కిస్సింగ్ సీన్స్ ఎప్పటికీ చేయకూడదనుకున్నా..అందుకే రూల్ బ్రేక్ చేశా, ట్రోలింగ్ పై రెచ్చిపోయిన తమన్నా

Published : Jun 28, 2023, 10:04 AM IST

తమన్నా తనపై వస్తున్న ట్రోలింగ్, ముద్దు సన్నివేశాలు, కెరీర్ గురించి ఘాటైన వ్యాఖ్యలే చేసినట్లు ఉంది. 2023 లో కూడా అమ్మాయిలు ఎలా ఉండాలో ఎందుకు చెబుతున్నారు అంటూ ఘాటుగా తమన్నా ప్రశ్నించింది.

PREV
17
కిస్సింగ్ సీన్స్ ఎప్పటికీ చేయకూడదనుకున్నా..అందుకే రూల్ బ్రేక్ చేశా, ట్రోలింగ్ పై రెచ్చిపోయిన తమన్నా

మిల్కీ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకున్న తమన్నా ప్రస్తుతం బోల్డ్ రోల్స్ దూసుకుపోతోంది. టాలీవుడ్ లో చాలా మంది హీరోయిన్లు నటన పరంగా గుర్తింపు తెచ్చుకుని ఉండొచ్చు. గత దశాబ్దం కాలంలో గ్లామర్ డాన్స్ పరంగా కుర్రాళ్లల్లో తమన్నాకి వచ్చినంత క్రేజ్ మరే హీరోయిన్ కి దక్కలేదు. టాలీవుడ్ వెండితెరని తన గ్లామర్ తో తమన్నా ఒక ఊపు ఊపింది. మిల్కీ అందాలతో తమన్నా సిల్వర్ స్క్రీన్ పై కనిపిస్తే మైమరచిపోయే అభిమానులు ఉన్నారు. 

27

తెలుగులో దాదాపుగా స్టార్స్ అందరితో తమన్నా ఆడి పాడింది. ప్రభాస్, పవన్, మహేష్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రాంచరణ్ ఇలా క్రేజీ హీరోలందరితో మిల్కీ బ్యూటీ నటించింది. హ్యాపీ డేస్ చిత్రంతో తమన్నాకి క్రేజ్ మొదలయింది. ప్రస్తుతం తమన్నా బాలీవుడ్ లో బోల్డ్ వెబ్ సిరీస్ లలో నటిస్తూ అందరిని షాక్ కి గురిచేస్తోంది. 

37

సిల్వర్ స్క్రీన్ పై రొమాంటిక్, కిస్సింగ్ సీన్స్ లో నటించకూడదు అనేది తమన్నా రూల్. తాను ఎప్పటికీ ఆన్ స్క్రీన్ పై లిప్ లాక్స్, ముద్దు సన్నివేశాలు, రొమాంటిక్ సీన్స్ లో నటించనని గతంలో తమన్నా తెలిపింది. కానీ ఆ ఒట్టు తీసి గట్టుమీద పెట్టినట్లుగా తమన్నా ప్రస్తుతం రెచ్చిపోతోంది. ఇటీవల తమన్నా నటించిన జీ కార్ద అనే వెబ్ సిరీస్ లో ఆమె బోల్డ్ వేషాలు చూసి అంతా షాక్ అయ్యారు. 

 

47

తమన్నాపై దుమ్మెత్తి పోస్తూ సోషల్ మెడియలో ట్రోల్ చేశారు. ఇక తమన్నా నటించిన లేటెస్ట్ వెబ్ సిరీస్ లస్ట్ స్టోరీస్ 2 జూన్ 29 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కి రెడీ అవుతోంది. దీనితో తమన్నా వరుసగా ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. తాజాగా తమన్నా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూ ప్రోమో విడుదలయింది. 

57

ఈ ఇంటర్వ్యూలో తమన్నా తనపై వస్తున్న ట్రోలింగ్, ముద్దు సన్నివేశాలు, కెరీర్ గురించి ఘాటైన వ్యాఖ్యలే చేసినట్లు ఉంది. 2023 లో కూడా అమ్మాయిలు ఎలా ఉండాలో ఎందుకు చెబుతున్నారు అంటూ ఘాటుగా తమన్నా ప్రశ్నించింది. తనపై ట్రోల్ చేస్తున్న వారిని తమన్నా ట్విట్టర్ అంకుల్స్ అంటూ సెటైర్ వేసింది. 

67

హీరోలు బూతులు మాట్లాడినా, రొమాన్స్ చేసినా వాళ్ళు సూపర్ స్టార్స్ అయిపోతారు. కానీ అమ్మాయి అలా నటిస్తే ఆమె క్యారెక్టర్ ని జడ్జ్ చేస్తారు.. సమాజం ఇలా ఎందుకు ఉందో అర్థం కావడం లేదు. నా 18 ఏళ్ల కెరీర్ లో ఆన్ స్క్రీన్ పై నేను ఎప్పుడూ ముద్దు పెట్టుకోలేదు. ముద్దు సీన్స్ లో నటించనని కూడా గతంలో చెప్పింది నేనే. కానీ ఒక నటిగా నేను అడ్డుగోడలు, రూల్స్ ఎందుకు పెట్టుకోవాలి. నటిగా నేను ఇంకా ఎందుకు ఎదగకూడదు అని ప్రశ్నించుకున్నప్పుడు ముద్దు సీన్స్ విషయంలో నేను పెట్టుకున్న రూల్ అర్థం లేనిదిగా అనిపించింది. అందుకే ఆ రూల్ బ్రేక్ చేశా అని తమన్నా వివరణ ఇచ్చింది. 

77

ఇక తన ప్రియుడు విజయ్ వర్మ గురించి మాట్లాడుతూ.. అతనిలో సమాజం పట్ల చాలా అవగాహన ఉంది. ఈ రోజుల్లో అది చాలా మందిలో కనిపించదు. అదే విజయ్ వర్మ విషయంలో నాకు నచ్చేది అని తెలిపింది. ఇక పెళ్ళికి ముందు టెస్ట్ డ్రైవ్ అనే డైలాగ్ లస్ట్ స్టోరీస్ 2 ట్రైలర్ లో ఉంది. దీనిపై తమన్నా మాట్లాడుతూ సెక్స్ గురించి మాట్లాడడానికి మనం అది బూతుగా భావిస్తాము. అది పక్కన పెట్టాలి. మనిషికి అన్ని అవసరాలు ఎలా ఉంటాయో శృంగారం కూడా అంతే అని తెలిపింది. 

click me!

Recommended Stories