తాజా వార్తలుఎంటర్‌టైన్‌మెంట్క్రికెట్జీవనశైలిఆంధ్రప్రదేశ్తెలంగాణబిజినెస్జ్యోతిష్యంKEA 2025

వైట్‌ డ్రెస్‌లో కుర్రాళ్ల హృదయాల్లో కల్లోలం సృష్టిస్తున్న `జబర్దస్త్` రష్మి.. అప్సరస దారితప్పి కిందకొచ్చిందా?

Aithagoni Raju | Updated : Nov 24 2023, 09:11 PM IST

`జబర్దస్త్` రష్మి.. యాంకర్‌గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ని క్రియేట్‌ చేసుకుంది. చాలా వరకు వివాదాలకు దూరంగా ఉండేఈ భామ జంతు ప్రేమికురాలిగా రాణిస్తుంది.   

110
వైట్‌ డ్రెస్‌లో కుర్రాళ్ల హృదయాల్లో కల్లోలం సృష్టిస్తున్న `జబర్దస్త్` రష్మి.. అప్సరస దారితప్పి కిందకొచ్చిందా?

రష్మి గౌతమ్‌.. యాంకర్‌గా స్టార్‌ ఇమేజ్‌ని సొంతం చేసుకుంది. ఆమె తనదైన యాంకరింగ్‌తో ఆడియెన్స్ ని మెప్పిస్తుంది. టీవీ షోస్‌ని రక్తికట్టిస్తుంది. ఆమె అందానికి, అభినయం తోడు కావడం, ముద్దుముద్దు మాటలతో అలరించడంతో రష్మిని చూసేందుకు ఆడియెన్స్ ఇష్టపడుతుంటారు. 
 

210

డస్కీ బ్యూటీగా మెప్పించే రష్మి గౌతమ్‌.. సుడిగాలి సుధీర్‌తో రొమాన్స్ తో బాగా పాపులర్‌ అయ్యింది. ఈ ఇద్దరి జోడీ `జబర్దస్త్` షోని తిరుగులేని కామెడీ షోగా మార్చారు. ఆ క్రెడిట్‌ ఈ జోడీకి దక్కుతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. 
 

310

సుడిగాలి సుధీర్‌.. షోని వదిలేశాక ఈ షోకి క్రేజ్‌ తగ్గింది. అలాంటి కెమిస్ట్రీ పండించే జోడీ మిస్‌ అయ్యింది. రష్మి, సుధీర్‌ జంట ఎవర్‌ గ్రీన్‌ అనే సంకేతాలనిచ్చింది. అడపాదడపా ఈ ఇద్దరు కలుస్తుంటారు. ఆ సమయంలో పూర్వ వైభవం వచ్చిన ఫీలింగ్‌ కలుగుతుంది. 
 

410

అయితే రష్మి,సుధీర్‌లకు సెపరేట్‌గా ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఏర్పడింది. వీరిని జంటగా ఆడియెన్స్ అభిమానించడం విశేషం. అంతగా ఈ ఇద్దరికి జనం కనెక్ట్ అయ్యారంటే అతిశయోక్తి లేదు. చాలా అరుదుగానే జరుగుతుంది. సినిమాల్లో ఎక్కువ సినిమాలు కలిసి నటించిన జంటగా అలా అభిమానిస్తారు. బుల్లితెరపై అలాంటి జోడీ ఉండటం విశేషమనే చెప్పాలి. 
 

510

సుధీర్‌ లేకపోవడంతో రష్మి కూడా ఒంటరైన ఫీలింగ్‌ కలుగుతుంది. వీరిద్దరి కాంబినేషన్‌లో చూసిన కళ్లు ఒంటరిగా చూస్తే ఏదో లోటు కనిపిస్తుంది. అందుకే మళ్లీ సుధీర్‌ జబర్దస్త్ కి రావాలని కోరుకుంటున్నారు. ఆ డిమాండ్‌ వినిపిస్తూనే ఉంది. 

610

ఇక అయితే సుధీర్‌ అనే ఇమేజ్‌ నుంచి తాను బయటపడేందుకు రష్మి ప్రయత్నిస్తుంది. తాను సొంతంగా రాణించాలని భావిస్తుంది. ఒంటరిగానే తాను అలరిస్తుంది. అందుకు తన గ్లామర్‌ ట్రీట్‌ని కూడా యాడ్‌ చేస్తుంది. 
 

710

గతంలోనూ వరుసగా ఫోటో షూట్లతో అందాల విందు ఇచ్చే రష్మి ఇటీవల తగ్గించింది. కానీ ఏదో రూపంలో ఇస్తూనే ఉంది. తాజాగా ఈ బ్యూటీ వైట్‌ డ్రెస్‌లో మెరిసిపోయింది. అందాల దేవతలా కనిపిస్తుంది. ఆకాశంలో ఉండే అప్సరస దారి తప్పి నేలపైకి వచ్చిందా అనేట్టుగా మారింది. 
 

810

అంతేకాదు వైట్‌ డ్రెస్‌లో జబర్దస్త్ రష్మి అందం మరింత పెరిగిపోయింది. ఇంకా చెప్పాలంటే చూడ్డానికి రెండు కళ్లు సరిపోవడం లేదు. దీంతో నెటిజన్లు అల్లకల్లోలం అవుతున్నారు. ఆమె అందానికి ఫిదా అవుతున్నారు. 
 

910

అందమంటే స్కిన్‌ షో కాదు, నిండైన దుస్తుల్లోనూ అందంగా ఎలా ఉండాలో చెప్పేందుకు రష్మి గౌతమ్‌ లేటెస్ట్ ఫోటో షూట్‌ ఓ ఉదాహరణగా చెప్పొచ్చు. ప్రస్తుతం ఈ బ్యూటీ గ్లామర్‌ పిక్స్ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. నెటిజన్లని మంత్రముగ్దుల్ని చేస్తున్నాయి. 

1010

ఇక యాంకర్‌గా రష్మి గౌతమ్‌ బిజీగా ఉంది. ఆమె ఓ వైపు `జబర్దస్త్` కామెడీ షోని, మరోవైపు `శ్రీదేవి డ్రామా కంపెనీ`ని హోస్ట్ చేస్తూ రాణిస్తుంది. వారానికి రెండు సార్లు మెరుస్తూ అలరిస్తుంది.

About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!
Recommended Photos