ముఖ్యంగా తాను రకరకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్టు అతను వెల్లడించాడు. తన ఆరోగ్యం బాగాలేనప్పుడు జబర్దస్త్‌లోని సహ నటులైన చమ్మక్ చంద్ర, అభి, రాకేశ్, గెటప్ శ్రీను, సుధీర్, రామ్‌ప్రసాద్ వంటివారందరూ తనకు సాయం చేసి అండగా నిలిచారని గుర్తు చేసుకున్నాడు. అయితే, తనంత తానుగా ఎవరినీ సాయం అడగలేదని పేర్కొన్నాడు.