బోట్ పై షికారు చేస్తున్న ‘ఎఫ్3’ బ్యూటీ.. మినీ డ్రెస్ లో మెస్మరైజ్ చేస్తున్న మెహ్రీన్ పిర్జాదా..

Published : Jul 15, 2022, 12:06 PM ISTUpdated : Jul 15, 2022, 12:10 PM IST

యంగ్ హీరోయిన్ మెహ్రీన్ పిర్జాదా తన హాలీడేస్ ను తెగ ఎంజాయ్ చేస్తోంది. విదేశాల్లో విహరిస్తున్న ఈ బ్యూటీ లేటెస్ట్ గా స్ట్రీమర్ పై దర్శనమిచ్చింది. తను పోస్ట్ చేసిన పిక్స్ మతిపోగొడుతున్నాయి.  

PREV
16
బోట్ పై షికారు చేస్తున్న ‘ఎఫ్3’ బ్యూటీ.. మినీ డ్రెస్ లో మెస్మరైజ్ చేస్తున్న మెహ్రీన్ పిర్జాదా..

పంజాబీ బ్యూటీ మెహ్రీన్ పిర్జాదా (Mehreen Pirzada) తన కేరీర్ ను మోడలింగ్ తోనే ప్రారంభించింది. అక్కడ మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీకి సినీ అవకాశాలు వరించాయి. 2016లో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముందుగా ప్రస్తుతం తెలుగు, తమిళంలో వరుస ఆఫర్లను దక్కించుకుంటోంది.
 

26

నేచురల్ స్టార్ నానితో ‘క్రిష్ణగాడి వీర ప్రేమ గాధ’చిత్రంతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది. ఈ చిత్రంతోనే సినీ రంగ ప్రవేశం చేసింది. తొలిసినిమాతోనే అటు గ్లామర్ పరంగానూ.. ఇటు నటన పరంగానూ వంద మార్కులు వేయించుకుందీ బ్యూటీ. అప్పటి నుంచి  బ్యాక్ టు బ్యాక్ చిత్రాల్లో నటిస్తూ తన అభిమానులను ఫిదా చేస్తోంది. 
 

36

మెహ్రీన్ టాలీవుడ్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పటి వరకు తను తెలుగు సినిమాల్లోనే ఎక్కువగా నటించింది. అయితే ఈమెకు బ్రేక్ ఇచ్చింది మాత్రం దర్శకుడు అనిల్ రావిపూడి అని చెప్పాలి. గతంలో మాస్ మహారాజా రవితేజ నటించిన ‘రాజా ది గ్రేట్’ చిత్రంలో మెహ్రీన్ ను హీరోయిన్ గా ఎంపిక చేశారు. ఆ చిత్రం సక్సెస్ సాధించడంతో మెహ్రీన్ కు మైలేజ్ పెరిగింది.
 

46

మళ్లీ ‘ఎఫ్2’లోనూ అవకాశం ఇచ్చి మరో హిట్ ను ఆమె ఖాతాలో చేర్చేలా చేశాడు. ఈ మూవీకి సీక్వెల్ గా వచ్చిన ‘ఎఫ్3’లోనూ మెహ్రీన్ హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. కరోనా పరిస్థితుల తర్వాత తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన చిత్రం ‘ఎఫ్3’. అటు కలెక్షన్స్ లోనూ పర్లేదు అనిపించింది.

56

ఇదిలా ఉంటే మెహ్రీన్ సినిమాల్లో మెరుస్తూనే.. తన పాపులారిటీని మరింత పెంచుకునేందుకు సోషల్ మీడియాలోనూ తెగ యాక్టివ్ గా కనిపిస్తోంది. లేటెస్ట్ ఫొటోషూట్లు, తన వ్యక్తిగత విషయాలను షేర్ చేసుకుంటూ తన అభిమానులు, ఫాలోవర్స్ కు మరింత దగ్గరవుతోంది. తాజాగా తన వేకేషన్ పిక్స్ ను షేర్ చేసుకుంది.

66

ఈ పిక్స్ లో మెహ్రీన్ విదేశంలోని ఓ బీచ్ వద్ద స్ట్రీమర్ పై దర్శనమిచ్చింది. స్విమ్ సూట్ ధరించిన ఈ బ్యూటీ.. నెక్కరూ ధరించి స్టన్నింగ్ గా కనిపించింది. థండర్ థైస్ చూపిస్తూ గ్లామర్ షో చేస్తోంది. అయితే తన ఫ్యామిలీతో పాటు ఇలా హాలీడేస్ ను ఎంజాయ్ చేస్తోంది మెహ్రీన్. ఆమె పోస్ట్ చేసిన పిక్స్ కు అభిమానులు లైక్స్, కామెంట్లు పెడుతూ.. వైరల్ చేస్తున్నారు. 

click me!

Recommended Stories