ఆ డబ్బుల విషయంలో ఎంత పోరాటం చేస్తున్నా న్యాయం జరగడం లేదని వినోద్ బాధపడ్డారు. అలాగే తెలిసిన మరో వ్యక్తి అప్పు తీసుకుంటే నేను మధ్యలో షూరిటీగా ఉన్నాను. డబ్బులు తీసుకున్న వ్యక్తి చెల్లించకపోవడంతో షూరిటీగా ఉన్న నేను రూ. 5 లక్షలు కట్టాల్సి వచ్చింది. ఆసుపత్రి ఖర్చులతో పాటు ఇతర కారణాలతో మరో రూ. 3 లక్షలు ఖర్చు అయ్యాయి. మొత్తంగా కడుపు కట్టుకొని పోగొచేసిన రూ. 21 లక్షలు పోగొట్టుకున్నాను, అని వినోద్ తన దీనగాథ, జరిగిన అన్యాయం వివరించాడు.