ఉదయ్‌ కిరణ్‌ మరణానికి కారకులు వాళ్లే.. జబర్దస్త్ కమెడియన్‌ సంచలన వ్యాఖ్యలు..

Published : Mar 01, 2024, 07:50 PM IST

ఉదయ్‌ కిరణ్‌ ఒకప్పుడు యూత్‌ని ఊపేసిన హీరో. విశేషమైన అమ్మాయిల ఫాలోయింగ్‌ని సొంతం చేసుకున్న హీరో. ఆయన మరణంపై జబర్దస్త్ కమెడియన్‌ షాకింగ్‌ కామెంట్స్ చేశాడు.   

PREV
15
ఉదయ్‌ కిరణ్‌ మరణానికి కారకులు వాళ్లే.. జబర్దస్త్ కమెడియన్‌ సంచలన వ్యాఖ్యలు..

ఉదయ్‌ కిరణ్‌ మరణించి పదేళ్లు అవుతుంది. ఇప్పటికీ ఆయన ప్రస్తావన ఇండస్ట్రీలో వస్తూనే ఉంది. ఆయనకు సంబంధించని విషయాలు బయటకు వస్తూనే ఉన్నాయి. ఆయన సూసైడ్‌ చేసుకున్న నేపథ్యంలో ఆయన ఆత్మహత్యకి కారణం ఏంటనేది సస్పెన్స్ గానే నిలిచింది. దీంతో చాలా మంది చాలా రకాలుగా ఆయన మరణం పై కామెంట్లు చేస్తున్నారు. తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూనే ఉన్నారు. 
 

25

ఈ నేపథ్యంలో తాజాగా ఉదయ్‌ కిరణ్‌కి సంబంధించి జబర్దస్త్ కమెడియన్‌ చేసిన వ్యాఖ్యలు వైరల్‌ అవుతున్నాయి. జబర్దస్త్ కామెడీ షోలో ప్రారంభంలో మంచి కమెడియన్‌గా మెప్పించాడు షేకింగ్‌ శేష్‌. జబర్దస్త్ కమెడియన్లలోనే అత్యంత సీనియర్‌గా ఆయన ప్రత్యేకతని సొంతం చేసుకున్నారు. తనదైన కామెడీతో మెప్పించారు. అప్పట్లో టాప్‌ కమెడియన్‌గా రాణించారు. తాగుబోతు క్యారెక్టర్ తో పాపులర్‌ అయ్యారు. అలాగే మిమిక్రీతో పలు పాత్రలకు ప్రాణం పోశారు. 
 

35

జబర్దస్త్ లో పీక్‌లో రాణిస్తున్న సమయంలోనే సినిమా అవకాశాలను సొంతం చేసుకున్నారు. కొన్నాళ్లకి జబర్దస్త్ ని వదిలేసి పూర్తి స్థాయిగా సినిమాల్లోకి వచ్చాడు. త్వరగానే బిజీ అయ్యాడు. అయితే ఇప్పుడు మాత్రం ఆయనకు సినిమా అవకాశాలు లేవు. ఓ రకంగా కనుమరుగు అయ్యారు. ఈ క్రమంలో షేకింగ్‌ శేష్‌ ఓ యూట్యూబ్‌ ఛానెల్‌కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో తన పరిస్థితి గురించి వెల్లడించారు. తన జర్నీని తెలిపాడు. అదే సమయంలో ఉదయ్‌ కిరణ్‌పై కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

45

జబర్దస్త్ లో మంచి ఫామ్‌లో ఉన్నసమయంలోనే అనిల్‌ రావిపూడి పిలిచి `సుప్రీం` చిత్రంలో ఆఫర్‌ ఇచ్చినట్టు చెప్పాడు. దీంతో సినిమాల కోసం జబర్దస్త్ ని వదిలేసినట్టు వెల్లడించారు. అలా సినిమాల్లోకి వచ్చి వరుసగా ఆఫర్లని దక్కించుకుంటూ బిజీగా ఉన్నానని తెలిపారు. కానీ ఇటీవల ఆఫర్లు లేవట. సినిమా ఛాన్స్ లు ఇచ్చేవాళ్లు తగ్గిపోయారని తమని పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ క్రమంలో తనకు ఆత్మహత్య చేసుకోవాలనిపించిందని, కుటుంబాన్ని పోషించలేని వాడు ఆత్మహత్య చేసుకున్నట్టే అని, గొప్ప దర్శకుల సినిమాల్లో అవకాశాలు రాకపోతే బాధగా ఉంటుందన్నారు. 

55

ఈ క్రమంలో ఉదయ్‌ కిరణ్‌ ప్రస్తావన తీసుకొచ్చాడు షేకింగ్‌ శేష్‌. ఉదయ్‌ కిరణ్‌ కూడా అవకాశాలు రాకనే ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపాడు. అంతేకాదు ఆయన చావుకి ఆఫర్లు ఇవ్వని వాళ్లు కూడా కారణమే అని బాంబ్‌ పేల్చాడు. అయితే షేకింగ్‌ శేష్‌ చాలా రోజుల క్రితం చేసిన ఇంటర్వ్యూ ఇది. తాజాగా ట్రెండింగ్‌లోకి వచ్చింది. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories