గుడ్‌ న్యూస్‌ చెప్పిన జబర్దస్త్ కమెడియన్‌.. తండ్రైన విషయాన్ని ఆలస్యంగా ప్రకటించి సర్‌ప్రైజ్‌..

Published : Jun 01, 2022, 11:50 PM IST

`జబర్దస్త్` కామెడీ షోలో లేడీ గెటప్‌లకు ఎంతగా పాపులరో తెలిసిందే. అందులో జబర్దస్త్ వినోదిని కూడా ఎంతో పాపులర్‌. అవకాశాల కోసం గెటప్‌ మార్చిన వినోద్‌.. ఇప్పుడు తండ్రి అయ్యాడు.  

PREV
16
గుడ్‌ న్యూస్‌ చెప్పిన జబర్దస్త్ కమెడియన్‌.. తండ్రైన విషయాన్ని ఆలస్యంగా ప్రకటించి సర్‌ప్రైజ్‌..

`జబర్దస్త్` షో ఎంతో మంది లైఫ్‌నిచ్చింది. సెలబ్రిటీలను చేసింది. ఇందులో రాణించిన ఆర్టిస్టులకు సినిమా అవకాశాలను తెచ్చింది. కొందరిని హీరోలను కూడా చేసింది. అంతగా గుర్తింపు పొందిన ఈ షోలో లేడీ గెటప్‌తో నెంబర్‌ వన్‌ పొజిషియన్‌లో ఉన్నాడు జబర్దస్త్ వినోదిని(Jabardasth Vinodini). అలియాస్‌ వినోద్‌. అవకాశం కోసం లేడీ గెటప్‌ వేసిన వినోద్‌.. వినోదినిగా ఇంటిళ్లిపాదిని తన కామెడీతో అలరిస్తున్నాడు. ఆకట్టుకుంటున్నాడు. 
 

26

తాజాగా అభిమానులు గుడ్‌ న్యూస్‌ చెప్పాడు. తాను తండ్రైన విషయాన్ని వెల్లడించారు. తాజాగా ఆయన తన యూట్యూబ్‌ ఛానెల్‌ ద్వారా ఈ విషయాన్ని పేర్కొన్నారు. వీడియో ద్వారా తాను తండ్రైన విషయాన్ని తెలిపారు. తమకు పండంటి ఆడబిడ్డ పుట్టిందని ప్రకటించాడు వినోద్‌. అంతేకాదు తన చిన్నారి ఫోటో షూట్‌ పిక్స్ ని కూడా వీడియో ద్వారా పంచుకున్నారు. దీంతో ఇప్పుడీ వీడియో వైరల్‌ అవుతుంది. 

36

ఎంతో క్యూట్‌గా ఉన్న చిన్నారి ఆకట్టుకుంటుంది. దీంతో వినోద్‌(వినోదిని) అభిమానులు ఆయనకు విషెస్‌ తెలియజేస్తున్నారు. మహాలక్ష్మి వచ్చిందంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇందులో పాప, తల్లి చాలా ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు జబస్దర్త్ వినోదిని. 

46

గత ఏడాది లాక్ డౌన్‌ టైంలో జబర్దస్త్ వినోద్ పెళ్లి నిరాడంబరంగా జరిగింది. కడప జిల్లాకి చెందిన తన మేనత్త కూతురు విజయలక్ష్మిని పెళ్లి చేసుకున్నాడు వినోద్. ఇటీవల క్యాష్‌ ప్రోగ్రామ్‌లో ఏకంగా తన భార్య సీమంతం చేయించారు. సుమ సమక్షంలో తన భార్య సీమంతం జరగడం విశేషం. ఈ సందర్బంగా వినోద్‌ ఎమోషనల్‌ అయ్యారు. తనకు అమ్మలేదని, తనని నమ్ముకుని ఉందని, తనకు బ్యాక్‌బోన్గా నిలిచిందని భార్య గురించి చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్నాడు వినోద్‌. ఇప్పుడు ఆమె పండంటి ఆడబిడ్డకి జన్మనివ్వడం విశేషం. 

56

`జబర్దస్త్` వినోదిని ఇటీవల వివాదాల్లో ఇరుక్కున్నారు. ఆయనపై ఇంటి యజమాని దాడి చేసి తీవ్రంగా గాయపర్చిన విషయం తెలిసిందే. ఆ వార్తలు పెద్దహాట్‌ టాపిక్‌ అయ్యాయి. తనకు ప్రాణహాని ఉందంటూ వినోద్‌ పోలీస్ స్టేషన్‌‌లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఇంటి ఓనర్ దాడిలో తీవ్ర గాయాల పాలయ్యాడు వినోద్. 

66

ఇక వినోద్ జబర్దస్త్‌ కామెడీ షోతోనే బాగా పాపులర్ అయ్యాడు. వినోదినిగా జబర్దస్త్ ప్రియులకు జబర్దస్త్ వినోదాన్ని పంచుతుంటాడు వినోద్. అతని కట్టు బొట్టు అచ్చం అమ్మాయిలాగే ఉండటంతో, ఎంతమంది లేడీ గెటప్‌లు ఉన్నా వినోద్ లేడీ గెటప్ వేస్తే అమ్మాయిగా పరకాయ ప్రవేశం చేసేస్తాడు. ఇప్పటికీ చాలామంది వినోదిని అబ్బాయా? అనే వాళ్లు చాలామంది ఉన్నారు. అంతలా లేడీ గెటప్‌కి పర్ఫెక్ట్‌గా సూట్ అయ్యాడు వినోద్. తెలుగు టీవీ ఆడియెన్స్ కి వినోదాన్ని పంచుతున్నాడు.
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories