ఏళ్ల తరబడి తిరుగులేని షోగా బుల్లితెరను ఏలింది జబర్దస్త్. హాస్య ప్రియుల బెస్ట్ ఛాయిస్ గా ఉండేది. చిన్న పిల్లల నుండి పెద్దల వరకు, క్లాస్ మాస్ అనే తేడా లేకుండా జబర్దస్త్ జనాల్లోకి చొచ్చుకుపోయింది. వరల్డ్ వైడ్ గా ఉన్న తెలుగు ప్రేక్షకులు యూట్యూబ్ లో చూసి ఎంజాయ్ చేసేవారు. ఒంటరిగా ఉన్నప్పుడు, ప్రయాణాల్లో జబర్దస్త్ చూస్తూ కాలక్షేపం చేసేవారు.
అంత పాపులారిటీ తెచ్చుకున్న జబర్దస్త్ లో నటించే లీడర్స్, కంటెస్టెంట్స్ పేర్లు జనాల మెదళ్లలో రిజిస్టర్ ఐపోయారు. ముఖ్యంగా హైపర్ ఆది, సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, ఆటో రామ్ ప్రసాద్, చమ్మక్ చంద్ర, రాకెట్ రాఘవ, చలాకీ చంటి, ముక్కు అవినాష్ ఇలా అనేక మంది ఓ బ్రాండ్ నేమ్ సొంతం చేసుకున్నారు.
28
Chammak Chandra
ఇదే సమయంలో చాలా మంది ఔత్సాహికులు, నటులు కావాలనుకున్నవారు జబర్దస్త్(Jabardasth) కి వెళ్లాలని ఆశపడేవారు. ముఖ్యంగా మేల్ యాక్టర్స్ ఆసక్తి చూపించేవారు. తర్వాతర్వాత అమ్మాయిలు కూడా ఎంట్రీ ఇవ్వడం స్టార్ట్ చేశారు. లేడీ గేటప్స్ వేసే అబ్బాయిల స్థానంలోకి వర్ష, సత్యశ్రీతో పాటు పలువురు అమ్మాయిలు వచ్చారు.
38
Jabardasth satyasri comments over Pawan kalyan
ఇక జబర్దస్త్ లో అవకాశం కావాలంటే టీమ్ లీడర్స్ అనుమతి కావాలి. వందల మంది పోటీపడుతున్న నేపథ్యంలో జబర్దస్త్ టీం లీడర్స్ టాలెంట్ ఉన్నవారిని, తమకు తెలిసిన వారిని, అనుకూలంగా ఉండేవారికి మాత్రమే ఛాన్స్ ఇచ్చేవారు. ఈ క్రమంలో జబర్దస్త్ లో క్యాస్టింగ్ కౌచ్ కూడా జరిగినట్లు అప్పుడప్పుడూ ఆరోపణలు వచ్చాయి.
48
Jabardasth satyasri
కాగా జబర్దస్త్ షోలో నటించిన లేడీ కమెడియన్స్ లో సత్యశ్రీ ఒకరు. ఆమెను చమ్మక్ చంద్ర(Chammak chandra) తీసుకొచ్చారు. సాధారణంగా వచ్చిన వెంటనే స్కిట్ లో ప్రాధాన్యత ఇవ్వరు. కొన్నాళ్ళ పాటు డైలాగ్స్ లేని రోల్స్ చేయాల్సి ఉంటుంది. అయితే సత్యకు చమ్మక్ చంద్ర మొదటి నుండి స్కిట్ లో పెద్ద పోర్షన్ ఇచ్చేవారు. ఎక్కువగా ఆమె ఆయన భార్య పాత్రలు చేసేది.
58
Jabardasth satyasri
జబర్దస్త్ షోని వీడే వరకు సత్యశ్రీ చమ్మక్ చంద్ర స్కిట్స్ లో చేశారు. చంద్ర వెళ్లిపోవడంతో ఆమె కూడా షో వదిలేశారు. వీరిద్దరూ కలిసి స్కిట్స్ చేస్తున్న సమయంలో కొన్ని రూమర్స్ చక్కర్లు కొట్టాయి. పెళ్ళైన చమ్మక్ చంద్రతో సత్యశ్రీ ఎఫైర్ నడుపుతున్నారనేది ఆ ఆరోపణ. చమ్మక్ చంద్రకు దగ్గర కావడం వలనే జబర్దస్త్ లో ఆమెకు చోటు దక్కిందన్న వాదనలు తెరపైకి వచ్చాయి.
68
Jabardasth satyasri
ఈ వార్తలపై సత్యశ్రీ తాజాగా స్పందించారు. ఆమె మాట్లాడుతూ... ఈ పుకార్లు నా వరకు వచ్చాయి. నన్ను ఫస్ట్ అడిగింది మా నాన్నగారే కావడం విశేషం. ఆయన ఓ యూట్యూబ్ వీడియో చూపించి, చమ్మక్ చంద్రతో నీకు ఎఫైర్ అంటున్నారని ఆయన అన్నారట. అప్పుడు మీరు ఏమనుకుంటున్నారు నాన్న... అని అడగ్గా... చమ్మక్ చంద్ర గురించి నాకు తెలుసు, నీ గురించి కూడా నాకు తెలుసు, ఇలాంటివి వస్తున్నాయంటే నీవు ఎదుగుతున్నావని అర్థం. పట్టించుకోను అన్నారట.
78
తర్వాత చమ్మక్ చంద్రతో కూడా నేను ఈ విషయాన్ని డిస్కస్ చేశాను. అది కూడా మా టీం సభ్యులు అందరూ ఉండగా. చమ్మక్ చంద్ర కూడా పెద్ద పెద్ద వాళ్లపైనే రాశారు, మనం ఎంత, ఇలాంటి పుకార్లు వస్తూనే ఉంటాయి పట్టించుకోకూడదు అన్నారని, సత్యశ్రీ వివరణ ఇచ్చింది.
88
ప్రస్తుతం సత్యశ్రీ బుల్లితెరపై అంత యాక్టివ్ గా లేరు. జబర్దస్త్ వీడాక ఆమె కనిపించింది తక్కువే. ఆమె గురువు చమ్మక్ చంద్ర స్టార్ మాలో ప్రసారం అవుతున్న కామెడీ స్టార్స్ లో చేస్తున్నారు. ఈ క్రమంలో సత్యశ్రీ అక్కడకు వెళ్లే సూచనలు కలవు.