రెండేళ్లుగా సీక్రెట్‌ లవ్‌.. ఎట్టకేలకు లవర్‌ని పరిచయం చేసిన`జబర్దస్త్` నరేష్‌.. నోరెళ్లబెట్టిన కమెడియన్లు..

Published : Nov 26, 2023, 08:28 PM IST

`జబర్దస్త్` నరేష్‌ బుల్లితెరపై ఎంతగా పాపులరో అందరికి తెలిసిందే. ఆయన తనదైన కామెడీతో నవ్విస్తున్నారు. అందరిచేత నవ్వులు పూయిస్తున్నారు. కానీ ఉన్నట్టుండి పెద్ద సర్‌ప్రైజ్‌ ఇచ్చాడు నరేష్‌.   

PREV
19
రెండేళ్లుగా సీక్రెట్‌ లవ్‌.. ఎట్టకేలకు లవర్‌ని పరిచయం చేసిన`జబర్దస్త్` నరేష్‌.. నోరెళ్లబెట్టిన కమెడియన్లు..

జబర్దస్త్ నరేష్‌.. పొట్టి నరేష్‌గా పాపులర్‌. కానీ కామెడీ చేయడంలో మాత్రం అందరికంటే తోపు. తన సైజ్‌పైనే చాలా వరకు పంచ్‌లు వేసుకుంటూ నవ్వు పుట్టిస్తుంటారు. కొన్నేళ్లపాటుగా ఆయన తనదైన కామెడీతో అలరిస్తున్నారు. ఆడియెన్స్ ని ఎంటర్‌టైన్‌ చేస్తున్నారు. `జబర్దస్త్` కి స్ట్రాంగ్‌ కమెడియన్లలో ఒకరిగా ఉన్నాడు.
 

29

అయితే నరేష్‌.. ఎప్పుడూ తన సైజ్‌, తన పెళ్లిపైనే కామెడీ చేసి నవ్వించాడు. ఆ విషయంలో ఎంతో స్ఫోర్టీవ్‌గా తీసుకుని ముందుకు సాగుతుంటాడు. తనపై వేసే పంచ్ లను సైతం అంతే పాజిటివ్‌గా తీసుకుంటాడు. ఎంటర్‌టైన్‌ చేస్తుంటాడు. అయితే తరచూ ఆయన పెళ్లికి సెట్‌ కాడు, ప్రేమ, పెళ్లి ముచ్చట్లు ఉండవనేలా ఆయన స్కిట్లు ఉంటాయి. కానీ రియల్‌ లైఫ్‌లో మాత్రం తాను అన్నింటిలోనూ తగ్గేదెలే అని నిరూపించుకుంటున్నాడు. 
 

39

ఇన్నాళ్లు దాచిన ఓ పెద్ద సీక్రెట్‌ని బయటపెట్టాడు నరేష్‌. తనకు లవర్‌ ఉందనే విషయాన్ని వెల్లడించారు. ఇప్పటి వరకు చాలా సీక్రెట్‌గా తన లవ్‌ని మెయింటేన్‌ చేశాడట. ఎట్టకేలకు ఇప్పుడు బయట పెడుతున్నట్టు తెలిపారు. ఈ మేరకు షోలో అందరి ముందు తన ప్రియురాలిని పరిచయంచేయడం విశేషం. `శ్రీదేవి డ్రామా కంపెనీ`లో ఆయన తన ప్రేమికురాలిని అందరికి ఇంట్రడ్యూస్‌ చేశాడు నరేష్‌. 
 

49

ఇందులో యాంకర్‌ రష్మి.. మేం విన్నది నిజమేనా అని అడగ్గా, అవునండి, ఇక నేనే చెప్పేస్తా.. ఇన్ని రోజులు చాలా సీక్రెట్‌గా మెయింటేన్‌ చేశాను. నాకూ ఒక లవర్‌ ఉంది అంటూ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతూ వెల్లడించారు. అంతలోనే తన ప్రియురాలిని స్టేజ్‌పైకి ఆహ్వానించారు. 

59

దీంతో ఆమె ఆనందంతో శ్రీదేవి డ్రామా కంపెనీ షో స్టేజ్‌పైకి వచ్చింది. ఎప్పటిలాగే వీరిపై కూడా లవ్‌ డ్యూయెట్లు వేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మాటల్లో చెప్పలేనంత లవ్‌ చేశారు. అంతటి ప్రేమనిచ్చాడు ఈ రెండేళ్లలో అని తెలిపింది. దీంతో నరేష్‌.. స్టేజ్‌పైనే ఆమెకి గులాబీ పువ్వు ఇస్తూ లవ్‌ని ప్రపోజ్‌ చేశాడు. 
 

69

అయితే ఆయన ఇచ్చిన హార్ట్ బెలూన్, రోజాపువ్వు తీసుకుని ఆయనకు ముద్దు పెట్టింది నరేష్‌ లవర్‌. ఈ సందర్భంగా ఇద్దరు కలిసి ప్రేమగీతానికి కొన్ని మూమెంట్స్ ఇచ్చారు. రచ్చ చేశారు. ప్రస్తుతం లవ్‌ ట్రాక్‌ వైరల్‌ అవుతుంది. యూట్యూబ్‌లో ట్రెండ్‌ అవుతుంది. 
 

79

నరేష్‌.. ఫాదర్‌ కూడా స్టేజ్‌పైకి వచ్చాడు. మరి వీరి ప్రేమ మీకు అంగీకారమేనా? అని అడగ్గా.. ఆయన కూడా ఇప్పుడు ఓకే అండి అని చెప్పారు. దీంతో నరేష్‌, ఆయన లవర్‌.. తండ్రి కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు. వారి పెళ్లికి పేరెంట్స్ నుంచి కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడం విశేషం. దీంతో ఇప్పుడిది హాట్‌ టాపిక్‌ అవుతుంది. 

89

అయితే ఇప్పటి వరకు జబర్దస్త్ లో సుడిగాలి సుధీర్‌-రష్మి ఇలాంటి డ్యూయెట్లు పడుకున్నారు. వర్ష-ఇమ్మాన్యుయెల్‌ పాడుకున్నారు. రాకేష్‌-సుజాత పాడుకున్నారు. కానీ రాకేష్‌, సుజాతలు పెళ్లి చేసుకుని సెటిల్‌ అయ్యారు. మరి నరేష్‌ది నిజంగానే ప్రేమని, టీఆర్‌పీ కోసం చేసిన స్టంటా అనేది అనుమానంగా మారింది.

99

ఆడియెన్స్ ఇది టీఆర్‌పీ స్టంట్‌ అంటున్నారు. అయితే కొంత మంది మాత్రం నరేష్‌ ఇచ్చిన సర్‌ప్రైజ్‌కి షాక్‌ అవుతున్నారు. ఏంటీ నరేష్‌కి లవర్‌ ఉందా? అంటూ ఆశ్చర్య వ్యక్తం చేస్తున్నారు. అయితే పేరెంట్స్ ఓకే చెప్పడం, ఆశీర్వాదాలు తీసుకోవడం చూస్తుంటే, ఇది నిజమే అనిపిస్తుంది.  

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories