మరో రెండు రోజుల్లో బిగ్ బాస్ సీజన్ 7 టైటిల్ విన్నర్ ఎవరో తేలిపోనుంది. బిగ్ బాస్ సీజన్ 7 బ్లాక్ బస్టర్ హిట్. అంచనాలకు మించి టీఆర్పీ రాబట్టింది. హోస్ట్ నాగార్జునకు కూడా డిస్టెన్స్ మార్క్స్ పడ్డాయి. షోని సరికొత్తగా డిజైన్ చేయడం కలిసొచ్చింది. కంటెస్టెంట్స్ కూడా శక్తిమేర ప్రేక్షకులను ఎంటర్టైన్ చేశారు.
27
Bigg Boss Telugu 7
ఫైనల్ కి గెస్ట్స్ గా మహేష్ బాబు వస్తున్నారని టాక్ నడుస్తుంది. గుంటూరు కారం షూటింగ్ హైదరాబాద్ లోనే జరుగుతుంది. బిగ్ బాస్ ఫినాలే వేదికగా గుంటూరు కారం మూవీని ప్రమోట్ చేయనున్నారట. మహేష్ బాబు, త్రివిక్రమ్ హోస్ట్ నాగార్జునతో బిగ్ బాస్ వేదిక పంచుకుంటారని సమాచారం.
37
Bigg Boss Telugu 7
ఇక నేటితో ఓటింగ్ ముగియనుంది. ఫలితాలు షాక్ ఇస్తున్నాయి. అమర్ దీప్-శివాజీ-ప్రశాంత్ మధ్య టైటిల్ పోరు నడుస్తుంది. రెండు విధాలుగా ఫెవరేట్ కంటెస్టెంట్స్ కి ఓటు వేసే అవకాశం ఉంది. హాట్ స్టార్ సబ్స్క్రిప్షన్ ఉన్నవారు అక్కడ ఓటు వేయవచ్చు. అలాగే మిస్డ్ కాల్ ద్వారా కూడా ఓటు వేయవచ్చు.
47
Bigg Boss Telugu 7
ఈ రెండు ఫ్లాట్ ఫార్మ్స్ ఓటింగ్ రిజల్ట్స్ వేరుగా ఉన్నాయని తాజా సమాచారం. హాట్ స్టార్ లో శివాజీకి ఎక్కువగా ఓట్లు నమోదు అవుతున్నాయట. అక్కడ ఆయన ప్రథమ స్థానంలో ఉన్నాడట. ఇక రెండో స్థానంలో పల్లవి ప్రశాంత్ ఉన్నాడట. మూడో స్థానంలో అమర్ ఉన్నాడట.
57
Bigg Boss Telugu 7
మిస్డ్ కాల్స్ లో పల్లవి ప్రశాంత్ టాప్ లో ఉన్నాడట. అతడిని ఇష్టపడే వారు, అభిమానులు గ్రామీణ ప్రాంతాల నుండి ఉన్నారు. దాంతో మిస్డ్ కాల్స్ లో పల్లవి ప్రశాంత్ టాప్ లో ఉన్నాడట. రెండో స్థానంలో శివాజీ, మూడో స్థానంలో అమర్ కొనసాగుతున్నాడట.
67
Bigg Boss Telugu 7
ఈ సమాచారం ప్రకారం పల్లవి ప్రశాంత్-శివాజీ టైటిల్ రేసులో ఉన్నారు. అమర్ దీప్ వెనుకబడ్డాడని తెలుస్తుంది. ప్రతి సీజన్లో టైటిల్ విన్నర్ ఎవరో తెలిసిపోయేది. యూనానిమస్ గా ఒకరి పేరు ప్రముఖంగా వినిపించేది. ఈసారి ముగ్గురి పేర్లు వినిపిస్తున్నాయి. దీంతో టైటిల్ విన్నర్ ఎవరనే ఉత్కంఠ నడుస్తుంది.
77
Bigg Boss Telugu 7
ఈసారి ఫైనలిస్ట్స్ గా ఆరుగురిని ప్రకటించారు. శివాజీ, అమర్ దీప్, ప్రశాంత్, అర్జున్, యావర్, ప్రియాంక హౌస్లో ఉన్నారు. మిడ్ వీక్ ఎలిమినేషన్ కూడా లేదని సమాచారం