అందుకే హైపర్ ఆది నా టీమ్ నుండి వెళ్ళిపోయాడు... విభేదాలపై ఓపెన్ అయిన అదిరే అభి!

First Published May 25, 2024, 12:35 PM IST

హైపర్ ఆదిని జబర్దస్త్ కి తెచ్చిన కమెడియన్ అదిరే అభి. అయితే కొన్నాళ్ళకు హైపర్ ఆది సొంత టీమ్ ఏర్పాటు చేసుకున్నాడు. గురువుకు వెన్నుపోటు పొడిచాడు. ఇద్దరికి విబేధాలు ఉన్నాయని వార్తలు వచ్చాయి. తాజాగా అదిరే అభి ఈ వార్తలపై స్పందించాడు. 
 

జబర్దస్త్ లో హైపర్ ఆది ఒక సెన్సేషన్. హైపర్ ఆది-రైజింగ్ రాజు టీమ్ అనేక వండర్స్ క్రియేట్ చేసింది. జబర్దస్త్ లో వీరి టీమ్ టాప్. హైపర్ ఆది నాన్ స్టాప్ పంచులతో నవ్వించేవాడు. రైజింగ్ రాజు, శాంతి స్వరూప్ ల మీద ఆయన వేసే పంచులు తూటాల్లా పేలేవి. 
 

హైపర్ ఆది అనతి కాలంలో స్టార్ కమెడియన్ గా ఎదిగాడు.   తిరుగు లేని స్థాయికి  వెళ్ళాడు. ఒక దశలో హైపర్ ఆది లేకపోతే జబర్దస్త్ లేదన్నట్లు తయారైంది. ఆయన ప్రత్యేక ఆకర్షణగా మారాడు. అదే సమయంలో హైపర్ ఆది విమర్శలు కూడా ఎదుర్కొన్నాడు. 
 


హైపర్ ఆదిని అదిరే అభి జబర్దస్త్ కి పరిచయం చేశాడు. అత్తారింటికి దారేది సన్నివేశాన్ని అదిరే అభి స్పూఫ్ చేశాడు. ఆ వీడియో అదిరే అభికి పంపాడట. అది చూసిన అదిరే అభి ఒకసారి కలవు తమ్ముడు అని హైపర్ ఆదితో అన్నాడట. అలా అదిరే అభి టీమ్ లోకి వచ్చిన హైపర్ ఆది... స్కిట్స్ రాయడం నేర్చుకున్నాడు. 

Hyper Aad

హైపర్ ఆది కామెడీ పంచులు అదిరే అభి టీమ్ లో హైలెట్ అయ్యాయి. దాంతో ఆ టీమ్ లో హైపర్ ఆది సెకండ్ పొజిషన్ కి వెళ్ళాడు. ఫేమ్ వచ్చిన వెంటనే ఆది సొంత కుంపటి పెట్టుకున్నాడు. హైపర్ ఆది-రైజింగ్ రాజు టీమ్ జబర్దస్త్ ప్రేక్షకుల హాట్ ఫేవరేట్ అయ్యింది. హైపర్ ఆది-అదిరే అభి కి గొడవలు వచ్చాయి. అందుకే హైపర్ ఆది సొంతగా టీం ఏర్పాటు చేసుకున్నాడనే వాదన ఉంది 
 

Hyper Aad


ఈ పుకార్ల మీద అదిరే అభి స్పందించాడు. హైపర్ ఆదితో తనకు ఎలాంటి విభేదాలు లేవని ఆయన అన్నారు. కొత్త టీమ్స్ ఏర్పాటు చేయడం కోసం రెండవ స్థానంలో ఉన్నవాళ్లను బయటకు తీశారు. ఆ విధంగా నా టీమ్ నుండి హైపర్ ఆది బయటకు వ్ వెళ్ళాడు. విభేదాల వలన కాదని క్లారిటీ ఇచ్చాడు. 

click me!