సీక్రెట్‌గా ఫారెన్‌ అమ్మాయిని పెళ్లి చేసుకున్న హైపర్‌ ఆది? ఏకంగా షోకి తీసుకొచ్చి దొరికిపోయిన వైనం..

Published : Mar 31, 2023, 05:43 PM IST

కమెడియన్‌ హైపర్‌ ఆది.. ఆ మధ్య పెళ్లి చేసుకున్నట్టు వార్తలొచ్చాయి. కానీ అది నిజం కాదని తేలింది. ఇప్పుడు ఏకంగా తన భార్యని షోకి తీసుకొచ్చి షాకిచ్చాడు హైపర్‌ ఆది.   

PREV
15
సీక్రెట్‌గా ఫారెన్‌ అమ్మాయిని పెళ్లి చేసుకున్న హైపర్‌ ఆది? ఏకంగా షోకి తీసుకొచ్చి దొరికిపోయిన వైనం..

హైపర్‌ ఆది ఇప్పుడు కామెడీ షోలలో టాప్‌ కమెడియన్‌గా రాణిస్తున్నాడు. ఆయన పంచ్‌లకు విపరీతమైన క్రేజ్‌ ఉంది. పొలిటికల్‌ డైలాగులు చెప్పినా అవి జనాలను హోరెత్తిస్తుంటాయి. ఓ వైపు టీవీ షోస్‌, మరోవైపు సినిమాలతో బిజీగా ఉన్నాడు హైపర్‌ ఆది. మరోవైపు పవన్‌ కళ్యాణ్‌ జనసేన పార్టీలోనూ యాక్టీవ్‌గా ఉంటున్నారు. పొలిటికల్‌ పంచ్‌లతో మరింత పాపులర్‌ అవుతున్నారు. 
 

25

ఇదిలా ఉంటే ఆ మధ్య హైపర్‌ ఆది పెళ్లి వార్త నెట్టింట చక్కర్లు కొట్టాయి. ఓ అమ్మాయితో ఆయన పెళ్లి చేసుకున్నట్టు ప్రచారం జరిగింది. వీరితో దర్శకుడు చంద్ర సిద్ధార్థ్‌తో ఉన్న ఫోటో నెట్టింట చక్కర్లు కొట్టింది. దీంతో నిజంగానే ఆది పెళ్లి జరిగిందని అనుకున్నారు. కానీ లోతుల్లోకి వెళితే అది నిజం కాదని తేలింది. ఓ సినిమాలో సీన్‌ అని, ఆయనపై పెళ్లి సీన్‌ చిత్రీకరించే క్రమంలో తీసిన ఫోటో అని తేలింది. ఆమె టీవీ నటి అని తెలిసింది. 
 

35

కానీ ఇప్పుడు మరోసారి ఆడియెన్స్ కి షాకిచ్చాడు ఆది. ఏకంగా తన భార్యని షోకి తీసుకొచ్చాడు. నీ భార్య ఏదని యాంకర్‌ రష్మి హైపర్‌ ఆదిని నిలదీసింది. దీంతో ఆమె షోలోకి ఎంట్రీ ఇవ్వడం విశేషం. అయితే హైపర్‌ ఆది భార్య ముఖానికి మాస్క్ పెట్టుకుని వచ్చింది. అంతకు ముందు కరోనా వచ్చింది, 14 రోజుల లాక్‌ డౌన్‌ అంటూ స్కిట్‌ ప్రదర్శించడంతో అందులో భాగంగా హైపర్‌ ఆది భార్య కూడా మాస్క్ తో వచ్చింది. 

45

తన భార్యని చూడాలని రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఈగర్‌గా వెయిటింగ్‌ అని అందరికి పరిచయం చేశాడు ఆది. రిమూవ్‌ మాస్క్ అని చెప్పగా, ఆమె `నో` అని రియాక్ట్ అవుతుంది. తన భార్యని అంతా చూడాలనుకుంటున్నారని, మాస్క్ తీయాలని చెప్పాడు ఆది. ఆమె మరోసారి తిరస్కరించింది. ఇక అసలు విషయం బయటపెట్టాడు ఆది. నేనైనా చూడనివ్వవే, నేను కూడా చూడలేదు నువ్వు ఎవరో అంటూ ప్రాదేయ పడటం విశేషం. దీంతో అసలు బండారం బయటపడింది. ఆమె ఆది భార్య కాదని అర్థమైపోయింది. ఇదంతా స్కిట్‌ కోసం చేసిన డ్రామా అని తెలుస్తుంది. 
 

55

తాజాగా విడుదలైన శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమోలోని సన్నివేశం ఇది. ఈ స్కిట్ ఆద్యంతం నవ్వులు పూయించింది. అనంతరం ఆదికి పంచ్‌లిచ్చాడు బబ్బు(పరేషాన్‌ బాయ్స్) తనదైన సాంగ్‌తో అలరించాడు. అనంతరం రష్మి.. అతని రియల్‌ పేరు అడగ్గా, అవును ఇంతకి ఎవరు నువ్వు అంటూ కామెంట్‌ చేయడంతో ఒక్కసారిగా నవ్వులు విరిసాయి. మరోవైపు ఆది సైతం పక్కన ఉండి డైలాగ్‌లు కొడుతుండగా, నా మైండ్‌లో ఒకటి ఉంది, అడగనా అంటూ ఇంతకి నువ్వు ఎవరు? అనేశాడు. దీంతో అంతా నవ్వులు పూయించారు. ఇంతలోనే ఇంద్రజ అందుకుని హైపర్‌ ఆదికి మొగుడొచ్చాడని చెప్పడం హైలైట్‌గా నిలిచింది. అయితే ఇంద్రజ ఆ రేంజ్‌లో అరవడం మాత్రం అందరికి షాకిచ్చింది. ఆది మాత్రం ఖంగుతిన్నాడు. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories