సెగలు రేపేలా `జబర్దస్త్` వర్ష పోజులు.. బ్లాక్‌ డ్రెస్‌లో అందాలు ఓవర్‌లోడ్‌.. ఆమెని వాడుకుంటున్నారంటూ రచ్చ

Published : Apr 01, 2023, 10:34 PM ISTUpdated : Apr 02, 2023, 09:14 AM IST

`జబర్దస్త్` కమెడియన్‌ వర్ష బక్క అందాలతో అలరిస్తుంది. కత్తిలాంటి పోజులితో కట్ఇటపడేస్తుంది. చూడ్డానికి బక్కగా ఉన్నా హాట్‌ నెస్‌లో మాత్రం నెక్ట్స్ లెవల్‌ అని చెప్పొచ్చు. ప్రస్తుతం ఈ బ్యూటీ ఇచ్చిన ట్రీట్‌ రచ్చ రచ్చ చేస్తుంది.   

PREV
110
సెగలు రేపేలా `జబర్దస్త్` వర్ష పోజులు.. బ్లాక్‌ డ్రెస్‌లో అందాలు ఓవర్‌లోడ్‌..  ఆమెని వాడుకుంటున్నారంటూ రచ్చ

`జబర్దస్త్` షోతో పాపులర్‌ అయ్యింది వర్ష. అంతకు ముందు యాంకర్‌గా, టీవీ నటిగా మెప్పించినా ఆ గుర్తింపు రాలేదు. `జబర్దస్త్` షోలో విశేష పాపులారిటీని సొంతం చేసుకుంది. నయా అందాలతో సోషల్‌ మీడియాలోనూ రచ్చ చేస్తుంది. ఈ బ్యూటీ గ్లామర్‌ ఫోటోలకు నెట్టింట ఫుల్‌ డిమాండ్‌ ఉందంటే అతిశయోక్తి కాదు. 

210

వర్ష.. తాజాగా తన హాట్‌ ఫోటోలను పంచుకుంది. బ్లాక్‌ టాప్‌, బ్లూ లెహంగా ధరించింది. బాడీ ఫిట్‌ దుస్తులో సెగలు రేపుతుంది. చిలిపి పోజులిస్తూ కుర్రాళ్ల మతిపోగొడుతుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ ఫోటోలు సోషల్‌ మీడియాని ఊపేస్తున్నాయి. వీకెండ్‌ సందర్భంగా వర్ష పంచుకున్న ఈ లేటెస్ట్ ఫోటోలు నెటిజన్లకి కనువిందు చేస్తున్నాయి. 
 

310

వర్ష అందంతో మెస్మరైజ్‌ చేస్తుంటుంది. ఆమె షోలో అందంలో హైలైట్‌గా నిలుస్తుంది. జబర్దస్త్ కి గ్లామర్‌ని తీసుకొస్తుంది. ఇక సోషల్ మీడియాలో ఈ బ్యూటీ చేసే రచ్చ అంతా ఇంతా కాదు. అయితే చాలా వరకు వర్ష ట్రెడిషనల్ గానే మెరుస్తుంది. గ్లామర్‌ షోకి దూరంగా ఉంటుంది. స్కిన్‌షో చేయదు. బట్‌ నిండైనా దుస్తులు ధరించినా ఆమె హాట్‌గానే కనిపిస్తుండటం విశేషం. 
 

410

తాజాగా మరోసారి అంతే హాట్‌గా కనిపిస్తుంది. ఆమె కొంటెగా పోజులిచ్చినా యమ హాట్‌గా ఉండటం విశేషం. ఈ వీకెండ్‌కి నెటిజన్లకి ఫుల్‌ మీల్స్ ని పెట్టినంత పనిచేసింది వర్ష. ప్రస్తుతం ఈ బ్యూటీ కోసం నెటిజన్లు ఎగబడుతున్నారు. 
 

510

వర్ష.. జబర్దస్త్ లో ఇమ్మాన్యుయెల్తో కలిసి స్కిట్లు చేస్తున్న విషయం తెలిసిందే. లవ్‌ స్కిట్లు బాగా పాపులర్‌ అయ్యాయి. జబర్దస్త్ షోకి రేటింగ్‌లు తెచ్చిపెట్టాయి. అయితే ఇమ్మాన్యుయెల్‌తో చేసిన లవ్‌, డ్యూయెట్ స్కిట్లని ఆడియెన్స్ రియల్‌ లైఫ్‌కి అన్వహించారు. దీంతో ఈ ఇద్దరిని రియల్‌ లైఫ్‌ లవర్స్ గానూ పరిగణిస్తున్నారు. వీరిద్దరూ ఇతరులతో స్కిట్లు చేస్తే చూడటం లేదు. ఈ క్రమంలో అనేక విమర్శలు వచ్చాయి. 

610

అయితే సోషల్‌ మీడియాలో దారుణమైన ట్రోలింగ్‌కి గురైంది వర్ష. మొదటిసారి అలాంటి ట్రోల్స్ రావడంతో తను కూడా తీసుకోలేకపోయింది. హర్ట్ అయ్యింది, బాధపడింది. కొన్నాళ్లపాటు జబర్దస్త్ షోకి, సోషల్‌ మీడియాకి దూరమయ్యింది. మళ్లీ నిర్వాహకులు ప్రోత్సహంతో తిరిగి వచ్చింది. ట్రోల్స్ పై కూడా ఆమె ఓ అంచనాకి వచ్చింది. వీటిని పట్టించుకోకూడదని నిర్ణయించుకుంది. ఇప్పుడు రెట్టింపు ఉత్సాహంతో దూసుకుపోతుంది. 
 

710

ఇప్పుడు కూడా ఇమ్మాన్యుయెల్‌తోనే స్కిట్లు చేస్తూ నవ్వులు పూయిస్తుంది. ఓ వైపు జబర్దస్త్, మరోవైపు శ్రీదేవి డ్రామా కంపెనీలో మెరుస్తూ ఆకట్టుకుంటుంది. అయితే వర్ష ఇప్పుడు కేవలం ఇమ్మూ స్కిట్లకే పరిమితం కావడంలేదు. ఇతరులతోనూ కలిసి స్కిట్లు చేస్తూ నవ్విస్తుంది. అలరిస్తుంది. 

810

వర్ష.. చాలా వరకు బాడీ షేమింగ్‌ కామెంట్లని ఎదుర్కొంటుంది. ముఖ్యంగా ఇమ్మాన్యుయెలే చాలా సార్లు ఇలాంటి కామెంట్లు చేశాడు. వాటికి హర్ట్ కూడా అయ్యింది. కొన్నిసార్లు షోలో భాగంగానే చేసింది. అయితే ఇప్పుడు వాటిని కూడా లైట్‌ తీసుకుంటుంది వర్ష. నవ్వులు పూయించడం కోసం ఇవన్నీ కామన్‌ అని భావిస్తుంది. తనదైన స్టయిల్‌లో ఎంటర్‌టైన్‌ చేస్తుంది. 

910

ఇదిలా ఉంటే లేటెస్ట్ ఫోటోలపై నెటిజన్లు రియాక్ట్ అవుతున్నారు. పలు షాకింగ్‌ కామెంట్స్ చేస్తున్నారు. వర్ష బేస్డ్ గా షోలో కామెడీ చేస్తున్నారు. ముఖ్యంగా `శ్రీదేవి డ్రామా కంపెనీ`లో ప్రతి ఎపిసోడ్‌లోనూ ఏదో రకంగా ఆమెపై కామెంట్లు చేస్తుంటారు. ఆమెని ఇన్‌వాల్వ్ చేస్తుంటారు. 

1010

దీంతో `నిన్ను బాగా వాడుకుంటున్నార`ని కామెంట్‌ చేస్తున్నారు నెటిజన్లు. ఇమ్మూతోనూ నిన్నే వాడుకుంటున్నారని, కావాల్సినంతగా మీ నుంచి పిండేస్తున్నారని అంటున్నారు. ఈ కామెంట్లు ఇప్పుడు కొత్త రచ్చకి దారి తీస్తున్నాయి. మరి దీనిపై వర్ష రియాక్ట్ అవుతుందా? వీటిని ఎలా తీసుకుంటుందో చూడాలి.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories