కడసారి చూపు కూడా దక్కలేదు, జబర్దస్త్ స్కిట్ చేస్తూ పక్కకి వెళ్లి ఏడ్చా.. ఇమ్మాన్యుయేల్ ఎమోషనల్

First Published May 25, 2024, 1:19 PM IST

ఇమ్మాన్యుయేల్ త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆనంద్ దేవరకొందా హీరోగా నటించిన గంగం గణేశా చిత్రం మే 31న రిలీజ్ అవుతోంది. ఈ మూవీలో ఇమ్మానుయేల్ హీరో ఫ్రెండ్ పాత్రలో నటిస్తున్నాడు.

జబర్దస్త్ తో పాపులారిటీ సొంతం చేసుకున్న కమెడియన్లంతా సినిమాల్లో బిజీ అవుతున్నారు. ఇప్పటికే సుడిగాలి సుధీర్ హీరోగా రాణిస్తున్నాడు. హైపర్ ఆది పలు చిత్రాల్లో అవకాశాలు అందుకుంటున్నాడు. గెటప్ శ్రీను కూడా రాజు యాదవ్ అంటూ హీరోగా అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. చమ్మక్ చంద్ర, ఆటో రాంప్రసాద్ లాంటి వాళ్ళకి కూడా సినిమా అవకాశాలు వస్తున్నాయి. 

ఇమ్మాన్యుయేల్ త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆనంద్ దేవరకొందా హీరోగా నటించిన గంగం గణేశా చిత్రం మే 31న రిలీజ్ అవుతోంది. ఈ మూవీలో ఇమ్మానుయేల్ హీరో ఫ్రెండ్ పాత్రలో నటిస్తున్నాడు. తనది ఫుల్ లెన్త్ రోల్ కావడంతో ఇమ్మాన్యుయేల్ గంగం గణేశా పై ఆశలు పెట్టుకున్నాడు. 

ట్రైలర్ లో ఇమ్మాన్యుయేల్ కామెడీ టైమింగ్ చాలా చక్కగా ఉంది. ప్రస్తుతం ఆనంద్ దేవరకొండతో కలసి ఇమ్మాన్యుయేల్ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు. తాజాగా ఇంటర్వ్యూలో ఇమ్మాన్యుయేల్ జబర్దస్త్ చేస్తున్నప్పుడు ఎదురైనా విషాదకర సంఘటన గురించి వివరించాడు. 

జబర్దస్త్ లోకి వచ్చిన కొత్తల్లో నాకు అప్పుడప్పుడే మంచి పేరు వస్తోంది. ఒకరోజు షూటింగ్ జరుగుతున్న సమయంలో మా నాన్న ఫోన్ చేశారు. తాతయ్య మరణించారు అని చెప్పాడు. మా తాత అంటే నాకు చాలా ఇష్టం. కానీ నేను అప్పుడు వెళ్ళిపోతే జబర్దస్త్ మొత్తం డిస్టర్బ్ అవుతుంది. 

వెళ్లలేని పరిస్థితి..పక్కకి వెళ్లి వెక్కి వెక్కి ఏడ్చా. కళ్ళు తుడుచుకుని స్టేజిపైకి వచ్చి స్కిట్ పెర్ఫామ్ చేశా. ఆ స్కిట్ అద్భుతంగా వచ్చింది. నేను చేసిన బెస్ట్ స్కిట్స్ లో అది కూడా ఒకటిగా ఉంటుంది. మా తాత మరణించాడనే బాధ మరిచిపోవడానికి బహుశా బాగా పెర్ఫామ్ చేశానేనో. 

స్కిట్ పూర్తయ్యాక ఇంటికి వెళితే అప్పటికే అంత్యక్రియలు ముగిసాయి. మా తాత కడసారి చూపు కూడా దక్కలేదు అని ఇమ్మాన్యుయేల్ ఎమోషనల్ అయ్యాడు. కొన్నిసార్లు ఇలాంటి ఇబ్బందులు, కష్టాలు తప్పవని పేర్కొన్నాడు.

click me!