Bigg Boss Telugu 6: హోస్ట్ నాగార్జునకు తీరని అవమానం... బిగ్ బాస్ ఫినాలేకు దారుణ రేటింగ్ 

Published : Jan 04, 2023, 05:19 PM IST

బిగ్ బాస్ మేకర్స్ కి ఇది షాకింగ్ పరిణామం. సీజన్ 6 గ్రాండ్ ఫినాలే టీఆర్పీ వారి ఫ్యూజులు ఎగిరిపోయేలా చేసింది. ఆల్ టైం లోయస్ట్ టీఆర్పీ అందుకుంది.

PREV
18
Bigg Boss Telugu 6: హోస్ట్ నాగార్జునకు తీరని అవమానం... బిగ్ బాస్ ఫినాలేకు దారుణ రేటింగ్ 
Bigg Boss Telugu 6

బిగ్ బాస్ తెలుగు 6 లాంచింగ్ ఎపిసోడ్ నుండి టీఆర్పీ రేటింగ్ విషయంలో స్ట్రగుల్ అవుతూనే ఉంది. సాధారణంగా కంటెస్టెంట్స్ ని పరిచయం చేసే లాంచింగ్ ఎపిసోడ్ పై అత్యంత ఆసక్తి ఉంటుంది. కానీ సీజన్ 6 ఫస్ట్ ఎపిసోడ్ కి 8.86 రేటింగ్ వచ్చింది. గత ఐదు సీజన్స్ లో అదే లోయస్ట్. ఫినాలే విషయంలో కూడా అదే ట్రెండ్ కొనసాగింది.

28

ఈ సీజన్ (Bigg Boss Telugu 6)పై ఆడియన్స్ పెద్దగా ఆసక్తి చూపలేదు. వీకెండ్ ఎపిసోడ్స్ కి 3, వీక్ ఎపిసోడ్స్ కి 2 టీఆర్పీ వస్తుందంటే ఎంత పెద్ద డిజాస్టరో అర్థం చేసుకోవచ్చు. అంటే ఒక సక్సెస్ఫుల్ సీరియల్ తో కూడా బిగ్ బాస్ సీజన్ 6 పోటీపడలేక పోయింది. 
 

38


దానికి తోడు కొత్తదనం లేని గేమ్స్, టాస్క్ తో పాటు ఎలిమినేషన్స్ షో క్రెడిబిలిటీ దెబ్బతీశాయి. స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అవుతుంటే... జనాల ఓట్ల ఆధారంగా కాకుండా, నిర్వాకుల నచ్చినట్లు ఎలిమినేషన్స్ జరుగుతున్నాయనే ప్రచారం మొదలైంది. కొందరు కంటెస్టెంట్స్ ఎలిమినేషన్స్ తీవ్ర విమర్శల పాలయ్యాయి. 
 

48


ఇక నాగార్జున(Nagarjuna) హోస్టింగ్ కి ఆడియన్స్ నెగిటివ్ మార్క్స్ వేశారు. ఆయన వీకెండ్ సమీక్షలు సరిగాలేవు. హోస్ట్ అభిప్రాయాలు మెజారిటీ ఆడియన్స్ ఒపీనియన్స్ తో మ్యాచ్ కావాలి. ఈ సీజన్ కి అలా జరగలేదు. దీంతో నాగార్జున అసలు షో చూస్తున్నారా? లేదా? అనే సందేహం కలిగేది. ఆయన కొందరి పట్ల పక్షపాతం చూపించి మరికొందరి పట్ల వివక్ష చూపించాడనిపిస్తుంది. 
 

58


రేవంత్ ఏం చేసినా నాగార్జున సమర్ధించేవాడు. అతడు గేమ్స్ లో ఆడవాళ్ళను కూడా హర్ట్ చేశాడు. అంత చేసినా నాగార్జున అతన్ని సుతిమెత్తగా హెచ్చరించేవాడు. అలాగే అగ్రెషన్ వదలొద్దు, దెబ్బలు తగలకుండా చూసుకో అంటూ అతన్ని పరోక్షంగా రెచ్చగొట్టేవాడు. బాల ఆదిత్య, ఆదిరెడ్డి లాంటి కంటెస్టెంట్స్ చిన్న మిస్టేక్ చేసినా ఓ రేంజ్ లో ఫైర్ అయ్యేవాడు. 
 

68


మొత్తంగా బిగ్ బాస్ సీజన్ 2 లోపభూయిష్టంగా సాగింది. రేటింగ్ దానికి తగ్గట్లే వచ్చింది. గ్రాండ్ ఫినాలే టీఆర్పీ రేటింగ్ చూస్తే షో ఎంత ఫెయిల్యూర్ అనేది తెలుస్తుంది. బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే(Bigg Boss Telugu 6 grand finale) కేవలం 8.19 రేటింగ్ తెచ్చుకుంది. రవితేజ లాంటి స్టార్ వచ్చినా, ఊర్వశి రాతెలా డాన్స్ చేసినా ఆదరణ దక్కలేదు. గత సీజన్స్ తో పోల్చుకుంటే ఇది సగం మాత్రమే. 

78


దీనికి ప్రధాన కారణం ఫినాలే నిర్వహించిన తీరు కూడా. ఎవరైనా ఫినాలే ఎందుకు చూస్తారు... టైటిల్ విన్నర్ ఎవరో తెలుసుకోవాలని. టాప్ కంటెస్టెంట్స్ మధ్య హోస్ట్ నిలబడి కౌంటింగ్ నడుమ ఒకరి చేయి ఎత్తి విన్నర్ ని ప్రకటిస్తే వచ్చే కిక్కే వేరు. కానీ సీజన్ 6 లో రూ. 40 లక్షలు శ్రీహాన్, రేవంత్ లకు ఆఫర్ చేశారు. ప్రైజ్ మనీలో 80% అంటే ఎవరో ఒకరు తీసుకోకుండా ఉంటారా, చెప్పండి. శ్రీహాన్ సూట్ కేస్ తీసుకోవడానికి ఓకే చెప్పగానే విన్నర్ రేవంత్ అని చప్పగా డిసైడైపోయింది.
 

88
Bigg Boss Telugu 6


దెబ్బకు జనాలు టీవీలు ఆపేశారు. లేదా పక్క ఛానల్ కి వెళ్లిపోయారు. అంతకు మించిన దారుణం అసలు విన్నర్ శ్రీహాన్ అని రివీల్ చేయడం. నాగార్జున ప్రకటన తర్వాత అటు రేవంత్ ఇటు శ్రీహాన్ ఇద్దరూ కన్నీళ్లు పెట్టుకునే పరిస్థితి. కాగా గత ఐదు సీజన్స్ ఫినాలే టీఆర్పీలు వరుసగా...    14.13, 15.05,18.29, 19.21, 16.04గా నమోదయాయ్యి. 

Read more Photos on
click me!

Recommended Stories