సుధీర్‌, రష్మి పెళ్లిపై బాంబ్‌ పేల్చిన `జబర్దస్త్` కమేడియన్.. ఫ్యాన్స్ కిది నిజంగా బ్యాడ్‌ న్యూసే

Published : Jul 16, 2022, 02:36 PM ISTUpdated : Jul 16, 2022, 04:43 PM IST

టీవీ రంగంలో మోస్ట్ క్రేజీ లవ్‌ కపుల్‌గా పాపులర్‌ అయిన రష్మి-సుడిగాలి సుధీర్‌ మధ్య రిలేషన్‌ని బయటపెట్టారు గెటప్‌ శ్రీను. వీరిపై ఆయన బాంబులు పేల్చారు. నిజం ఇదే అంటూ అసలు గుట్టు బయటపెట్టాడు.   

PREV
17
సుధీర్‌, రష్మి పెళ్లిపై బాంబ్‌ పేల్చిన `జబర్దస్త్` కమేడియన్.. ఫ్యాన్స్ కిది నిజంగా బ్యాడ్‌ న్యూసే

తెలుగు టీవీ రంగంలో పాపులర్‌ షో `జబర్దస్త్`(Jabardasth), పాపులర్‌ కమేడియన్లు సుడిగాలి సుధీర్‌(Sudigali Sudheer), హైపర్‌ ఆది, గెటప్‌శ్రీను, రాంప్రసాద్‌, కిర్రాక్ ఆర్పీ, మెనేజర్‌ ఏడుకొండలు మధ్య వివాదం ముదురుతోంది. `జబర్దస్త్` నిర్వహకులు మల్లెమాల సంస్థపై అనేక విమర్శలు వస్తున్నాయి. కొందరు సమర్ధిస్తుంటే, మరికొందరు విమర్శలు చేస్తున్నారు. మొత్తంగా `జబర్దస్త్` షో ఇప్పుడు వివాదంగా మారిపోతుంది. 
 

27

తెలుగు టీవీ షోస్‌లో `జబర్దస్త్` అత్యంత వినోదాన్ని పంచే షోగా పేరు తెచ్చుకుంది. ఇది దాదాపు తొమ్మిదేళ్లుగా రన్‌ అవుతుంది. అత్యధిక టీఆర్పీ రేటింగ్‌ని సొంతం చేసుకుంది. ఎంతో మంది ఈ షో ద్వారా స్టార్లు అయ్యారు. అదే సమయంలో ఈ షో ప్రేమికులను కూడా తయారు చేస్తుందనే కామెంట్లని ఎదుర్కొంటుంది. రష్మి-సుధీర్‌ జోడీ(Rashmi-Sudheer), ఇమ్మాన్యుయెల్‌-వర్ష, రాకేష్‌-సుజాతల జోడీలే అందుకు ఉదాహరణగా చెప్పొచ్చు.

37

వీటిలో మొదట్నుంచి పాపులర్‌ అయిన జంట రష్మి-సుధీర్‌ జోడి. వీరిద్దరు కలిసి `జబర్దస్త్` వేదికపై ఎన్నో డ్యూయెట్లు పాడుకున్నారు. ప్రేమ కథలు చెప్పుకున్నారు. లవ్‌ ఎక్స్ ప్రెస్‌ చేసుకున్నారు. అంతేకాదు స్టేజ్‌పై అనేకసార్లు పెళ్లిళ్లు కూడా చేసుకున్నారు. రొమాంటిక్‌ పాటలతో హీటు పెంచారు. మొత్తానికి `జబర్దస్త్` షోకి రావాల్సిన గుర్తింపుని, రేటింగ్‌ని తీసుకొచ్చారు. తరచూ ఈ జోడి హైలైట్‌ అవుతుండటం విశేషం. 

47

అయితే రష్మి(Rashmi Gautsm), సుధీర్‌ ప్రేమ కేవలం `జబర్దస్త్`కే పరిమితమని , వాళ్లు స్కిట్ల కోసమే చేస్తున్నారనే కామెంట్లు వచ్చినా, వారిద్దరి మధ్య కెమిస్ట్రీ పండే విధానం చూస్తుంటే వారి రియల్ లైఫ్‌లోనూ బాండింగ్‌ ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాదు ఈజంటకి సోషల్‌ మీడియాలో ప్రత్యేకమైన ఫాలోయింగ్‌, అభిమానులు కూడా ఏర్పడ్డారు. సుధీర్‌ `జబర్దస్త్` వీడినప్పట్నుంచి వాళ్లు కామెంట్లు పెడుతున్నారు. మళ్లీ సుధీర్‌ రావాలని,రష్మితో కలిసి రచ్చ చేయాలని కోరుకుంటున్నారు. లక్షలాది మంది వీరి బాండింగ్‌ని నిజమే అని నమ్ముతున్నారు. 
 

57

నెటిజన్లు, సోషల్‌ మీడియా ఫ్యాన్స్ తమ అభిమాన తారలు రష్మి- సుధీర్‌ పెళ్లి చేసుకుంటారనే నమ్మకంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో దీనిపై మరో క్రేజీ కమేడియన్ గెటప్‌ శ్రీను స్పందించారు. రష్మి-సుధీర్‌ రిలేషన్‌పై ఓపెన్‌ అయ్యారు. అభిమానులకు పెద్ద షాకించే విషయం బయటపెట్టారు. గుండెల్లో బాంబ్‌ వేసినంత పనిచేశారు గెటప్‌ శ్రీను. 
 

67

శ్రీను ని చాలా మంది అభిమానులు రష్మి, సుధీర్‌ల పెళ్లి గురించి ప్రశ్నిస్తున్న నేపథ్యంలో ఓ సెల్ఫీ వీడియోని షేర్‌ చేశారు గెటప్‌ శ్రీను. సుధీర్‌, రష్మి పెళ్లి చేసుకోరని తెలిపారు. వారి బాండింగ్‌ కేవలం `జబర్దస్త్` షోకే పరిమితమని, షో తర్వాత వారిద్దరి దారులు వేరే అని పేర్కొన్నారు. షో పూర్తయ్యిందంటే రష్మిది వేరే లోకం అని, సుధీర్‌ తనఫ్రెండ్స్ తో బిజీగా ఉంటారని, బయట వాళ్లు కలుసుకోవడమనేది జరగదని తెలిపారు. జనాలను ఎంటర్‌టైన్‌ చేయడానికే కలిసి నటిస్తున్నారని, రియల్ లైఫ్‌లో వారిద్దరు వేరని స్పష్టం చేశారు. అభిమానుల గుండెల్లో పిడుగులాంటి వార్తని వెల్లడించారు.  దీంతో సుధీర్‌, రష్మి కలవాలని కోరుకునే అభిమానులు షాక్‌లోకి వెళ్లడం విశేషం. 
 

77

శ్రీను కూడా చాలా రోజుల క్రితం నుంచే `జబర్దస్త్` ని వీడిన విషయం తెలిసిందే. ఆయన సినిమాల్లో కమేడియన్‌గా పాత్రలు చేస్తూ బిజీగా ఉన్నాడు. మరోవైపు సుధీర్‌ హీరోగా నటిస్తున్నారు. ఆయన చేతిలో ప్రస్తుతం నాలుగు సినిమాలున్నాయి. `వాంటెడ్‌ పండుగాడ్‌`, `గాలోడు` వంటి చిత్రాలు ప్రముఖంగా చెప్పొచ్చుకోవచ్చు. ఇక సుధీర్‌ వెళ్లిపోవడంతో `శ్రీదేవి డ్రామా కంపెనీ`కి కూడా రష్మినే హోస్ట్ గా చేస్తుండటం విశేషం. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories