ఒకటి రెండు ఫన్నీ సీన్స్ తప్పితే రచయితగా వక్కంతం వంశీ మార్క్ ఎక్కడా కనిపించలేదు. ఇక దర్శకుడిగా తీవ్రంగా నిరాశపరిచారు. నితిన్ తన భుజాలపై సినిమా మొత్తాన్ని మోసినప్పటికీ ఫలితం లేకపోయింది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో వక్కంతం వంశీ రచన, దర్శకత్వం పూర్తిగా బెడిసికొట్టాయి. చాలా సిల్లీగా అనిపించే పాత్రలు, సన్నివేశాలతో విసిగించిన వక్కంతం వంశి విమర్శలు మూటగట్టుకున్నారు.