Jabardasth Satya: ఈ మొహంతో యాక్టింగ్‌ చేస్తావా?, జబర్దస్త్ సత్యకి తీవ్ర అవమానం.. సినీ బ్యాక్‌గ్రౌండ్‌ ఉన్నా తప్పలేదా?

Published : Apr 11, 2026, 02:27 PM IST

Jabardasth Satya: జబర్దస్త్ కమెడియన్‌ గా పాపులర్‌ అయ్యింది జబర్దస్త్ సత్యశ్రీ. ఇప్పుడు సినిమాల్లో రాణిస్తోన్న ఆమె తనకు ఎదురైన అవమానాలను వెల్లడించింది. పెళ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 

PREV
14
జబర్దస్త్ షోతో పాపులర్‌ అయిన సత్యశ్రీ

జబర్దస్త్ కామెడీ షో ద్వారా చాలా మంది ఆర్టిస్ట్ లు ఇండస్ట్రీలోకి వచ్చారు. మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. స్టార్‌ కమెడియన్లుగా రాణించారు. అలా జబర్దస్త్ షో ద్వారా గుర్తింపు తెచ్చుకున్న వారిలో జబర్దస్త్‌ సత్య శ్రీ ఒకరు. ఆమె చమ్మక్‌ చంద్రతో కలిసి చేసిన కామెడీ ఇప్పటికీ మర్చిపోలేరు. గయ్యాలి భార్యగా సత్యశ్రీ చంద్రపై విరుచుకుపడే తీరు ఆకట్టుకుంటుంది. నవ్వులు పూయిస్తుంది. వీరి జంట బాగా పాపులర్‌ అయ్యింది. అయితే చంద్ర కోసమే ఆమె జబర్దస్త్ లోకి వచ్చిందట. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. రావడమేకాదు, అంతే బాగా నటించి, నవ్వించింది. ఇప్పుడు సినిమాల్లో మెరుస్తుంది సత్యశ్రీ. ఈ క్రమంలో లేటెస్ట్ గా తనకు ఎదురైన కొన్ని సంఘటనలను పంచుకుంది సత్య.

24
ఇండస్ట్రీలో అవమానాలు ఫేస్‌ చేసిన సత్యశ్రీ

సత్యశ్రీ మొదట సినిమా ప్రయత్నాలు చేసింది. చాలా ఆఫీస్‌ల చుట్టూ తిరిగిందట. ఈ క్రమంలో తాను చాలా అవమానాలు ఫేస్‌ చేసినట్టు తెలిపింది. ఆఫర్స్ ఇవ్వాలని అడిగితే, కొందరు మొహం మీదే అవమానించినట్టు తెలిపింది. నువ్వు యాక్టింగ్‌ చేస్తావా? అసలు యాక్టింగ్‌ వచ్చా? ఈ మొహంతో యాక్టింగ్‌ చేస్తావా? అంటూ దారుణంగా అవమానించారట. ఇలాంటి సంఘటనలు చాలానే ఉన్నాయని చెప్పింది. సత్య శ్రీ తల్లి సినిమాల్లో ఉంది. ఆమె చాలా సినిమాల్లో నటించింది.  `పెదరాయుడు`లో బ్రహ్మానందంకి భార్యగా చేసింది. ఇంకా చాలా సినిమాల్లో నటించింది.  ఈలెక్కన సత్యశ్రీకి సినిమా బ్యాక్‌ గ్రౌండ్‌ బాగానే ఉంది. దీంతో ఆమెకి ఇండస్ట్రీలోకి వెళ్లడం ఈజీనే, కానీ, తనకు అలా జరగలేదని, అందరిలాగానే తాను ఆఫీస్‌ల చుట్టూ తిరిగినట్టు తెలిపింది సత్యశ్రీ.

34
ఈ ఫేస్‌తో యాక్టింగ్‌ చేస్తావా?

సినిమా బ్యాక్‌గ్రౌండ్‌ ఉన్నా కూడా అవమానాలు, ఎదురుదెబ్బలు తగిలినట్టు వెల్లడించింది సత్యశ్రీ. అయితే వాటిని తాను పాజిటివ్‌గా తీసుకుని, వాటినే ఆయుధంగా మలుచుకుని తాను నటిగా నిరూపించుకున్నట్టు చెప్పింది. అయితే తనకు ఇలాంటి అవమానాలు తప్ప, ఫిజికల్‌ హెరాస్‌మెంట్‌ వంటివి లేవని, ఆ విషయంలో తాను లక్కీ అని తెలిపింది. బేసిక్‌గా తాను బోల్డ్, అండ్‌ డేర్‌ అని, ఎవరూ తనతో అలాంటి సాహసాలు చేయరని చెప్పింది. ఏదైనా ఉంటే తాడో పేడో తేల్చుకునే రకం అని వెల్లడించింది. తన అమ్మ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుందని, తాను ఇండస్ట్రీలోకి వచ్చాక ఆమె సినిమాలు మానేసిందని వెల్లడించింది. ఇప్పుడు తనకు సపోర్ట్ గా తనతోనే ఉంటుందని వెల్లడించింది. తాను సంపాదిస్తున్నాను కాబట్టి వాళ్లు వర్క్ చేయాల్సిన పనిలేదని వెల్లడించింది సత్యశ్రీ. తాజాగా సుమన్‌ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాలను వెల్లడించింది.

44
పెళ్లి పై సత్యశ్రీ క్రేజీ కామెంట్‌

ప్రేమ, పెళ్లి గురించి చెబుతూ, తనని ఎవరూ ప్రేమించలేదని, చిన్నప్పుడు ఓవ్యక్తి తన వెంటపడుతున్నాడని తెలిసి తన నాన్న, బాబాయ్‌ వాళ్లు వాడిని కొట్టారని, ఆ తర్వాత తనతో లవ్‌ ఆట ఎవరూ ఆడలేదని తెలిపింది. అదే సమయంలో పెళ్లిపై పెద్దగా నమ్మకం లేదని, తన ఫ్రెండ్‌ విషయంలో జరిగిన సంఘటన పెళ్లిపై విరక్తి కలిగిందని చెప్పింది. దీంతో ఇప్పుడు పెళ్లి చేసుకోవాలనే ఆలోచన లేదని చెప్పింది. పెళ్లి విషయంలో ఆడవారిపై చిన్నచూపు ఉంటుందని, అది తనకు నచ్చదని తెలిపింది. తనకు పెళ్లి చూపులు జరిగినప్పుడు ఓ అబ్బాయి వచ్చాడు, తనకు ఇలా కావాలి, ఫారెన్‌వెళ్లాలి, వంట రావాలి అంటూ రూల్స్ చెప్పాడు, అప్పుడు `నువ్వు మా పేరెంట్స్ ని చూసుకుంటావా` అని అడగడంతో అతను నో చెప్పాడని, అంతే పెళ్లి చూపులు క్యాన్సిల్‌ అయ్యాయని, ఆ తర్వాత మళ్లీ పెళ్లి ప్రస్తావన లేదని వెల్లడించింది. ఓ రకంగా ఇప్పట్లో పెళ్లిలేదని స్పష్టం చేసింది. అసలు పెళ్లే చేసుకునే ఉద్దేశ్యం లేదని ఆమె చెప్పడం గమనార్హం.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories