శ్రీదేవి డ్రామా కంపెనీ వేదికగా ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. వర్ష-ఇమ్మానియేల్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీనికి హైపర్ ఆది కారణమయ్యాడు. వర్ష వేరొక వ్యక్తితో రీల్స్ చేసిందని ఇమ్మానియేల్ కి ఆది చెప్పాడు. ఛస్తే చేయదు. నేను నమ్మను అని ఇమ్మానియేల్ అన్నాడు. దాంతో చూడు అంటూ... వర్ష ఓ అజ్ఞాత వ్యక్తితో సన్నిహితంగా ఉన్న వీడియోలు వేదిక మీద ప్లే చేశాడు.
27
Jabardasth Varsha
ఆ వీడియోలు చూసిన ఇమ్మానియేల్ గుండె బద్దలైంది. అప్పటి వరకు వర్ష వేరొకరితో వీడియోలు చేయదని చెప్పిన ఇమ్మానియేల్ నమ్మకం వమ్మయ్యింది. దీంతో ఆగ్రహానికి గురైన ఇమ్మానియేల్ వర్షను నిలదీశాడు. ఎవడే వాడంటూ విరుచుకుపడ్డాడు. రియల్ లవర్ ఎవరు? వాడా నేనా? అని ఫైర్ అయ్యాడు.
37
Jabardasth Varsha
నా మీద నీకు అంత డౌట్ ఎందుకు ఇమ్మానియేల్ నీకు అని వర్ష అసహనం వ్యక్తం చేసింది. నిజంగానే ఈ ప్రశ్న నువ్వు నన్ను అడుగుతున్నావా వర్షా? అని ఎదురు ప్రశ్నించాడు ఇమ్మానియేల్. దీనంతటికీ కారణం నువ్వే అంటూ ఆది మీద పడ్డాడు. వర్ష-ఇమ్మానియేల్ మధ్య హైడ్రామా చోటు చేసుకుంది.
47
Jabardasth Varsha
అయితే ఇదంతా ఫన్ లో భాగమే. వర్ష-ఇమ్మానియేల్ నిజంగానే గొడవ పడలేదు. ఓ సరదా స్కిట్ చేశారన్న మాట. వీరి సంభాషణ నవ్వులు పూయించింది. హైపర్ ఆది ఫారిన్ భార్యను పరిచయం చేయడం. రియల్ కపుల్ రాకింగ్ రాకేష్-సుజాతల మధ్య రొమాంటిక్ మూమెంట్స్ తో కూడిన శ్రీదేవి డ్రామా కంపెనీ లేటెస్ట్ ప్రోమో అలరిస్తుంది.
57
Jabardasth Varsha
కాగా ఇమ్మానియేల్ తో లవ్ ట్రాక్ వర్షకు కలిసొచ్చింది. తెలివిగా వర్ష తనని తాను ఇమ్మానియేల్ లవర్ గా ప్రేక్షకులకు పరిచయం చేసుకుంది. ఆ మధ్య వర్ష-ఇమ్మానియేల్ పై విపరీతమైన ట్రోలింగ్ జరిగింది. యూట్యూబ్ లో దారుణమైన కామెంట్స్ చేశారు. ఆ కామెంట్స్ చూసి ఫీల్ అయిన వర్ష బ్రదర్ ఆమెను నిలదీశాడట. దీంతో షో మానేస్తున్నట్లు వర్ష చెప్పి ఎమోషనల్ అయ్యారు. వర్ష కొన్నాళ్ళు జబర్దస్త్ లో కనిపించలేదు. గ్యాప్ ఇచ్చి రీఎంట్రీ ఇచ్చారు.
67
Jabardasth Varsha
ప్రస్తుతం జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ షోస్ లో వర్ష కనిపిస్తున్నారు. తన మార్కు కామెడీ, గ్లామర్ తో అలరిస్తున్నారు. వర్ష బుల్లితెర స్టార్స్ లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నారు.ఇక ఇమ్మానియేల్ వర్ష నిజంగానే ప్రేమించుకుంటున్నారా? లేక హైప్ కోసమేనా? అనే సందేహం ప్రేక్షకుల్లో ఉంది.
77
Jabardasth Varsha
ఇటీవల నాకు ఎంగేజ్మెంట్ అంటూ థంబ్ నైల్ పెట్టి యూట్యూబ్ వీడియో విడుదల చేసింది. వీడియో చివర్లో నాది కాదు, రాకింగ్ రాకేష్, సుజాలది అంటూ ట్విస్ట్ ఇచ్చింది. దాంతో నెటిజెన్స్ ఆమె మీద అసహనం వ్యక్తం చేశారు.