చీరకట్టులో జూనియర్ సమంత అందాలు.. ట్రెడిషనల్ లుక్ లో మెరిసిపోతున్న బోల్డ్ బ్యూటీ..

First Published | Apr 1, 2023, 5:53 PM IST

స్టన్నింగ్ ఫొటోషూట్లతో నెట్టింట దుమారం రేపే అషురెడ్డి.. తాజాగా ట్రెడిషనల్ లుక్ లో కట్టిపడేస్తోంది. చీరకట్టులో హోయలు పోతూ ఫ్యాన్స్ ను మంత్రముగ్ధులను చేసింది. అషురెడ్డి లేటెస్ట్ పిక్స్ బ్యూటీఫుల్ గా ఉన్నాయి. 
 

డబ్ స్మాష్ వీడియోలతో జూనియర్ సమంతగా యూత్ లో మంచి క్రేజ్ దక్కించుకుంది అందాల అషురెడ్డి (Ashu Reddy). తన అందం, రీల్స్ తో సోషల్ మీడియా స్టార్ గా మారింది. ఆ సమయంలోనే సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మతో ఇంటర్వ్యూ చేయడం  మరి క్రేజ్ ను సంపాదించి పెట్టింది.
 

మొదట అషురెడ్డి  బోల్డ్ నెస్ తో యువతను ఉక్కిరిబిక్కిరి చేసింది. సోషల్ మీడియాలో అషురెడ్డి  పెట్టే పోస్టులకు కుర్రాళ్లు అదిరిపోయే వారు. ఇప్పటికీ అదిరిపోయే అవుట్ ఫిట్లలో ఈ భామ గ్లామర్ విందు చేస్తున్న విషయం తెలిసిందే. అలాగే సంప్రదాయ దుస్తుల్లోనూ మెరుస్తూ ఆకట్టుకుంది. 
 


ఫ్యాన్స్ కూడా అషురెడ్డిని ఎక్కువగా ట్రెడిషనల్ లుక్ చూసేందుకు ఇష్టపడుతుంటారు.  గ్లామర్ మెరుపులు ఎంత మెరిపించినా.. సంప్రదాయ దుస్తుల్లో చక్కగా ఉంటుందంటున్నారు. ఫ్యాన్స్ తాజాగా అషు పంచుకున్న బ్యూటీఫుల్ ఫొటోలను లైక్స్, కామెంట్లతో నెట్టింట వైరల్ చేస్తున్నారు. 

అషురెడ్డి చేసిన  లేటెస్ట్ ఫొటోషూట్ లో చీరకట్టు అందాలతో మైమరిపించింది. సంప్రదాయ దుస్తుల్లో అషురెడ్డి  రెండింతల అందాన్ని సొంతం చేసుకుంది. పింక్ ట్రాన్స్ ఫరెంట్ శారీ, గ్రీన్ బ్లౌజ్, అట్రాక్టివ్ నెక్లెస్ ధరించి జాబిలమ్మలా వెలిగిపోతోంది. 

బిగ్ బాస్ బ్యూటీ బ్యూటీఫుల్ లుక్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. శారీలో హోయలు పోతూ అషురెడ్డి ఇచ్చిన ఫోజులకు ఖుషీ అవుతున్నారు. చాలా పద్ధతిగా అషురెడ్డి దర్శనమివ్వడంతో కామెంట్లతో ఆకాశానికి  ఎత్తుతున్నారు. వెరీ ట్రెడిషనల్ అంటూ.. బ్యూటీఫుల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

కేరీర్ విషయానికొస్తే ‘బిగ్ బాస్’తో ఫేమ్ దక్కించుకున్న అషురెడ్డికి సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయి. ఇప్పటికే ఆయా చిత్రాల్లో మెరిసింది.  రీసెంట్ గా ‘ఫోకస్’ అనే మూవీలో పోలీస్ ఆఫీసర్ గా అలరించింది. ప్రస్తుతం ‘ఏ మాస్టర్ పీస్’ అనే చిత్రంతోపాటు ఆయా సినిమాల్లో నటిస్తున్నట్టు తెలుస్తోంది. 
 

Latest Videos

click me!