`బిగ్‌బాస్‌5` మైండ్‌ బ్లోయింగ్‌ అప్‌డేట్‌ః హౌజ్‌లోకి సుడిగాలి సుధీర్‌, సాయితేజ.. షాకింగ్ రెమ్యూనరేషన్‌ ?

Published : Aug 06, 2021, 02:18 PM IST

`బిగ్‌బాస్‌5` ఈ సారి రసవత్తరంగా మారబోతుంది. క్రేజీ స్టార్స్ హౌజ్‌లోకి వెళ్తున్నారు. క్రేజీ యాంకర్స్, క్రేజీ ఆర్టిస్టులు ఐదో సీజన్‌లో సందడి చేయబోతున్నారు. తాజాగా `జబర్దస్త్` కమెడీయన్‌ సుడిగాలి సుధీర్‌, సాయితేజ వెళ్తున్నట్టు సమాచారం.   

PREV
110
`బిగ్‌బాస్‌5` మైండ్‌ బ్లోయింగ్‌ అప్‌డేట్‌ః హౌజ్‌లోకి సుడిగాలి సుధీర్‌, సాయితేజ.. షాకింగ్ రెమ్యూనరేషన్‌ ?

ఇప్పటికే `బిగ్ బాస్‌ 5` సీజన్‌ ప్రోమో వచ్చింది. ఈ సారి కూడా నాగార్జునే హోస్ట్ గా చేయబోతున్నారు. దీనికి సంబంధించి ఓ ఫోటో కూడా లీక్‌ అయ్యింది. సెప్టెంబర్‌ 5న ఈ సీజన్‌ని ప్రారంభించాలని నిర్వహకులు ప్లాన్‌ చేస్తున్నట్టు సమాచారం. త్వరలోనే కంటెస్టెంట్లంతా క్వారంటైన్‌లోకి వెళ్లబోతున్నట్టు సమాచారం. 
 

210

ఇక బిగ్‌బాస్‌ 5కి సంబంధించి యూట్యూబ్‌ స్టార్‌ షణ్ముఖ్‌ జస్వంత్‌, యాంకర్లు వర్షిణి, రవి, శివ, నటి సురేఖా వాణి, సీరియన్‌ నటి నవ్యస్వామి, హీరోయిన్‌ ఈషా చావ్లా, ఆనీ మాస్టర్‌, `కార్తీక దీపం` ఫేమ్‌ ఉమాదేవి, సీరియల్‌ నటుడు సన్నీ, మోడల్‌ జస్వంత్‌, పూనం భజ్వా, లోబో, యాంకర్‌ ప్రత్యూష పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.  గతంలో శేఖర్‌ మాస్టర్‌, మంగ్లీ పేర్లు కూడా వినిపించాయి. కానీ ఇప్పుడు వారి ఎంట్రీ సస్పెన

310

తాజాగా మరో ఇద్దరి పేర్లు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ అవుతున్నాయి. `జబర్దస్త్` కమెడీయన్లు సుడిగాలిసుధీర్‌ సైతం బిగ్‌బాస్‌ సీజన్‌ 5లోకి వెళ్తున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్‌ అవుతుంది. 
 

410

`జబర్దస్త్` షోకి టాక్‌ కమెడీయన్‌గా ఉన్నాడు సుడిగాలి సుధీర్‌. పైగా రష్మీతో ఆయన స్టేజ్‌పై చేసే రొమాన్స్ కి విపరీతమైన ఆదరణ దక్కుతుంది. `జబర్దస్త్`లో వీరి మధ్య సన్నివేశాలే హైలైట్‌గా మారుతుంటాయి. దీంతో షోకి క్రేజ్‌ పెరుగుతుంటుంది. 

510

మరోవైపు `జబర్దస్త్` షోతోపాటు `ఢీ` డాన్స్  షో కింగ్స్ టీమ్‌కి లీడర్‌గా ఉన్నాడు సుడిగాలి సుధీర్‌, అంతేకాదు ఆదివారం ప్రసారమయ్యే `శ్రీదేవి డ్రామా కంపెనీ`కి అతనే హోస్ట్. `రెచ్చిపోదాం బ్రదర్‌` షోలోనూ పాల్గొంటూ ఫుల్‌ బిజీగా ఉన్నాడు సుధీర్.

610

దీంతోపాటు హీరోగా సినిమాలు చేస్తున్నాడు. ఇవన్నీ పక్కన పెట్టి సుడిగాలి సుధీర్‌ బిగ్‌బాస్‌ హౌజ్‌లోకి వెళ్తాడా? అన్నది సస్పెన్స్ గా మారింది. అదేసమయంలో ఈ వార్త హల్‌చల్‌ చేస్తుంది. నిజంగా సుధీర్‌ వస్తే షోకి కళ వస్తుందని చెప్పొచ్చు. హౌజ్‌లో రచ్చ మామూలుగా ఉండదని కూడా చెప్పొచ్చు.

710

ఆయనతోపాటు ట్రాన్స్ జెండర్‌ సాయితేజ అలియాస్‌ ప్రియాంక సింగ్‌ సైతం బిగ్‌బాస్‌ హౌజ్‌లోకి వెళ్లేందుకు ఓకే చెప్పిందని సమాచారం. వీరి త్వరలోనే క్వారంటైన్‌ కాబోతున్నారట. ఇప్పుడీ వార్తలు బిగ్‌బాస్‌ క్రేజ్‌ని మరింతగా పెంచుతున్నాయి. 

810

అయితే ఈ సారి హౌజ్‌లోకి రాబోతున్నందుకు సుడిగాలి సుధీర్‌కి కూడా భారీగానే పారితోషికం ఇవ్వబోతున్నట్టు సమాచారం. దీంతోపాటు మరో కంటెస్టెంట్‌కి షాకింగ్‌ రెమ్యూనరేషన్‌ ఇవ్వనున్నారట. ఆ వార్త సైతం హాట్‌ టాపిక్‌ అవుతుంది. అతను ఎవరో కాదు, యూట్యూబర్‌ షణ్ముఖ్‌ జస్వంత్‌.
 

910

యూట్యూబ్‌ వీడియోలతో బాగా పాపులర్‌ అయ్యాడు షణ్ముఖ్‌. అతన్నుంచి ఓ వీడియో వచ్చిందంటే లక్షల్లో వ్యూస్‌ రావాల్సిందే. ట్రెండింగ్‌లో ఉంటాయి. అంతగా తన వీడియోలతో పాపులర్‌ అయ్యాడు. అతన్ని బిగ్‌బాస్‌లోకి తీసుకొచ్చేందుకు గత మూడు సీజన్లుగా ప్లాన్‌ చేస్తున్నారట. కానీ ఇప్పుడు ఓకే చెప్పినట్టు సమాచారం. 
 

1010

అందుకు అతనికి ఏకంగా కోటి రూపాయలు పారితోషికంగా అందిస్తున్నట్టు సమాచారం. దాదాపు మూడు నెలలు హౌజ్‌లోనే ఉండాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో అంతటి మొత్తాన్ని ఇచ్చేందుకు బిగ్‌బాస్‌ నిర్వహకులు ఓకే చెప్పారని టాక్‌. గతంలో యాంకర్‌ శ్రీముఖికి కోటి రూపాయలు రెమ్యూనరేషన్స్ ఇచ్చారు.  ఆ తర్వాత షణ్ముఖ్‌ కే అని టాక్. అదే సందర్భంలో సుడిగాలి సుధీర్‌కి సైతం భారీగానే ఆఫర్‌ చేస్తున్నట్టు టాక్‌.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories