`యానిమల్‌` మూవీ సీఎం జగన్‌ బయోపికా? తండ్రి ప్రేమ కోసమే ఇదంతా చేస్తున్నాడా? షాకిస్తున్న మీమ్స్, ట్రోల్స్..

Published : Nov 24, 2023, 06:51 PM ISTUpdated : Nov 24, 2023, 06:53 PM IST

రణ్‌బీర్‌ కపూర్‌, రష్మిక కలిసి నటించిన `యానిమల్‌` మూవీ ట్రైలర్ విడుదలైంది. అయితే ఇది ఏపీ సీఎం జగన్‌ బయోపికా? అంటూ ట్రోల్స్, మీమ్స్ వైరల్‌ అవుతున్నాయి. నెట్టింట రచ్చ చేస్తున్నాయి.   

PREV
15
`యానిమల్‌` మూవీ సీఎం జగన్‌ బయోపికా? తండ్రి ప్రేమ కోసమే ఇదంతా చేస్తున్నాడా? షాకిస్తున్న మీమ్స్, ట్రోల్స్..

రష్మిక మందన్నా(Rashmika Mandanna), రణ్‌ బీర్‌ కపూర్‌(Ranbir Kapoor) జంటగా `యానిమల్‌`(Animal) సినిమాలో నటించారు. సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ హిందీలో రూపొందింది. పాన్‌ ఇండియా చిత్రంగా రిలీజ్‌ కాబోతుంది. డిసెంబర్‌ 1న సినిమాని గ్రాండ్‌గా రిలీజ్‌ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో గురువారం ఈ మూవీ ట్రైలర్‌ విడుదలచేశారు. తండ్రి ప్రేమ కోసం ఓ కొడుకు చేసే పోరాటం, ప్రతీకారం నేపథ్యంలో ఈ మూవీ సాగుతుందని ట్రైలర్‌ చూస్తుంటే అర్థమవుతుంది. 

25

ఓ రకంగా ఇందులో కొడుకుగా రణ్‌బీర్‌ సైకో గా కనిపించాడు. హీరోయిన్‌ రష్మిక కూడా అలా పోల్చుతూ ఆయన్ని తిట్టింది. ప్రస్తుతం ట్రైలర్‌ ట్రెండ్‌ అవుతుంది. ఇదొక కొత్త తరహా మూవీ అవుతుందని భావిస్తున్నారు. ట్రైలర్‌ క్రేజీ అంటూ ప్రశంసలొస్తున్నాయి. మరి సినిమా ఎలా ఉంటుందనేది చూడాలి. ఇదిలా ఉంటే ఓ షాకింగ్ విషయం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. ఇది ఏపీ(ఆంధ్రప్రదేశ్‌) సీఎం వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి(Ys jaganmohan Reddy) బయోపికా అనే సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. 

35

అంతేకాదు ట్రోల్స్, మీమ్స్ తో ఆడుకుంటున్నారు. `యానిమల్‌` మూవీ వైఎస్‌ జగన్‌ బయోపిక్‌ అంటూ రచ్చ చేస్తున్నారు. ఈ మేరకు ట్రైలర్‌ నుంచి సీన్లకి రియల్‌ లైఫ్‌లో మాజీ సీఎం వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి,(Ysr) ప్రస్తుత సీఎం వైఎస్‌ జగన్‌ల మధ్య అనుబంధాన్ని, వారి మధ్య చోటు చేసుకున్న పరిణామాలను బయటకు తీసి, రెండింటి మధ్య పోలికలు వెతుకుతున్నారు. రెండూ కంపేర్‌ చేస్తూ ఇది సీఎం జగన్‌ బయోపిక్కే అంటున్నారు. 

45

సోషల్‌ మీడియాలో ఓ మీమర్‌ తయారు చేసి పోస్ట్ వైరల్ అవుతుంది. దీంతో దీనిపై నెటిజన్లు స్పందిస్తూ ఆశ్చర్యకరమైన పోస్ట్ లు పెడుతున్నారు. సినిమాలో చంద్రబాబు నాయుడి పాత్ర బాబీ డియోల్‌ దా? అని, బాబాయ్‌ సీన్‌ మాత్రం కచ్చితంగా ఉండాలని, అలాగే అయితే సినిమాలో చివరికి తండ్రిని కొడుకే చంపేస్తాడట,అది నిజమేనా? అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ రచ్చ ఓ వైపు సాగుతుంటే, ఇదంతా పచ్చ బ్యాచ్‌ పని అని జగన్‌ ఫ్యాన్స్ కౌంటర్లిస్తున్నారు. మొత్తంగా ఇది సోషల్‌ మీడియాలో హీటు పెంచుతుంది. 

55

వైఎస్‌ జగన్‌ ఓదార్పు యాత్ర ప్రధానంగా ప్రస్తుతం `యాత్ర 2` చిత్రం రూపొందుతుంది. మహి వీ రాఘవ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. జగన్‌ పాత్రలో జీవా నటిస్తున్నారు. వైఎస్‌ఆర్‌గా మమ్ముట్టి కనిపించబోతున్నారు. ఇది ఫిబ్రవరిలో రిలీజ్‌ కాబోతుంది. మరోవైపు సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్న `యానిమల్‌` మూవీలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తుంది. రణ్‌బీర్‌కి తండ్రి పాత్రలో అనిల్‌ కపూర్‌, విలన్‌గా బాబీ డియోల్‌ నటిస్తున్నారు. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories