కన్నడ బ్యూటీ శ్రీలీల ఆనతి కాలంలో స్టార్ అయ్యింది. మహేష్ బాబు, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ వంటి టాప్ స్టార్స్ పక్కన ఛాన్స్ కొట్టేసింది. పెళ్లి సందడి చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈ భామ, ధమాకాతో మొదటి హిట్ కొట్టింది. స్కంద ప్లాప్ అయినా భగవంత్ కేసరితో మరో విజయం అందుకుంది.