`జబర్దస్త్` అభిమానులకు బ్యాడ్‌ న్యూస్‌.. త్వరలో కామెడీ షో క్లోజ్‌.. కారణం ఇదే..

Published : Dec 05, 2023, 10:13 PM IST

తెలుగు టీవీ షోస్‌లలో నవ్వులు పూయిస్తూ పదేళ్లుగా విజయవంతంగా రన్‌ అవుతుంది `జబర్దస్త్` కామెడీ షో. తాజాగా దీనికి సంబంధించిన బ్యాడ్‌ న్యూస్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది.   

PREV
17
`జబర్దస్త్` అభిమానులకు బ్యాడ్‌ న్యూస్‌.. త్వరలో కామెడీ షో క్లోజ్‌.. కారణం ఇదే..

`జబర్దస్త్` కామెడీ షో ప్రారంభమై పదేళ్లు దాటింది. ఈ ఏడాది ఫిబ్రవరితోనే పదేళ్లు పూర్తి చేసుకుంది. ఈ కామెడీ షో ద్వారా ఎంతో మంది కమెడియన్లు బయటకు వచ్చారు. పాపులర్ అయ్యారు. స్టార్లుగా ఎదిగారు. అలాగే జడ్జ్ లు వచ్చారు. నాగబాబు, రోజా జడ్జ్ లుగా చేశారు. దీంతోపాటు యాంకర్లు వచ్చారు, మారిపోయారు. రష్మి, అనసూయ వంటి వారు యాంకర్లుగా కొనసాగిన విషయం తెలిసిందే. 
 

27
Anasuya Bharadwaj

అయితే గత రెండేళ్లుగా `జబర్దస్త్` షోలో చాలా మార్పులు చోటుచేసుకుంది. కమెడియన్లు మారిపోయారు. జడ్జ్ లు మారిపోయారు. కాంబినేషన్స్‌మారిపోయాయి. యాంకర్‌ అనసూయ కూడా షో నుంచి తప్పుకుంది. మరోవైపు సుడిగాలి సుధీర్‌, హైపర్‌ ఆది, చమ్మక్‌ చంటి, అవినాష్‌ వంటి ఆర్టిస్ట్ లు షోకి గుడ్‌ బై చెప్పారు. సినిమాల్లో వాళ్లు బిజీ కావడంతో వాళ్లు జబర్దస్త్ ని వదిలేశారు. 
 

37

నిజానికి సుడిగాలి సుధీర్‌, హైపర్‌ ఆదిలు మానేసిన తర్వాత షోకి వన్నే తగ్గిపోయింది. ఆ స్థాయి కామెడీ వర్కౌట్‌ కావడం లేదు. అంతకు ముందు సుధీర్‌, రష్మిల కోసం షో చూసే వారు. వారిద్దరి మధ్య కెమిస్ట్రీ అంతబాగా వర్కౌట్‌ అయ్యేది. ప్రతి వారం పేలుతుండేది. కానీ ఇటీవల అది లేదు. దీంతో దీనికి క్రేజ్‌ తగ్గింది. దీనికితోడు యాంకర్‌గా అనసూయ కూడా తప్పుకుంది. దీంతో గ్లామర్‌ పాళ్లు కూడా తగ్గాయి. 
 

47
Jabardasth show

ఆమె స్థానంలో సౌమ్యరావు యాంకర్ గా వచ్చింది. కానీ అనసూయ ప్లేస్‌ని రీప్లేస్‌ చేయలేకపోయింది. అటూ అందంలోనూ, మరోవైపు యాంకరింగ్‌లోనూ ఏదో లోటు కనిపించింది. ఓ వైపు `జబర్దస్త్` షోలో ఈ లోటు ఉంటే. మరోవైపు `ఎక్స్ ట్రా జబర్దస్త్`లో సుధీర్‌ లేని లోటు కనిపించింది. ఇలా రెండు షోలకు క్రేజ్‌ తగ్గింది. పైగా కామెడీ స్కిట్లు ఆశించిన స్థాయిలో పేలడం లేదు. ఒకప్పుడు టాప్‌ రేటింగ్‌ షో గా నిలిచిన ఈ షోస్‌ ఇప్పుడు పేలవంగా మారాయి. దీనికితోడు జడ్జ్ ల కాంబినేషన్‌ కూడా మిస్‌ అయ్యింది. 
 

57
jabardasth show

ఆ మధ్య రోజా మానేయడంతో ఆమె స్థానంలో ఇంద్రజ, ఖుష్బూ వచ్చారు. ఇటీవల ఖుష్బూ కూడా మానేశారు. ఆమె స్థానంలో మహేశ్వరి వచ్చారు. మరింత డల్‌ అయిపోయింది. అలాగే సౌమ్య రావు స్థానంలో యాంకర్‌గా సిరి వచ్చింది. ఇది ఇంకా డల్‌ చేసింది. ఇవన్నీ జబర్దస్త్ షోని ఎఫెక్ట్ చేస్తూ వస్తున్నాయి. ఒకటి రెండు స్కిట్లు తప్ప మిగిలినవి అంతగా వర్కౌట్‌ కావడం లేదు. నవ్వులు పూయించలేకపోతున్నాయి. 

67

ఈ నేపథ్యంలో తాజాగా జబర్దస్త్ షో అభిమానులకు ఓ బ్యాడ్‌ న్యూస్‌ వినిపిస్తుంది. షోకి సంబంధించిన ఒక షాకింగ్‌ విషయం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. త్వరలో జబర్దస్త్ కామెడీ షో క్లోజ్‌ కాబోతుందని తెలుస్తుంది. మల్లెమాల టీమ్‌ `జబర్దస్త్` కామెడీ షోని క్లోజ్‌ చేయాలని భావిస్తుందట. షో ప్రారంభించి పదేళ్లు దాటిన నేపథ్యంలో ఇక దీన్ని క్లోజ్‌ చేయాలనుకుంటున్నారు. అయితే దీనికి సంబంధించిన కారణం ఆసక్తికరంగా మారింది. ఇటీవల షోకి క్రేజ్‌ తగ్గింది. రేటింగ్‌ తగ్గింది. ఆర్టిస్ట్ ల కామెడీ వర్కౌట్‌ కావడం లేదు. దీంతో రేటింగ్‌ పడిపోయినట్టు సమాచారం. 
 

77

జబర్దస్త్ కంటే ఇప్పుడు ఇతర షోస్‌ బాగా ఆదరణ పొందుతున్నాయి. శ్రీదేవి డ్రామా కంపెనీ. ఆదివారం స్టార్ మా, ఓటీటీ షో `కామెడీ స్టాక్ ఎక్స్ ఛేంజ్‌` వంటి షోస్‌ విశేషంగా ఆదరణ పొందుతున్నాయి. వాటి ముందు జబర్దస్త్ డీలా పడిపోతుంది. ఈ నేపథ్యంలో షోని క్లోజ్‌ చేయాలని మల్లెమాల నిర్వహకులు ఆలోచిస్తున్నారట. తెరవెనుక కసరత్తులు జరుగుతున్నట్టు తెలుస్తుంది. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. ఇదే నిజమైతే జబర్దస్త్ అభిమానులకు నిజంగా ఇది పెద్ద బ్యాడ్‌ న్యూస్‌ అనే చెప్పాలి.  
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories