నడిరోడ్డుపై ‘ఇస్మార్ట్’ బ్యూటీ కిర్రాక్ ఫోజులు.. క్రాప్డ్ టాప్ లో నభా నటేశ్ అందాల జల్లు..

First Published | Sep 12, 2023, 5:04 PM IST

యంగ్ బ్యూటీ నభా నటేశ్ (Nabha Natesh)  అదిరిపోయే ఫొటోషూట్లతో నెట్టింట అందాల దుమారం రేపుతోంది. తాజాగా అవుట్ డోర్ షూట్ తో అట్రాక్ట్ చేసింది. లేటెస్ట్ పిక్స్ ఆకట్టుకుంటున్నాయి. 
 

టాలీవుట్ యంగ్ హీరోయిన్ నభా నటేశ్ ప్రస్తుతం సినిమాల పరంగా ఎలాంటి జోరు చూపించడం లేదు.  కానీ సోషల్ మీడియాలో మాత్రం నయా లుక్స్ లో మెరుస్తూ అట్రాక్ట్ చేస్తోంది.  బ్యాక్ టు బ్యాక్ ఫొటోషూట్లతో అదరగొడుతోంది. 
 

కన్నడ చిత్రాలతో నటిగా తెరంగేట్రం చేసిన నభా నటేశ్ ‘నన్ను దోచుకుందువటే’ చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. అప్పటి నుంచి వరుస చిత్రాల్లో నటిస్తూ వస్తోంది. తెలుగు ప్రేక్షకులకు మరింతగా దగ్గరవుతోంది. 


‘అదుగో’, ‘ఇస్మార్ట్ శంకర్’, ‘డిస్కో రాజా’, ‘సోలో బ్రతుకే సో బెటర్’, ‘అల్లుడు అదుర్స్’, ‘మ్యాస్ట్రో’ వంటి చిత్రాల్లో నటించింది. కానీ, ఉస్తాద్ రామ్ పోతినేని సరసన నటించిన ‘ఇస్మార్ట్ శంకర్’తోనే మంచి క్రేజ్ దక్కించుకుంది.

ఇస్మార్ట్ శంకర్ తో వచ్చిన ఫేమ్ ను నభా సరిగానే వినియోగించుకునే ప్రయత్నం చేసింది. కానీ తదుపరి ఆమె చేసిన సినిమాల ఫలితాలు ఆశించిన మేర లేకపోవడంతో ఆపై పెద్దగా ఆఫర్లు అందుకోవడం లేదు. 
 

కానీ, సోషల్ మీడియాలో మాత్రం నభా నిత్యం యాక్టివ్ గానే కనిపిస్తోంది. వరుసగా ఫొటోషూట్లు చేస్తూ నయా లుక్ లో మైమరిపిస్తోంది. అదిరిపోయే అవుట్ ఫిట్లలో గ్లామర్ మెరుపులు మెరిపిస్తోంది. అందాల విందుతో అదరగొడ్తోంది. 
 

తాజాగా ఈ ముద్దుగుమ్మ అవుట్ డోర్ షూట్ చేసింది. టూర్ కు వెళ్తున్న ఈ బ్యూటీ.. మధ్యలో నడిరోడ్డుపైనే ఆగి ఫొటోషూట్ చేసింది. నడుము, నాభీ కనిపించేలా వైట్ క్రాప్డ్ టాప్, కార్గో జీన్స్ ధరించి ట్రెండీ లుక్ ను సొంతం చేసుకుంది. కిర్రాక్ ఫోజులతో ఆకట్టుకుంది. మరోవైపు నేచర్ అందాలను ఆస్వాదిస్తూ కనిపించింది. 
 

Latest Videos

click me!