మెలికలు తిరుగుతూ ఒంపుసొంపులతో హీట్ అమాంతం పెంచేస్తున్న 'లోఫర్' బ్యూటీ

First Published | Oct 13, 2021, 5:31 PM IST

బాలీవుడ్ లో తక్కువ టైంలోనే దిశా పటాని బాలీవుడ్ లో బోల్డ్ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకుంది. బోల్డ్ ఫోటోషూట్స్ తో సోషల్ మీడియాలో ఆమె సృష్టించే సంచలనం అంతా ఇంతా కాదు.

బాలీవుడ్ లో తక్కువ టైంలోనే దిశా పటాని బాలీవుడ్ లో బోల్డ్ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకుంది. బోల్డ్ ఫోటోషూట్స్ తో సోషల్ మీడియాలో ఆమె సృష్టించే సంచలనం అంతా ఇంతా కాదు. దిశా పటాని వెండి తెరపైకూడా హీటెక్కించే నటి. సోషల్ మీడియాలో అయితే బికినీ పిక్స్, హాట్ ఫోటోషూట్స్ తో మిలియన్ల కొద్దీ అభిమానులని సొంతం చేసుకుంది. 

Disha Patani ఇన్స్టాగ్రామ్ లో తన కొత్త పిక్ పోస్ట్ చేసిందంటే క్షణాల్లో వైరల్ కావలసిందే. అంతలా ఆమె క్రేజ్ వ్యాపించింది. నటిగా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన దిశా పటాని ఒక్క చిత్రంతోనే ఆమె ప్రయాణం ఆగిపోయింది. ఆమె నటన కంటే ఎక్కువగా గ్లామర్, ఎఫైర్ వ్యవహారాలతోనే గుర్తింపు సొంతం చేసుకుంది. 


డాషింగ్ డైరెక్టర్ Puri Jagannadh దర్శకత్వంలో లోఫర్ చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అయింది దిశా పటాని. తొలి చిత్రంలోనే దిశా పటాని గ్లామర్ ఒలకబోసింది. ప్రస్తుతం దిశా పటాని బాలీవుడ్ లో క్రేజీ స్టార్. ఏదో ఒక విధంగా దిశా నిత్యం వార్తల్లో ఉంటుంది. లోఫర్ చిత్రం రిలీజైనప్పుడు ఆమె టాలీవుడ్ కు రెండవ ఇలియానా అని కూడా అభివర్ణించారు. 

ఇక దిశా పటాని, టైగర్ ష్రాఫ్ ల ఎఫైర్ బాలీవుడ్ లో హాట్ టాపిక్. ఈజంట పెళ్లి పీతల వరకు వెళుతుండగా లేక ఇలా ప్రేమతోనే కాలం గడిపేస్తారా అనే ఉత్కంఠ నెలకొంది.  ఇందంతా పక్కన పెడితే దిశా పటాని ఎలాంటి విషయంలో ఐనా బోల్డ్ గా ఉంటుంది. ఓ ఇంటర్వ్యూలో దిశా పటానికి వల్గర్ ప్రశ్నలు ఎదురయ్యాయి. అయినా కూడా దిశా ఆ ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానం ఇచ్చింది. 

ఇదిలా ఉండగా దిశా పటాని మతిపోగోట్టే హావభావాలతో అందాలు ఆరబోస్తున్నఫోటో షూట్ వైరల్ గా మారింది. దిశా క్లీవేజ్, థైస్ అందాలు ఎక్స్ పోజ్ చేస్తున్న ఫోటోస్ కుర్రాళ్లకు కనువిందుగా మారాయి. 

సినిమాల విషయానికి వస్తే దిశా పటాని ప్రస్తుతం ఏక్ విలన్ 2లో నటిస్తోంది. ఈ చిత్రంలో దిశాతో పాటు అర్జున్ కపూర్, జాన్ అబ్రహం, తారా సుతారియా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. 

Latest Videos

click me!