకంటే మన గురించి తెలియవలసింది మన ఊర్లోనే కాదు. ప్రపంచవ్యాప్తంగా నా గురించి తెలియజేయాలని అనుకున్నాను. జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఇది సాధ్యమైంది అంటూ సంతోషం వ్యాక్తం చేశారు. 
 

610

జబర్దస్త్ లో 14 ఎపిసోడ్ తర్వాత నా మిమిక్రీ షో ని చూసిన చంద్రన్న నన్ను పిలిచాడు. ఇప్పుడు నేను ఈ జీవితంలో ఇలా ఉన్నానంటే దానికి చంద్రన్న కారణం. మొదటిలో చంద్రన్న టీమ్ లో 30 ఎపిసోడ్ లు వరకు చేశాను. ఆ తరువాత రాఘవ టీం లో 50 స్కిట్ లుచేశానన్నారు వెంకీ. 
 

710

ఇక రాఘవ టీమ్ లో చేసేప్పుడు దాదాపు 50 స్కిట్ లు చేస్తే..  అందులో 45 లేడీ గెటప్స్ వేసాను. వినోదిని రాకముందు లేడీ గెటప్పులో ఆ క్రెడిట్ మొత్తం నాకే దక్కేది అన్నారు వెంకీ. 

810

ఇక లేడీ గెటప్ లు వేయడం అన్నది అంత ఈజీ ఏమీ  కాదు. చీరలో ఉండటం అంటే చాలా కష్టం, దీనికితోడు హెవీ మేకప్ వేసుకోవడం, రకరకాల విగ్గులు పెట్టుకోవడం.. వాటిని క్యారీ చేయడం  ఎంతో కష్టంగా ఉండేది. అప్పుడు నాకు అర్థం అయింది ఆడవారు ఎంత కష్ట పడుతున్నారు అనే విషయం.

910

రాఘవ టీమ్ నుంచి వేణు  టీం లోకి వెళ్లాను. అక్కడ స్కిట్ లు రాయడం, టైమింగ్ పంచులు ఎలా వేయాలో అనేది నేర్చుకున్నాను. అక్కడ అలా ట్రైయిన్ అవ్వబట్టే.. టీమ్ లీడర్ గా ప్రమోషన్ సాధించగలిగాను. తర్వాత జబర్దస్త్ లో  టీమ్ లీడర్ గా అవకాశం వచ్చింది. కాని కొత్తగా ఏం చేయాలి అనుకుంటున్నప్పుడే.. ఒక కొత్త థీమ్ తో స్కిట్లు చేయాలి అనిపించింది అన్నారు వెంకీ.
 

1010

నా కంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఉండాలని ఆలోచనతో కన్ఫ్యూషన్ థీమ్ తో స్కిట్స్ తో వెంకీ మంకీ టీం లీడర్ గా చేస్తూ మంచి పేరు సంపాదించుకున్నాను. ఇలా మంచి స్థాయిలో ఉన్నానంటే జబర్దస్త్ దయవలనే అని వెంకీ ఇంటర్వ్యూలో తన జబర్దస్త్ ప్రయాణం గురించి వెల్లడించారు.

click me!

Recommended Stories