తల్లి గర్భంలోనే మరణించిన శిశువు.. ముక్కు అవినాష్ కుటుంబానికి తీవ్ర వేదన, నన్నేమి అడగొద్దు అంటూ..

First Published | Jan 7, 2024, 9:21 AM IST

ముక్కు అవినాష్ కి జబర్దస్త్ షో గుర్తింపు తీసుకువచ్చింది. అయితే బిగ్ బాస్ 4 లో పాల్గొన్న తర్వాత అవినాష్ కెరీర్ లో మరింత బిజీ అయ్యాడు. నాలుగు రాళ్లు వెనకేసుకుంటున్నాడు.జబర్దస్త్ ఆఫర్స్ రాకముందు, కోవిడ్ సమయంలో అవినాష్ తీవ్ర మానసిక వేదన అనుభవించాడట.

ముక్కు అవినాష్ కి జబర్దస్త్ షో గుర్తింపు తీసుకువచ్చింది. అయితే బిగ్ బాస్ 4 లో పాల్గొన్న తర్వాత అవినాష్ కెరీర్ లో మరింత బిజీ అయ్యాడు. నాలుగు రాళ్లు వెనకేసుకుంటున్నాడు.జబర్దస్త్ ఆఫర్స్ రాకముందు, కోవిడ్ సమయంలో అవినాష్ తీవ్ర మానసిక వేదన అనుభవించాడట. అయితే శ్రీముఖి, చమ్మక్ చంద్ర లాంటి వాళ్ళు సహాయం చేయడంతో బిగ్ బాస్ కి వెళ్లి మరింత పాపులర్ అయ్యాడు. 

ఇప్పుడు పలు షోలు చేస్తూ బిజీ ఆర్టిస్ట్ గా ఉన్నాడు. ఆ మధ్యన ముక్కు అవినాష్ వివాహం కూడా చేసుకున్న సంగతి తెలిసిందే. అవినాష్ భార్య పేరు అనూజ. 2021లో వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. అయితే గత ఏడాది అవినాష్, అనూజ దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నట్లు సంతోషంగా ప్రకటించారు.సీమంతం, మెటర్నిటీ ఫోటో షూట్స్ కూడా చాలా గ్రాండ్ గా జరిగాయి. 


అనూజ తన బేబీ బంప్ ఫొటోస్ ని తరచుగా సోషల్ మీడియాలో పంచుకునేది. తామిద్దరం తల్లి దండ్రులు కాబోతున్నందుకు ఎంతో సంతోషంగా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నట్లు పలు సందర్భాల్లో తెలిపారు. అయితే ఊహించని పరిణామం ఎదురైంది. ముక్కు అవినాష్ , అనూజ దంపతులకు వారి కుటుంబ సభ్యులకు తీవ్ర వేదన మిగిలింది. 

Jabardasth avinash

దాదాపు 7 నెలలు నిండిన తర్వాత శిశువు తల్లి గర్భంలోనే మరణించింది. ఈ చేదు వార్తని ముక్కు అవినాష్ స్వయంగా తన సోషల్ మీడియాలో తెలిపాడు. ఎంతో భావోద్వేగానికి గురవుతూ పోస్ట్ చేశాడు. 

నా లైఫ్ లో సంతోషమైన, బాధ అయినా… నా ఫ్యామిలీ అయినా మీతోనే పంచుకుంటాను. ఇప్పటి వరకు నా ప్రతి ఆనందాన్ని మీతోనే పంచుకున్నాను. కానీ మొదటి సారి నా జీవితంలో జరిగిన ఒక విషాదాన్ని మీతో పంచుకుందాం అని అనుకుంటున్నాను. మేము అమ్మ నాన్న అవ్వాలనే ఆ రోజు కోసం ఎదురు చూసాం. కానీ కొన్ని కారణాల వల్ల మేము మా బిడ్డనీ కొల్పోయాం. ఈ విషయం మేము ఎప్పటికీ జీర్ణించుకోలేనిది. అంత తొందరగ మర్చిపోలేనిది. 

మీకు ఎప్పటికైనా చెప్పాలి అన్న బాధ్యతతో ఈ విషయాన్నీ మీతో పంచుకుంటున్నాను. ఇప్పటివరకు మీరు మాపై చూపించిన ప్రేమకు థంక్యూ. మీ ప్రేమ ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే దయచేసి ఈ విషయంపై ఎలాంటి ప్రశ్నలు అడిగి మమ్మల్ని బాధ పెట్టవద్దు. మీరందరూ అర్థం చేసుకుంటారని కోరుకుంటూ మీ అనూజ అవినాష్.. అని పోస్ట్ చేశాడు. 

ఈ చేదు సంఘటన ఎలా జరిగింది, కారణాలు ఏంటి అనే విషయాన్ని అవినాష్ పంచుకోలేదు. శ్రీముఖి అవినాష్ పోస్ట్ పై స్పందిస్తూ మీకు జరిగిన నష్టానికి చింతిస్తున్నాను.. ధైర్యంగా ఉండు అని కామెంట్ పెట్టింది. అలాగే బుల్లితెర, బిగ్ బాస్ సెలెబ్రిటీలు శివజ్యోతి, మెహబూబ్, హరితేజ, నటి గాయత్రీ భార్గవి, సిరి హనుమంత్ లాంటి వారంతా ముక్కు అవినాష్ కి సానుభూతి తెలియజేస్తూ ధైర్యం చెబుతున్నారు. 

Latest Videos

click me!