Devatha: మాధవకు గిఫ్ట్ ఇచ్చిన దేవి.. వారి ప్రేమను చూసి కుమిలిపోతున్న ఆదిత్య!

Published : Jun 23, 2022, 11:29 AM IST

Devatha: బుల్లితెరపై ప్రసారమవుతున్న దేవత (Devatha) సీరియల్ కుటుంబ కథా నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ రోజు జూన్ 23 వ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.  

PREV
16
Devatha: మాధవకు గిఫ్ట్ ఇచ్చిన దేవి.. వారి ప్రేమను చూసి కుమిలిపోతున్న ఆదిత్య!

ఈరోజు ఎపిసోడ్ లో ఫాదర్స్ డే సందర్భంగా దేవి(devi) మాధవ కు ఒక గిఫ్ట్ ఇస్తుంది. మాధవ కూడా దేవి పేరుని తన చేతి పైన పచ్చబొట్టు వేపించుకొని నువ్వంటే నాకు ఉన్న ప్రేమ ఇదే అని అనడంతో రాధ(radha) ఒక్కసారిగా షాక్ అవుతుంది. అదంతా ఆదిత్య చూసి తట్టుకోలేక బాధపడుతూ ఉంటాడు.
 

26

అప్పుడు మాధవ(madhava) స్టేజి పైన మాట్లాడుతూ దేవి తనను ఇంతగా ఇష్టపడటానికి కారణం రాధ అని ఫ్యామిలీ మొత్తానికి స్టేజి మీద ఉండే విధంగా చేసి ఇదే నా కుటుంబం, పిల్లలే నా బలం అని అనడంతో ఆదిత్య ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఆ తర్వాత ఆదిత్య (adithya)బాధపడుతూ ఉండగా ఇంతలో సత్య అక్కడికి వచ్చి ఆంటీ ఆరోగ్యం బాగాలేదు.
 

36

ఈ వయసులో ఉపవాసం చేయడం వల్ల చాలా నీరసంగా ఉంది మేము చెప్పిన వినడం లేదు అని అనడంతో వెంటనే దేవుడమ్మ(devudamma)నేను వినను నా కోడలు ఇంటికి రావాలి. అప్పటి వరకు తాను ఇలాగే దీక్షను చేస్తాను తన నిర్ణయం మారదు అని గట్టిగా చెబుతుంది. మరొక వైపు రాధ(radha) స్కూల్లో జరిగిన విషయాన్ని తలచుకుని కోపంతో రగిలి పోతూ ఉంటుంది.
 

46

 ఇంతలో మాధవ(madhava) అక్కడికి రావడంతో మరింత కోపంతో ఉంటుంది రాధ. అప్పుడు మాధవ మాట్లాడుతూ నేను ఒక్క రోజు ఇంట్లో లేకపోతే దేవి ఎలా అయిపోయిందో చూసావు కదా ఈ పచ్చబొట్టు దేవి మనసులో చెరగని ముద్రను వేసుకున్నాను దేవిని నా నుండి దూరం చేయడం నీవల్ల ఆదిత్య వల్ల కాదు అని అనగా వెంటనే రాధ(radha),మాధవ మాటలకు వెటకారంగా నవ్వుతూ బాగా దిగజారి పోయావని మిమ్మల్ని చూస్తే కోపం కంటే బాధనే ఎక్కువగా అనిపిస్తుంది అని అంటుంది.
 

56

దేవి(devi)ని నాకు దూరం చేస్తే ఊరుకునేది లేదు ఆదిత్య కూడా చూస్తూ ఊరుకోడు. చిన్మయి కోసం ఉంటున్నాను కానీ లేకపోతే నిన్ను గట్టిగా నిలదీస్తే చిన్మయి బాధ పడుతుంది అని గట్టిగా మాట్లాడి అక్కడి నుంచి వెళ్లి పోతుంది రాద. మరొకవైపు ఆదిత్య స్కూల్లో జరిగిన సంఘటన గురించి తలుచుకొని బాధపడుతూ ఉంటాడు. ఆ తర్వాత ఆదిత్య(adithya)రాధని కలిసి దేవి విషయంలో బాధపడుతూ ఉంటాడు.
 

66

ఇలా ఉండటం నావల్ల కాదు అంటూ మన ఇంటికి వెళ్దాం అని రాధ(radha)తో అంటాడు. అప్పుడు రాధ పిల్లలకు ఏమని సమాధానం చెప్పాలి అని బాధపడుతుంది. అప్పుడు అయితే తనతో మాట్లాడటం కోసం రాధకు ఒక ఫోన్ ఇస్తాడు. ఇక రేపటి ఎపిసోడ్ లో రాధ జానకీ (janaki)పై మండిపడుతుంది. ఇంట్లో నుంచి వెళ్లి పోతాను అని గట్టిగా చెప్పేస్తుంది.

click me!

Recommended Stories