ప్రియుడితో వర్ష సీక్రెట్‌ చాటింగ్‌.. గుట్టురట్టు చేసిన ఇమ్మాన్యుయెల్‌.. బండారం బయటపడటంతో నోరెళ్ల బెట్టిన వైనం

Published : Jan 04, 2023, 06:08 PM IST

జబర్దస్త్ కమెడియన్లు వర్ష, ఇమ్మాన్యుయెల్‌ కలిసి స్కిట్లు చేస్తూ ఆకట్టుకుంటున్నారు. ఇద్దరూ లవర్స్ గా చెలామణి అవుతున్నారు. కానీ వర్షకి మరో లవ్‌ స్టోరీ ఉందని తెలుస్తుంది.   

PREV
15
ప్రియుడితో వర్ష సీక్రెట్‌ చాటింగ్‌.. గుట్టురట్టు చేసిన ఇమ్మాన్యుయెల్‌.. బండారం బయటపడటంతో నోరెళ్ల బెట్టిన వైనం

`జబర్దస్త్` షో కామెడీ షోస్‌లో అత్యంత ఆదరణ పొందుతున్న షోగా నిలిచింది. ఇందులోని చాలా మంది ఆర్టిస్టులు స్టార్‌ కమెడియన్లుగా, హీరోగా మారిపోయారు. అదే సమయంతో ప్రేమ జంటలుగానూ మారి ఆకట్టుకుంటున్నారు. సుడిగాలి సుధీర్‌-రష్మి జంట ఎంతటి క్రేజ్‌ని సంపాదించుకుందో తెలిసిందే. ఆ తర్వాత వర్ష-ఇమ్మాన్యుయెల్‌ జోడీ కూడా ఆ స్థాయిలో క్రేజ్‌తో రన్‌ అవుతుంది. నవ్వులు పూయించడంతోపాటు తమ లవ్‌ ట్రాక్‌లతో అదరగొడుతుంది. 
 

25

వీరిద్దరు స్టేజ్‌పై చాలా సార్లు ప్రేమని వ్యక్తం చేసుకున్నారు. ఎంగేజ్‌మెంట్లు, పెళ్లిళ్లు అయ్యాయి. తాళి కూడా కట్టబోయాడు ఇమ్మ్యూ. వర్ష, ఇమ్మాన్యుయెల్‌ కలిసి చేసే కామెడీ నవ్వులు పూయించడంతోపాటు అంతకు మించిన వినోదాన్ని పంచుతుంది. అయితే ఈ ఇద్దరు స్టిల్‌ లవర్స్ గానూ చూస్తున్నారు ఆడియెన్స్. అందుకు సెపరేట్‌ ఫ్యాన్స్ కూడా ఏర్పడటం విశేషం. 

35

కానీ ఇప్పుడు మరో సీక్రెట్‌ బయటపడింది. వర్షకి మరో లవ్‌ స్టోరీ ఉందనే విషయం బయటకొచ్చింది. వర్ష మనసులో మరో వ్యక్తి ఉన్నారని లేటెస్ట్ గా తెలవడం గమనార్హం. వర్ష ఫోన్‌ చెక్‌ చేయగా, ఆమె గుట్టు రట్టయ్యింది. తనకి సీక్రెట్‌గా మరో ప్రియుడు ఉన్నాడనే విషయం తెలిసిపోయింది. అందరి ముందు బండారం బయటపడటంతో ఖంగు తిన్నది వర్ష. ఏం చేయాలో తోచక నోరెళ్ల బెట్టింది. ఇదే ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అయ్యింది. 
 

45

వర్ష, ఇమ్మాన్యుయెల్‌ ప్రేమించుకున్నట్టు పేరెంట్స్ కి చెప్పగా, వర్ష ఫాదర్‌ ఒక్క రోజు సెల్‌ఫోన్లు మార్చుకోవాలని, తమకి వేరే లింక్స్ లేకపోతే పెళ్లి చేస్తానని కండీషన్‌ పెట్టాడు వర్ష ఫాదర్‌. సెల్‌ ఫోన్లు మార్చుకోగా, వర్ష సీక్రెట్‌ లవ్‌ స్టోరీ బయటపడింది. అయితే వర్ష టెక్స్ మెసేజ్‌లో గానీ, వాట్సాఫ్‌, ఫేస్‌ బుక్‌లో గానీ చాట్‌ చేయడం లేదు. ఏకంగా ఫోన్‌ పేలో ప్రియుడితో చాట్‌ చేస్తుండటం విశేషం. ఆ విషయాన్ని గుర్తించిన ఇమ్మాన్యుయెల్‌ షాక్‌ తిన్నాడు. ఆమె బండారాన్ని బయటపెట్టాడు. ఇది చూసి వర్ష ఫాదర్‌(బుల్లెట్‌ భాస్కర్‌) ఖంగు తినడం విశేషం. 

55

అయితే ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. అయితే ఇదంతా స్కిట్‌ లో భాగమనే విషయం తెలిసిందే. వర్ష, ఇమ్మాన్యుయెల్‌ కలిసి `ఎక్స్ ట్రా జబర్దస్త్`లో స్కిట్లు చేస్తుంది. ఈ షో లేటెస్ట్ ప్రోమో విడుదలైంది. అందులో భాగంగా ఆ మధ్య వచ్చిన తమిళ మూవీ `లవ్‌ టుడే` చిత్ర కాన్సెప్ట్ ని ఫాలో అవుతూ స్కిట్‌ చేశారు. అందులో భాగంగా ఫోన్లు మార్చుకుని సినిమాల్లో మాదిరిగా స్కిట్‌ చేసి ఆకట్టుకున్నారు. వీరి కామెడీ నవ్వులు పూయిస్తుంది. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories