పట్టుచీర కట్టి.. పెళ్లి కూతురిలా ముస్తాబైన ‘జబర్దస్త్’ వర్ష.. సంప్రదాయ దుస్తుల్లో వెలిగిపోతున్న యంగ్ బ్యూటీ

First Published | Jun 28, 2023, 11:23 AM IST

బ్యాక్ టు బ్యాక్ ఫొటోషూట్లతో ‘జబర్దస్త్’ వర్ష సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారుతోంది. అటు ట్రెండీ వేర్స్ లో మెరుస్తూనే.. ఇటు పట్టుచీరలోనూ దర్శనమిచ్చి మంత్రముగ్ధులను చేస్తోంది. గ్లామర్ మెరుపులతో మైమరిపిస్తోంది. 
 

జబర్దస్త్ వర్ష (Jabardasth Varsha) సోషల్ మీడియాలో అందాల దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. బుల్లితెరపై సందడి చేస్తున్న ఈ ముద్దుగుమ్మ ఇటు నెట్టింట కూడా వరుసగా తన దర్శనం కలిపిస్తూ ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లను ఆకట్టుకుంటోంది. 
 

గతంలో వర్ష కాస్తా పద్ధతిగా ఫొటోషూట్లు చేసేది. ఇటీవల మాత్రం ట్రెండీ అవుట్ ఫిట్స్ లో మెరుస్తోంది. మరోవైపు సంప్రదాయ దుస్తుల్లోనూ మెరుస్తూ కట్టిపడేస్తోంది. అయితే వర్షకు బుల్లితెర నటిగా ప్రస్తుతం మంచి గుర్తింపే దక్కింది. 
 


ఈ సందర్భంగా ఆమెకు ఆయా సంస్థల నుంచి ప్రమోషన్స్  పరంగా అవకాశాలు వస్తున్నాయి. తాజాగా కాంచీపురం నారాయణ స్కిల్స్  వారి కోసం వర్ష స్పెషల్ ఫొటోషూట్ చేసింది. మెరిసిపోయే పట్టుచీరలో పెళ్లికూతురిలా ముస్తాబై ఫొటోలకు ఫోజులిచ్చింది. 

వర్ష మోడ్రన్ డ్రెస్ ల్లో కంటే ట్రెడిషనల్ లుక్ లో ఎంత బాగుంటుందో తెలిసిందే. ఈ విషయంలో అభిమానులు కూడా ఈ ముద్దుగుమ్మను సంప్రదాయ దుస్తుల్లోనే చూసేందుకు ఇష్టపడుతుంటారు. ఇక తాజాగా పెళ్లికూతురు గెటప్ లో వర్ష పంచుకున్న పిక్స్ కు ఫిదా అవుతున్నారు. 

కంచిపట్టుచీరలో వర్ష వెలిగిపోతోంది. అందుకు తగ్గట్టుగా ఖరీదైన, ఆకర్షణీయమైన ఆభరణాలను ధరించి మరింత రాయల్ లుక్ ను సొంతం చేసుకుంది. అదిరిపోయే లుక్ లో ఫొటోలకు ఫోజులిచ్చింది. చూపుతిప్పుకోని చూపులతో కుర్ర హృదయాలను కొల్లగొట్టింది. 

తాజాగా పంచుకున్న ఫొటోలను ఫ్యాన్స్  లైక్స్, కామెంట్లతో వైరల్ చేస్తున్నారు. ఆమె అందాన్ని పొగుడుతూ ఆకాశానికి ఎత్తుతున్నారు. దేవతలా ఉన్నావంటూ.. అందాల దేవత అంటూ మరింతగా ఎంకరేజ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మకు ఇన్ స్టాలో 1 మిలియన్ ఫాలోవర్స్  ఉన్నారు. 
 

ఇక వర్ష ‘జబర్దస్త్’ కామెడీ షోతో ఫేమ్ దక్కించుకున్న విషయం తెలిసిందే. బుల్లితెర ఆడియెన్స్ లో మంచి గుర్తింపు దక్కించుకుంది. అంతకంటే ముందు సీరియల్స్  లో నటించి ఆకట్టుకుంది. సీరియల్ నటిగా తన కేరీర్ ప్రారంభమైంది. కానీ ‘జబర్దస్త్’తోనే మంచి క్రేజ్ దక్కింది. 
 

మరోవైపు Jabardasth వేదికపై కమెడియన్ ఇమ్మాన్యుయేల్ తో పులిహోర కలుపుతున్న విషయం తెలిసిందే. ఇందులో ఎంత వాస్తవం ఉందనేది ఇప్పటికీ సందేహమే. కానీ వీరిద్దరి పేయిర్ కు బుల్లితెర ఆడియెన్స్ నుంచి మంచి క్రేజ్ వస్తోంది. ఇక ఇప్పుడిప్పుడే వర్ష ఎదుగుతోంది. 
 

Latest Videos

click me!